Donkey Milk : వామ్మో గాడిద పాలు లీటరుకి పదివేలంట..! ఎందుకో ఇంత ఖరీదు..?

|

Aug 11, 2021 | 12:59 PM

Donkey Milk : గంగిగోవు పాలు గరిటెడైనను చాలు కడివెడైననేమి ఖరము పాలు ఇందులో ఎంత నిజం ఉన్నా ప్రస్తుత మార్కెటింగ్ యుగంలో అస్సలు సరిపోలడం లేదు. గోవు పాల కంటే ఖరము పాలు అంటే..

Donkey Milk : వామ్మో గాడిద పాలు లీటరుకి పదివేలంట..! ఎందుకో ఇంత ఖరీదు..?
Donkey Milk
Follow us on

Donkey Milk : గంగిగోవు పాలు గరిటెడైనను చాలు కడివెడైననేమి ఖరము పాలు ఇందులో ఎంత నిజం ఉన్నా ప్రస్తుత మార్కెటింగ్ యుగంలో అస్సలు సరిపోలడం లేదు. గోవు పాల కంటే ఖరము పాలు అంటే.. గాడిద పాలు ఎక్కువ ధరను పలుకుతున్నాయి. మహారాష్ట్ర ఉమర్గా పట్టణంలో గాడిద పాలకు భలే గిరాకీ ఉంది. లీటరు రూ. 10 వేల వరకు అమ్ముతున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. అయితే గాడిద పాలు ఎందుకు ఖరీదైనవో ఒక్కసారి తెలుసుకుందాం.

ఆవు, మేక పాలలో ప్రోటీన్ అధికంగా ఉన్నప్పుడు గాడిద పాలలో విటమిన్లు, ఖనిజాలతో సహా ట్రేస్ ఎలిమెంట్స్ అధికంగా ఉంటాయి. కొంతమంది పరిశోధకులు ఇది టైప్ II డయాబెటిస్ చికిత్సకు సహాయపడుతుందని నమ్ముతున్నారు. అయితే దీనికి ఎటువంటి శాస్త్రీయ ఆధారలు లేవు. గాడిద పాలు ఆవు పాల కంటే తక్కువ అలెర్జీని కలిగి ఉంటాయి. మానవ పాలకు దగ్గరగా ఉంటాయి అందువల్ల శిశువులకు తాగిపిస్తారు. అదనంగా గాడిద పాలలో వ్యాధి కారకాలు ఉండవు. గాడిద పాలను ఆరోగ్యానికి మాత్రమే కాదు సౌందర్య సాధనాలలో కూడా వాడుతారు. ఒక అధ్యయనం ప్రకారం దీనిని బ్యూటీ పౌడర్‌గా మార్చడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారు.

గాడిద పాలు చాలామంది ప్రత్యేకంగా భావిస్తారు. ఎందుకంటే గాడిద ప్రతిరోజూ ఒక లీటరు పాలను మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. భారతదేశంలో విస్తృతంగా అందుబాటులో లేనప్పటికీ ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఐరోపా అంతటా గాడిద పాలు ప్రజాదరణ పొందాయి. మనకు ఆవు, గేదె, మేక, ఒంటే పాల డెయిరీలను మాత్రమే చూశాము.. అయితే.. త్వరలో హర్యానా హిస్సార్‌లో గాడిదల పాల డెయిరీని ఎన్‌ఆర్‌సీఈ ప్రారంభించనుంది. హిసార్‌లోని ఎన్‌ఆర్‌సీఈ(NRCE) హలారి జాతి గాడిద నుంచి సేకరించిన పాలతో డెయిరీని తెరిచేందుకు ప్లాన్ చేస్తోంది. ఇందు కోసం గుజరాత్ లభించే హలారి జాతి గాడిదలను గుర్తించింది. ఇందు కోసం పది హలారి జాతి గాడిదల కోసం ఆర్డర్‌ చేసింది.

Allu Arjun: త్వరలో పట్టాలెక్కనున్న ‘ఐకాన్’ మూవీ.. అల్లు అర్జున్‌‌‌కు జోడీగా మరోసారి ఆ భామ..

IAS Officers Divorce: వారిద్దరూ ఐఏఎస్ టాపర్లు.. మతాలు వేరైనా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. కానీ ఇప్పుడు

Veg Momos Recipe: చైనీస్ వంటకం వెజ్‌మోమోస్ ఈజీగా టేస్టీగా ఇంట్లోనే తయారీ చేసుకోవడం ఎలా అంటే