Health Tips: ఈ ఆహారాలను రాత్రుళ్లు అస్సలు తినకూడదు.. ఎందుకో తెలుసా.?

|

Nov 14, 2022 | 8:45 AM

శరీరం ఎలప్పుడూ ఆరోగ్యవంతంగా ఉండాలంటే పోషకాహారం తినడం తప్పనిసరి. రోజంతా యాక్టివ్‌గా ఉండేందుకు..

Health Tips: ఈ ఆహారాలను రాత్రుళ్లు అస్సలు తినకూడదు.. ఎందుకో తెలుసా.?
Foods Not Eat At Night
Follow us on

‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్నారు పెద్దలు. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ఎవ్వరూ కూడా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించట్లేదు. అందుకే ఆరోగ్యంగా ఉండేందుకు చాలామంది జిమ్‌లలో తెగ కష్టపడాల్సి వస్తోంది. పర్యావరణ మార్పులు, ఆహారం, జీవనశైలి.. ఇలా మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. శరీరం ఎలప్పుడూ ఆరోగ్యవంతంగా ఉండాలంటే పోషకాహారం తినడం తప్పనిసరి. రోజంతా యాక్టివ్‌గా ఉండేందుకు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో పోషకాలు నిండిన ఆహారం తీసుకోవడమే కాదు.. రాత్రుళ్లు తీసుకునే ఆహారంలోనూ కొన్నింటికి దూరంగా ఉండాలి.

అసలు ఏయే ఆహారాలు.. ఏ సమయంలో తీసుకోవచ్చునో ఇప్పుడు తెలుసుకుందాం..

  • ఆలుగడ్డ: బంగాళదుంపలలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. వీటిని రాత్రుళ్లు తీసుకోకూడదు. శరీరానికి కావాల్సిన శక్తిని తక్కువ సమయంలో అందించే గుణం కలిగిన బంగాళదుంపలను బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకోవడం మంచిది.
  • వరి అన్నం: వరి అన్నాన్ని రాత్రిపూట తినకూడదు. రాత్రిపూట బదులుగా వరి అన్నం మధ్యాహ్నం తినడం మంచిది. ఇక రాత్రుళ్లు వరి అన్నం బదులుగా గోధుమ పిండితో చేసిన రొట్టెలు తినడం మేలు.
  • పెరుగు: పెరుగు రాత్రిపూట తీసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే పెరుగు త్వరగా జీర్ణం కాదు. కేవలం పగటి వేళలో మాత్రమే తినాలి.
  • మాంసం: పెరుగులాగే మాంసం కూడా త్వరగా జీర్ణం అవ్వదు. మాంసం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందుకే దీన్ని మధ్యాహ్నం తినడం మంచిది.
  • పాలు: పాలు జీర్ణం అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది. అందుకని రాత్రివేళ తీసుకోవడం మంచిది.

మరోవైపు అరటిపండ్లు శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. వీటిని బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకోవడం మంచిది. ఇక ఆపిల్‌లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. పాలతో కలిపి ఆపిల్‌ను అస్సలు తీసుకోకూడదు. ఇక మొలకెత్తిన విత్తనాలు, గింజలను నిద్రలేవగానే తీసుకుంటే శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఇవే కాకుండా చాక్లెట్లు, పుల్లని పండ్ల రసాలు, టమాటా సాస్, పిజ్జా, కాఫీ, టీ లాంటి వాటిని రాత్రుళ్లు అస్సలు తీసుకోకండి. ఈ ఆహారాలు తినడం వల్ల సరిగ్గా నిద్రపట్టకపోవచ్చు. కాబట్టి.. వీటికి దూరంగా ఉండటం మంచిదని వైద్యుల సూచన.

మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం..