చికెన్, మటన్ కాదు.. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కూరగాయ.. తిన్నారో అద్భుతాలే..

Fiddlehead Fern: ఆరోగ్యమే మహాభాగ్యం.. కానీ మనం తినే ఆహారంలో నిజంగా పోషకాలు ఉంటున్నాయా? పోషకాల కోసం మనం ఖరీదైన ఆహారాల వెంట పరుగులు తీస్తుంటే, హిమాలయాల్లో పెరిగే ఒక అరుదైన కూరగాయ సూపర్ ఫుడ్‌గా గుర్తింపు పొందింది. ఫిడిల్‌హెడ్ అని పిలిచే ఈ మొక్క రక్తహీనతను పారద్రోలడమే కాదు గుండె ఆరోగ్యానికి కూడా దివ్యౌషధంగా పనిచేస్తుంది.

చికెన్, మటన్ కాదు.. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కూరగాయ.. తిన్నారో అద్భుతాలే..
World Most Powerful Vegetable Fiddlehead Fern

Updated on: Jan 27, 2026 | 3:45 PM

చాలా మందికి నాన్ వెజ్ అంటే మస్త్ ఇష్టం. కొందరికి ముక్క లేనిదే ముద్ద దిగదు. కానీ చికెన్, మటన్ కంటే రుచికరమైన, పోషకాలు కలిగిన కూరగాయలు ఎన్నో ఉన్నాయి. ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం మాంసం, గుడ్లు మాత్రమే తినాలని చాలామంది అనుకుంటారు. కానీ ప్రకృతి ఒడిలో మటన్ కంటే ఎక్కువ ప్రోటీన్లు, చేపల కంటే ఎక్కువ పోషకాలు ఇచ్చే ఒక అద్భుతమైన కూరగాయ ఉందని మీకు తెలుసా..? హిమాలయాల్లో సహజంగా పెరిగే ఫిడిల్‌హెడ్ ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. దీన్ని లింగాకారం కూరగాయ అని కూడా పిలుస్తారు.

అసలు ఏంటీ ఫిడిల్‌హెడ్?

ఇది ఒక రకమైన ఫెర్న్ మొక్క. ఈ మొక్క ఆకులు పూర్తిగా విచ్చుకోకముందు.. చుట్ట చుట్టుకుని ఉన్న దశలో వీటిని సేకరిస్తారు. చూడటానికి వయోలిన్ తల భాగంలా లేదా శివలింగం ఆకారంలా ఉండటంతో దీనికి ఆ పేరు వచ్చింది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ వంటి పర్వత ప్రాంతాల్లో ఇవి విరివిగా లభిస్తాయి. మొక్కల ఆధారిత ఆహారం తీసుకునే వారికి ఇది ఒక వరం.

ఫిడిల్‌హెడ్ పోషకాలు..

ఒక కప్పు ఫిడిల్‌హెడ్స్‌లో దాదాపు 6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది కండరాల పుష్టికి చాలా అవసరం. సాధారణంగా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ చేపల్లో ఉంటాయి. కానీ కూరగాయల్లో ఇవి దొరకడం చాలా అరుదు. ఫిడిల్‌హెడ్స్ ఇందుకు మినహాయింపు. బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఇందులో కొవ్వు చాలా తక్కువ, ఫైబర్ చాలా ఎక్కువ.

ఇవి కూడా చదవండి

ఆరోగ్య ప్రయోజనాలు

రక్తహీనతకు చెక్: ఇందులో ఐరన్, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. రక్తహీనతతో బాధపడే మహిళలకు, వృద్ధులకు ఇది దివ్యౌషధం.

రోగనిరోధక శక్తి: విటమిన్-సి ఎక్కువగా ఉండటం వల్ల తరచూ జబ్బుల బారిన పడకుండా శరీరాన్ని కాపాడుతుంది.

క్యాన్సర్ నిరోధకం: ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి, క్యాన్సర్ కణాలు పెరగకుండా సహాయపడతాయి.

గుండెకు మేలు: సోడియం తక్కువగా, పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.

ఎలా వండుకోవాలి?

ఫిడిల్‌హెడ్స్ రుచికరమైనవే కానీ, వీటిని వండేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి..

  • వీటిని ఎప్పుడూ పచ్చిగా తినకూడదు. పచ్చిగా తింటే జీర్ణక్రియ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
  • ముందుగా వేడి నీళ్లలో బాగా ఉడికించి , ఆ తర్వాత ఫ్రై చేయడం లేదా సూప్, సలాడ్లలో వాడుకోవడం మంచిది.
  • దీని రుచి దాదాపుగా ఆస్పరాగస్ లాగా ఉంటుంది.

ప్రకృతి ప్రసాదించిన ఈ పర్వత ప్రాంత కూరగాయ, నేటి కాలంలో వచ్చే అనేక జీవనశైలి వ్యాధులకు విరుగుడుగా మారుతోంది. మీరు కూడా ఆరోగ్యంతో పాటు రుచిని కోరుకుంటే, ఫిడిల్‌హెడ్స్‌ని మీ డైట్‌లో చేర్చుకోవడానికి ప్రయత్నించండి.