Amla Tea: ఒకే ఒక్క టీ.. శరీరానికి 7 అద్భుత ప్రయోజనాలు.. తెలుసుకుంటే, అస్సలు వదిలిపెట్టరంతే..

ఇందులో విటమిన్-సి, కాల్షియం, ఐరన్, పొటాషియం వంటి పోషకాల నిధి. దీనితో పాటు, ఆమ్లా టీలో యాంటీ-ఆక్సిడెంట్ లక్షణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇది అనేక వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షించడంలో సహాయపడుతుంది.

Amla Tea: ఒకే ఒక్క టీ.. శరీరానికి 7 అద్భుత ప్రయోజనాలు.. తెలుసుకుంటే, అస్సలు వదిలిపెట్టరంతే..
Amla Tea

Updated on: Dec 26, 2022 | 7:50 AM

ఉసిరికాయ తినడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఉసిరి పొడి, ఉసిరికాయ జామ్, ఉసిరికాయ రసం, ఉసిరి చట్నీ వంటి అనేక విధాలుగా ఉసిరిని తినవచ్చు. కానీ, మీరు ఎప్పుడైనా ఉసిరి టీని తీసుకున్నారా. అవును, ఉసిరి టీ తాగడానికి రుచికరమైనది. అలాగే అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఆమ్లా టీ తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. ఎందుకంటే ఆమ్లా టీ విటమిన్-సి, కాల్షియం, ఐరన్, పొటాషియం వంటి పోషకాల నిధి. దీనితో పాటు, ఆమ్లా టీలో యాంటీ-ఆక్సిడెంట్ లక్షణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇది అనేక వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షించడంలో సహాయపడుతుంది. మరి ఉసిరి టీ తాగడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

ఉసిరి టీ తాగడం వల్ల కలిగే 7 ప్రయోజనాలు తెలుసుకుందాం..

1. రోగనిరోధక శక్తిని పెంచడంలో..

వింటర్ సీజన్‌లో రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలంటే ఉసిరి టీ తీసుకోవాలి. ఎందుకంటే ఉసిరి టీలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శీతాకాలంలో వైరస్‌లు, బ్యాక్టీరియా నుంచి మిమ్మల్ని సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది.

2. మధుమేహంలో ప్రయోజనం..

ఉసిరి టీ తీసుకోవడం మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తుంది. ఎందుకంటే ఉసిరిలో యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉన్నాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

3. బరువు తగ్గడంలో..

బరువు పెరగడం వల్ల ఇబ్బంది పడుతున్నారా.. అయితే, బరువు తగ్గాలని కోరుకుంటే, మీరు తప్పుకుండా ఆమ్లా టీని తీసుకోవాలి. ఎందుకంటే ఆమ్లా టీని తీసుకోవడం వల్ల జీవక్రియను పెంచుతుంది. దీంతో ఈజీగా బరువు తగ్గవచ్చు.

4. శరీరం డిటాక్స్..

ఆమ్లా టీ తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్‌ను తొలగించడం మంచిది. ఎందుకంటే ఈ టీ తీసుకోవడం వల్ల శరీరం డిటాక్స్ అవుతుంది. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

5. జీర్ణవ్యవస్థ బలపడుతుంది..

ఆమ్లా టీ తీసుకోవడం వల్ల పొట్టకు చాలా మేలు జరుగుతుంది. ఎందుకంటే ఆమ్లా టీలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది. మలబద్ధకం, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలను అధిగమించడానికి సహాయపడుతుంది.

6. చర్మానికి ప్రయోజనకరం..

ఆమ్లా టీ తీసుకోవడం వల్ల చర్మానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి. ఎందుకంటే ఆమ్లా టీ తీసుకోవడం వల్ల టాక్సిన్స్ తొలగిపోయి రక్తాన్ని శుభ్రపరుస్తుంది. అలాగే ఉసిరిలో విటమిన్ సి లభిస్తుంది. ఇది అనేక చర్మ సంబంధిత సమస్యలను తొలగించి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

7. రక్తపోటు అదుపులో ఉంటుంది..

రక్తపోటు ఉన్న రోగులకు ఆమ్లా టీ తీసుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే రక్తపోటును నియంత్రించడంలో సహాయపడే ఆమ్లా టీలో ఇటువంటి అనేక అంశాలు ఉన్నాయి. దీని వల్ల గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం కేవలం అవగాహన కోసమే అని గుర్తించాలి. డాక్టర్ల అభిప్రాయానికి ఇది ఏ విధంగానూ ప్రత్యామ్నాయం కాదు. ఏదైనా పద్ధతులు పాటించాలనుకుంటే కచ్చితంగా వైద్యుడిని సంప్రదించడం చాలా మంచిది.

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..