Ice Cream: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్‌క్రీమ్‌ ఇదే.. దీనిని ఎలా తయారు చేస్తారో తెలిస్తే షాకవుతారు..

ఒకప్పుడు సీజనల్‌గా కనిపించే ఐస్‌క్రీమ్‌లు ఇప్పుడు ఎవర్‌ గ్రీన్‌గా మారాయి. ట్రెండ్‌కు అనుగుణంగా ఐస్‌క్రీమ్‌ సంస్థలూ పంథా మార్చి రకరకాల ఫ్లేవర్స్ అందిస్తున్నాయి. అయితే..ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కప్ ఐస్‌క్రీమ్‌ ధర ఎంతో మీకు తెలుసా? ఒక్క ఐస్‌క్రీమ్‌ కంటే తులం బంగారం విలువ తక్కువైంది.

Ice Cream: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్‌క్రీమ్‌ ఇదే.. దీనిని ఎలా తయారు చేస్తారో తెలిస్తే షాకవుతారు..
Most Expensive Ice Cream
Follow us
Sanjay Kasula

|

Updated on: May 07, 2023 | 4:46 PM

ఐస్‌క్రీమ్‌ అంటే ఇష్టపడని వారుండరూ. మారుతున్న కాలానికి అనుగుణంగా డైరీ సంస్థలు నోరూరించే విభిన్న రకాల ఐస్‌క్రీమ్‌లను అందిస్తున్నాయి. క్రీమ్ స్టోన్ వంటి స్టోర్లలో వీటి ధర చాలా ఎక్కువగానే ఉంటుంది. ఫేమస్ ఐస్‌క్రీమ్‌ స్టోర్లలో వీటి ధర రూ.500, రూ.1000 పైగా ఉంటుంది. అయితే, ఒక  ఐస్‌క్రీమ్‌ ధర తులం బంగారం కంటే ఎక్కువ ఖర్చవుతుందని మీరు ఎప్పుడైనా ఊహించారా..? మీరు విన్నది నిజమే. ఒక ఐస్‌క్రీమ్‌ ధర 10 గ్రాముల బంగారం కంటే ఎక్కువైంది.

వేసవి కాలంలో అందరూ ఐస్‌క్రీం తినడానికి ఇష్టపడతారు. వేసవి కాలం కావడంతో మార్కెట్‌లో రకరకాల ఐస్‌క్రీమ్‌ల విక్రయాలు మొదలయ్యాయి. నాణ్యతను బట్టి వాటి ధర కూడా మారుతుంది. కొన్ని ఐస్‌క్రీమ్‌లు 5, 10 రూపాయలకు వస్తాయి. మరికొన్ని రూ. 500 లేదా రూ. 1000 వరకు ఉంటాయి. ప్రతి ఒక్కరు తన స్థాయికి తగ్గట్టుగా నచ్చిన ఐస్ క్రీమ్ కొని తింటారు. కానీ ప్రపంచంలో అలాంటి ఐస్ క్రీం ఉంది. దానిని కొని తినే ముందు ధనవంతులు కూడా వందసార్లు ఆలోచిస్తారు. ఎందుకంటే ఒక్కసారి తింటే లక్ష రూపాయలు జీర్ణం కావాల్సిందే.

ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఐస్ క్రీం

అత్యంత ఖరీదైన ఐస్ క్రీం ధర గురించి ఆలోచించమని మిమ్మల్ని అడిగితే, మీరు రూ.1000, రూ.2000 లేదా గరిష్టంగా రూ.10, రూ.20 వేలు మాత్రమే ఆలోచించగలరు. కానీ, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్‌క్రీం ధర మీరు అనుకున్నదానికంటే ఎక్కువ. జపాన్‌కు చెందిన ఐస్‌క్రీమ్ తయారీదారు సిలాటోకు చెందిన బైకుయా అనే ప్రోటీన్‌తో కూడిన ఐస్‌క్రీం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్‌క్రీం.

ప్రపంచ రికార్డు సృష్టించింది

ఆడిటీ సెంట్రల్ న్యూస్ ప్రకారం, గత నెలలోనే, అంటే ఏప్రిల్ 25న, ఈ కొత్త ఐస్‌క్రీం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్‌క్రీమ్‌గా రికార్డు సృష్టించింది. ఈ ఐస్ క్రీం ఆధారం పాలతో తయారు చేయబడింది. ఇది వెల్వెట్ గా ఉంటుంది. దీని పదార్ధాలలో రెండు రకాల చీజ్, గుడ్డు పచ్చసొన కూడా ఉంటాయి.

ప్రత్యేక చెంచాతో వస్తుంది

ఇది కాకుండా, ఈ ఐస్ క్రీం తయారీలో పార్మిజియానో ​​చీజ్, వైట్ ట్రఫుల్ ఆయిల్ వంటి అనేక ఇతర అంశాలు కూడా ఉన్నాయి. ఇది స్టైలిష్ బ్లాక్ బాక్స్‌లో ప్యాక్ చేయబడింది. విశేషమేంటంటే చేతితో తయారు చేసిన మెటల్ స్పూన్ కూడా వస్తుంది. ఈ చెంచాలను క్యోటోలోని కొంతమంది హస్తకళాకారులు ప్రత్యేక పద్ధతులను ఉపయోగించి తయారు చేస్తారు.

ఐస్ క్రీం ధర?

కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో 130ml Byakuya ఐస్ క్రీం ధర $6700. ఇది మన కెరెన్సీలో రూ.5 లక్షలకు పైమాటే. ఐస్‌క్రీమ్‌తో వచ్చే స్పూన్ ఖరీదు అని ఇంతకు ముందు అర్థమైంది కాబట్టి ధర కూడా పెంచారు కానీ అలా కాదు. ఈ ఐస్‌క్రీం ధరను చెంచా లెక్క చేయకుండా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చేర్చింది. వైట్ వైన్‌తో ఈ ఐస్‌క్రీమ్ తినడం మంచి ఎంపిక అని తయారీదారు సూచిస్తున్నారు.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం