Eating at Night : రాత్రిపూట ఎక్కువ తింటే ఏం జరుగుతుందో తెలుసా..? నిపుణుల పరిశోధనలో ఆశ్చర్యకరమైన నిజాలు..!

Eating at Night : భోజనం అనేది మితంగా తీసుకుంటే అమృతం అమితంగా తీసుకుంటే విషమని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు.

Eating at Night : రాత్రిపూట ఎక్కువ తింటే ఏం జరుగుతుందో తెలుసా..? నిపుణుల పరిశోధనలో ఆశ్చర్యకరమైన నిజాలు..!
Eating At Night

Updated on: Jun 14, 2021 | 7:18 AM

Eating at Night : భోజనం అనేది మితంగా తీసుకుంటే అమృతం అమితంగా తీసుకుంటే విషమని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. అందుకే తక్కువ తిని ఎక్కువ కాలం జీవించమని చెబుతారు. అయితే రాత్రిపూట భోజనం విషయంలో చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి. ముఖ్యంగా రాత్రి 8 గంటల తర్వాత భోజనం చేస్తే త్వరగా బరువు పెరుగుతారనే అపోహ చాలా మందిలో ఉంది. రాత్రి ఆలస్యంగా తింటే నిజంగానే బరువు పెరుగుతారా? లేదా ఇందతా అసత్య ప్రచారమేనా? అనే విషయంపై పరిశోధకులు అధ్యయనం కూడా చేశారు. వారి పరిశోధనలో ఆశ్చరకరమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి.

రాత్రిపూట ఎక్కువ ఆహారం తినడం వల్ల బరువు పెరగడమే కాకుండా, అనేక ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా నిద్రకు ముందు ఆహారం తినడం వల్ల అజీర్తి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. తద్వారా నిద్రకు భంగం వాటిల్లుతుంది. అందువల్ల బరువు తగ్గాలనుకునే వారు రాత్రి పూట తినకపోయినా ఫర్వాలేదని పరిశోధకులు చెబుతున్నారు. పడుకునే రెండు గంటల ముందు భోజనం చేయడం మంచిదని చెబుతున్నారు. అంతేకాక, ఊబకాయ సమస్య రావొద్దంటే మీ రోజూవారి కేలరీలు ట్రాక్‌ చేసుకుంటూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, కంటి నిండా నిద్ర పోవాలని సూచిస్తున్నారు.

ఇక రాత్రి వేళ ఆలస్యంగా తింటే బరువు పెరుగుతారన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. దీనిలో వాస్తవం లేదు. కాకపోతే, రాత్రి తినే ఆహార పదార్థాల వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది. రాత్రి తీపి ఎక్కువగా ఉండే స్వీట్స్‌, కార్బోనేటేడ్‌ డ్రింక్స్‌ తీసుకుంటాం. అదేవిధంగా సాల్ట్‌ ఎక్కువగా ఉండే స్నాక్స్‌ కూడా తింటుంటాం. వీటిలో కేలరీలు అధికంగా ఉంటాయి. ఇవి సహజంగానే బరువు పెరగడానికి దోహదం చేస్తాయి. అలాగే ఒత్తిడి, విసుగు, ఆందోళన నుంచి బయటపడటానికి కొంతమంది రాత్రిళ్లు ఎక్కువ మోతాదులో భోజనం చేస్తుంటారు. తద్వారా ఊబకాయం సమస్య బారిన పడతారు.

Healthy eyes : మీ కండ్ల ఆరోగ్యం మీ చేతుల్లోనే..! పదికాలాల పాటు చక్కగా చూడాలంటే ఈ ఆహారం మీ డైట్‌లో ఉండాల్సిందే..?

Horoscope Today: ఈ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది.. వ్యాపారాలలో కొంత ఇబ్బందులు తప్పవు

IRCTC Latest News: ఇవాళ్టి నుంచి పట్టాలెక్కనున్న స్పెషల్ ట్రైన్లు.. తిరిగి ప్రారంభమవుతున్న రైళ్లు ఇవే..