అబ్బ చికెన్, మటన్.. లివర్ ఇష్టంగా తింటున్నారా..? వామ్మో, ఈ విషయాలను తెలుసుకోకపోతే..

నేటి సమాజంలో మాంసాహార సేవనం సర్వసాధారణమైంది. అయితే, ఇది షుగర్, బీపీ, గుండె జబ్బులు, లివర్ వ్యాధులు వంటి దీర్ఘకాలిక సమస్యలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా జంతు లివర్ ఆరోగ్యానికి మంచిదనే అపోహను వీడి, దానిని తినడం వల్ల కలిగే తీవ్ర అనర్థాలను అర్థం చేసుకోవడం అవసరం..

అబ్బ చికెన్, మటన్.. లివర్ ఇష్టంగా తింటున్నారా..? వామ్మో, ఈ విషయాలను తెలుసుకోకపోతే..
Mutton And Chicken Liver

Updated on: Apr 20, 2026 | 3:16 PM

ప్రస్తుత సమాజంలో మాంసాహార వినియోగం గణనీయంగా పెరిగింది. చాలా మంది వారానికి కనీసం రెండు సార్లైనా నాన్-వెజ్ తీసుకోకుండా ఉండలేకపోతున్నారు. మరికొందరైతే ప్రతిరోజూ మాంసాహారం తినడం అలవాటుగా చేసుకున్నారు. చాలామంది మటన్, చికెన్ ను ఇష్టంగా తింటారు. అయితే,  ఈ ఆహారపు అలవాట్లు శరీరాన్ని రోగాల నిలయంగా మారుస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్న వయసులోనే షుగర్, బీపీ, గుండె జబ్బులు, థైరాయిడ్, లివర్ సంబంధిత వ్యాధులు ప్రబలుతున్నాయి. వందేళ్లు జీవించాల్సిన మానవ శరీరం 50 ఏళ్లకే బలహీనపడి, అనారోగ్య సమస్యలతో సతమతమవుతోంది. ఈ దుస్థితికి మన ఆహారపు అలవాట్లే ప్రధాన కారణమని వైద్యులు విశ్లేషిస్తున్నారు.

మాంసాహారం తీసుకోవడం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కొరవడుతోంది. జంతు సంబంధమైన ఉత్పత్తులు శరీరంలో అనేక రోగాలకు దారి తీస్తున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. మానవ శరీరం వాస్తవానికి శాఖాహారానికే అనుకూలంగా రూపొందించబడిందని, కానీ మనం మాంసాహారాన్ని ఇష్టంగా తింటూ లేనిపోని కష్టాలు తెచ్చుకుంటున్నామని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ అలవాటు మన దేహాన్ని పలు బాధలకు గురిచేస్తోంది. మాంసాహారాన్ని తీసుకోకుండా ఉండటానికి ప్రయత్నిస్తే ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు.

ముఖ్యంగా జంతువుల లివర్ తినడంపై అపోహలు నెలకొన్నాయి. కొంతమంది పెద్దలు.. చికెన్ మటన్ లివర్ తింటే ఆరోగ్యం అని చెబుతూ ఉంటారు. అయితే, జంతు లివర్‌లో అనేక ఇబ్బందులు కలిగించే కారకాలు, వ్యర్థ పదార్థాలు ఉంటాయని వైద్యులు తెలియజేస్తున్నారు. లివర్ ఆరోగ్యానికి మంచిదనే ఉద్దేశ్యంతో ఎంతోమంది దానిని ఇష్టంగా తింటున్నారు. కానీ లివర్‌లోనే అనేక రకాల రోగాలు ఉండవచ్చని, దానిని తినడం వల్ల మనకు కూడా రోగాలు సంక్రమించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాస్తవానికి లివర్ లో ఎన్నో పోషకాలు దాగుంటాయి..

చికెన్, మటన్ లివర్ పిల్లలకు అస్సలు పెట్టకూడదని వైద్యులు కచ్చితంగా సూచిస్తున్నారు. ఇది అంత సురక్షితం కాదని, దానిలో ఉండే వ్యర్థ పదార్థాలు పిల్లల శరీరానికి తీవ్ర నష్టం కలిగిస్తాయని చెబుతున్నారు. దాదాపు నూటికి నూరు శాతం లివర్‌ను తినకుండా ఉండటమే మంచిదని వైద్యులు గట్టిగా సలహా ఇస్తున్నారు. మాంసాహారం, ముఖ్యంగా జంతువుల లివర్ సేవనాన్ని తగ్గించడం లేదా పూర్తిగా మానుకోవడం ద్వారా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి మన శరీరాన్ని రక్షించుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు స్పష్టం చేస్తున్నారు..

వాస్తవానికి చికెన్, మటన్ లివర్ లో చాలా పోషకాలు దాగున్నాయి.. వైద్యుల సలహాలు సూచనల మేరకు తీసుకోవచ్చు.. శరీర అవసరాలను బట్టి తీసుకోవచ్చు..

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us