Diabetes Diet: వంటింట్లోని వీటితో మధుమేహానికి చెక్.. తింటే బ్లడ్ షుగర్‌ లెవెల్స్‌పై మీదే కంట్రోల్..

|

May 07, 2023 | 1:33 PM

Diabetes Diet: డయాబెటిస్ సమస్యతో బాధపడేవారు జీవనశైలి, ఆహారం విషయంలో నిత్యం అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా తీసుకునే ఆహారం విషయంలో అడుగడుగునా నియమాలు పాటించాలి. వైద్య నిపుణుల ప్రకారం సరిపడినంత నిద్ర

Diabetes Diet: వంటింట్లోని వీటితో మధుమేహానికి చెక్.. తింటే బ్లడ్ షుగర్‌ లెవెల్స్‌పై మీదే కంట్రోల్..
Diet Plan to control Blood Sugar levels
Follow us on

Diabetes Diet: డయాబెటిస్ సమస్యతో బాధపడేవారు జీవనశైలి, ఆహారం విషయంలో నిత్యం అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా తీసుకునే ఆహారం విషయంలో అడుగడుగునా నియమాలు పాటించాలి. వైద్య నిపుణుల ప్రకారం సరిపడినంత నిద్ర, పోషకాలతో కూడిన ఆహారం తీసుకుంటే రక్తంలోని షుగర్ లెవెల్స్‌ని మన గుప్పిట్లో పెట్టుకోవచ్చు. ఈ క్రమంలో వంట గదిలో లభించే సుగంధ ద్రవ్యాలు లేదా మసాలా దినుసులు బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్ చేయడంలో కీలకంగా పనిచేస్తాయని వారు వివరిస్తున్నారు. వీటిలోని ఔషధ లక్షణాలు శరీరానికి అవసరమైనవిగా ఉండడంతో పాటు ఆరోగ్య సమస్యలను నిరోధిస్తాయని పేర్కొంటున్నారు. ఈ క్రమంలో బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను నియంత్రించడంలో డయాబెటిక్స్‌కి ఉపయోగపడే మసాలా దినుసులేమిటో ఇప్పుడు చూద్దాం..

మెంతులు: మెంతులు రుచికి చేదుగా ఉన్నా ఊబకాయం, కొలెస్ట్రాల్‌ సమస్యలను నివారించడంలో మెరుగ్గా సహాయపడుతుంది. ముఖ్యంగా మధుమేహుల రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతుంది. అలాగే శరీరంలో గ్లూకోస్ టాలరెన్స్‌ను మెరుగుపరుస్తుంది.

దాల్చిన చెక్క: ఇన్సులిన్ నిరోధకతను తగ్గించగలిగే శక్తి దాల్చిన చెక్కకు ఉంది. ఇంకా భోజనం తర్వాత శరీరంలో పెరిగే రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో, అదనపు కొవ్వులను కరిగించడంలో కీలకంగా పనిచేస్తుంది.

ఇవి కూడా చదవండి

అల్లం: అల్లంలో పుష్కలంగా ఉన్న యాంటీ డయాబెటిక్, హైపోలిపిడెమిక్, యాంటీ ఆక్సిడేటివ్ లక్షణాలు జీవక్రియను పెంచడంలో సహాయపడుతాయి. అలాగే రక్తంలోని చక్కెరను కూడా తగ్గించగలవు.

బ్లాక్ పెప్పర్: బ్లాక్ పెప్పర్ లేదా మిరియాలలోని ఔషధ లక్షణాలు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇంకా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో, శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో కూడా ఉపయోగకరంగా ఉంటాయి.

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న వివరాలు కేవలం సమాచారం కోసమే. ఇందులోని పద్ధతులు, చిట్కాలు పాటించాలనుకునే ముందు కచ్చితంగా వైద్యుడిని సంప్రదించడం మంచిది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..