
అరటిపండ్లు తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనందరికీ తెలుసు. కానీ అరటి పువ్వు మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో మీకు తెలుసా?.. అరటి పువ్వు కూడా అరటి పండు వలే మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగిస్తుందట. పోషకాహార నిపుణుల ప్రకారం.. అరటి పువ్వులో ఫైబర్, ప్రోటీన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఇనుము పుష్కలంగా ఉంటాయట. ఇవి మన శరీరాన్ని అనేక తీవ్రమైన వ్యాధుల నుండి దూరంగా ఉంచడానికి సహాయపడుతాయట. కొన్ని రాష్ట్రాల్లో ఈ అరటి పువ్వును వంటకాల్లో కూడా ఉపయోగిస్తారట. అంతేకాదు ఆయుర్వేదంలో కూడా ఈ పువ్వును ఔషధంగా వాడుతారట. ఇన్ని ఉపయోగాలున్న ఈ పువ్వు ఎలాంటి ఆరోగ్య సమస్యలకు మంచిది? దీన్ని ఎందుకు తినాలో ఇక్కడ తెలుసుకుందాం.
టైప్ 2 డయాబెటిస్ రోగులకు అరటి పువ్వు ఒక దివ్య ఔషధం. దీని మన ఆహరంలో తీసుకోవడం వల్ల.. ఇది మన రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించడంతో పాటు వాటిని నియంత్రించడంలోనూ సహాయపడుతుంది. డయాబెటిస్ ఉన్నవారు ఈ పువ్వును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్లా అనే ప్రయోజనాలను పొందుతారు.
అరటిపువ్వుల్లో మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు, యాంటీ-డిప్రెసెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి మానసిక ఒత్తిడిని తగ్గించడం ద్వారా మీ మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అంతే కాదు, అవి ఒత్తిడిని ఎదుర్కోవడంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తాయి. అలాగే నిరాశ సంబంధిత సమస్యలను కూడా ఇది దూరం చేస్తుందట.
అరటి పువ్వు ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థకు ఒక మంచి ఎంపిక. ఇది కడుపు సంబంధిత వ్యాధులను దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. మీరు కడుపు నొప్పి, వాంతులు లేదా విరేచనాలు వంటి కడుపు సంబంధిత సమస్యలతో బాధపడుతుంటే, అరటి పువ్వును క్రమం తప్పకుండా తినడం చాలా మంచిది.
అరటి పువ్వులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఇది రక్తహీనతను నివారించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. అంతే కాదు, రక్తహీనతకు సంబంధించిన ఇన్ఫెక్షన్ల నుండి కూడా మిమ్మల్ని రక్షిస్తుంది. మీరు కూడా రక్తహీనతతో బాధపడుతుంటే, అరటి పువ్వును క్రమం తప్పకుండా తినడం చాలా మంచిది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.