Cauliflower Side effects : క్యాలీఫ్లవర్ ఇష్టమని అతిగా తింటున్నారా? అయితే జాగ్రత్త..! భారీ నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది..

|

Mar 25, 2023 | 3:09 PM

క్యాలీఫ్లవర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయంటారు. యూరిక్ యాసిడ్ ఉన్నవారికి కాలీఫ్లవర్ మంచిది కాదు. మీకు థైరాయిడ్ సమస్యలు ఉంటే కాలీఫ్లవర్ కొన్నిసార్లు సమస్యలను కలిగిస్తుంది. ఇంకా..

Cauliflower Side effects : క్యాలీఫ్లవర్ ఇష్టమని అతిగా తింటున్నారా? అయితే జాగ్రత్త..! భారీ నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది..
Cauliflower Leaves
Follow us on

కాలీఫ్లవర్ సీజనల్‌ కూరగాయ. ప్రతి శీతాకాల సీజన్‌లో విరివిగా లభిస్తుంది. క్యాలీఫ్లవర్ అంటే చాలా మందికి ఇష్టం. క్యాలీఫ్లవర్‌ రోస్ట్, క్యాలీఫ్లవర్ కర్రీ, మంచూరియా తయారు చేసుకుని తింటారు. అయితే క్యాలీఫ్లవర్ ఎక్కువగా తింటే ఏమౌతుందో తెలుసా? దానివల్ల కలిగే సమస్యలు తెలిస్తే.. ఇకపై దూరంగా ఉంటారు. క్యాలీఫ్లవర్ తిన్న తర్వాత చాలా మందికి కడుపులో అసౌకర్యం కలుగుతుంది.

కాలీఫ్లవర్‌లో విటమిన్ ఎ, బి, సి ఉంటాయి. క్యాలీఫ్లవర్‌లో కాల్షియం, ఫాస్పరస్, ప్రోటీన్ కార్బోహైడ్రేట్లు కూడా ఉంటాయి. కాలీఫ్లవర్‌లో పొటాషియం కూడా ఉంటుంది. కొద్ది మొత్తంలో రాగి కూడా కలిగి ఉంటుంది. అయితే, ఇలాంటి క్యాలీఫ్లవర్‌ని చాలా మంది తినరు. ఎందుకంటే.. క్యాలీఫ్లవర్ ఎక్కువగా తినడం వల్ల గ్యాస్ సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది. క్యాలీఫ్లవర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయంటారు. యూరిక్ యాసిడ్ ఉన్నవారికి కాలీఫ్లవర్ మంచిది కాదు. మీకు థైరాయిడ్ సమస్యలు ఉంటే కాలీఫ్లవర్ కొన్నిసార్లు సమస్యలను కలిగిస్తుంది. ఎందుకంటే ఇది T-3, T-4 హార్మోన్ల స్రావాన్ని పెంచుతుంది. ఇది థైరాయిడ్‌ బాధితులకు అంత మంచిది కాదు.

కాలీఫ్లవర్ తింటే కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. కానీ వెంటనే ఆకలి వేస్తుంది. ఫలితంగా తిన్నవెంటనే మళ్లీ ఆకలితో ఏదొకటి తినేస్తారు. అలాగే బ్లడ్ థినర్స్ తీసుకుంటున్న వారు కూడా క్యాలీఫ్లవర్ కు దూరంగా ఉండటం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. దీనిలో విటమిన్ కె ఉండటం వల్ల బ్లడ్ థినర్స్ తీసుకునే వారు దీనిని ఎక్కువగా తీసుకోకూడదు. గుండెపోటు వచ్చిన చాలా మంది రక్తం పల్చబడటానికి మందులు తీసుకుంటారు ఈ సందర్భంలో కాలీఫ్లవర్ వారికి ప్రమాదకరం.

ఇవి కూడా చదవండి

క్యాలీఫ్లవర్ తిన్న తర్వాత చాలా మందికి గ్యాస్ సమస్య ఉంటుంది. కాలీఫ్లవర్‌ను ఉడికించి.. ఆ ఉడకబెట్టిన నీటిని పారబోసి వేయించుకుంటే ఈ సమస్య తక్కువగా ఉంటుంది. అయినా కాలీఫ్లవర్ ఎక్కువగా తింటే.. గ్యాస్, గుండెల్లో మంట, అపానవాయువు కలిగిస్తుంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం..