మన శరీర ఆరోగ్యాన్ని కాపాడేందుకు పోషకాలు అత్యంత ముఖ్యమైనవి. ఎప్పుడైతే పోషకాలు సక్రమంగా అందుతాయో మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. మనలో చాలా మంది ఏదైనా అరోగ్య సమస్యకు గురవగానే బలం కోసం పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవడం ప్రారంభిస్తారు. అలా సమస్యకు లోనైనప్పుడు కాకుండా.. ముందుగానే జాగ్రత్త పడడం ఎంతో మంచిది. అందువల్ల పోషకాలు ఎక్కువగా ఉండే పప్పు ధాన్యాలు, శనగలు, వేరు శనగలు తీసుకోవాలని ఆరోగ్య, పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మార్కెట్‌లో విరివిగా లభించే శనగల్లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. శనగల్లో నాటు శనగలు, కాబూలీ శనగలు, ఆకుపచ్చ రంగులో ఉండే శనగలు కూడా ఉంటాయి. శనగలతో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మాంసంలో ఉన్న పోషకాలన్నీ శనగలలో కూడా పుష్కలంగా ఉంటాయని, అందుకే వీటిని పేదోడి బాదం అని కూడా అంటారని నిపుణులు పేర్కొంటున్నారు.
ఇక కొన్ని శనగలను నానబెట్టి మొలకలు వచ్చాక పచ్చివి తిన్నా, వేయించుకుని, ఉడికించుకుని తిన్నా ఆరోగ్యకరం. శనగల చాట్ అయితే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. శనగల్లో క్యాల్షియం, విటమిన్ ఏ, బీ, సీ, ఈ, కే, ఫాలేట్, మెగ్నీషియం, ఫాస్పరస్, సెలీనియం, ఫైబర్, ఐరన్ వంటి అనేక పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఎముకలకు సంబంధించిన ఎటువంటి సమస్యలు రాకుండా మనల్ని కాపాడుతాయి శనగలు. క్యాల్షియం లోపంతో బాధపడేవారికి శనగలు మంచి ఆహారమని అంటున్నారు నిపుణులు. శనగలను నిత్యం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..