Curry Leaf roti Pachadi : అన్నం, ఇడ్లిలోకి ఉపయోగపడేలా కర్వేపాకు రోటి పచ్చడి తయారీ విధానం తెలుసుకుందాం..!

|

Mar 09, 2021 | 2:52 PM

కరివేపాకు వంటకు అదనపు రుచి, సువాసన ఇస్తుంది. ఈ కర్వేపాకు ను కూరల్లోనే కాదు.. పొడి, కర్వేపాకు పచ్చడి వంటివి తయారు చేసుకోవచ్చు. ఈరోజు ఎంతో రుచికరమైన కరివేపాకు పచ్చడి తయారీ చూద్దాం...

Curry Leaf roti Pachadi : అన్నం, ఇడ్లిలోకి ఉపయోగపడేలా కర్వేపాకు రోటి పచ్చడి తయారీ విధానం తెలుసుకుందాం..!
Follow us on

Curry Leaf roti Pachadi  : కరివేపాకు వంటకు అదనపు రుచి, సువాసన ఇస్తుంది. ఈ కర్వేపాకు ను కూరల్లోనే కాదు.. పొడి, కర్వేపాకు పచ్చడి వంటివి తయారు చేసుకోవచ్చు. ఈరోజు ఎంతో రుచికరమైన కరివేపాకు పచ్చడి తయారీ చూద్దాం..!

కావాల్సిన పదార్ధాలు :

కరివేపాకు
ఎండు మిర్చి,
చింతపండు,
బెల్లం,
ఉప్పు,

పోపు సామాను :

ఆవాలు,

జీలకర్ర,

కొంచెం మినపప్పు,

ఎండు మిర్చి

తయారీ విధానం:

కరివేపాకు శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టాలి. ఇక బాణలి పెట్టి నూనె లేకుండా ఎండు మిరపకాయలు వేయించాలి. ఆ తర్వాత బాణలిలో నూనె వేసి కరివేపాకుని వేసి వేయించుకోవాలి.

అనంతరం రోటి లో మొదట ఎండు మిరపకాయలను నూరి.. అనంతరం వేయించిన కరివేపాకును వేసి రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, చింతపండు గుజ్జు వేసి నూరుకోవాలి. చివరిగా చిన్న బెల్లం ముక్క వేసి నూరుకోవాలి. అయితే నీరు వేయకూడదు. ఈ కరివేపాకు పచ్చడిని ఓ గిన్నెలోకి తీసుకుని
ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు, ఎండు మిర్చి , పోపు వేస్తె ఎంతో రుచికరమైన కరివేపాకు పచ్చడి రెడీ..  దీనిని అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ఇక ఇడ్లి, దోశల్లోకి కూడా ఈ కరివేపాకు పచ్చడి బాగుంటుంది.

Also Read:

బార్డర్‏లో కెప్టెన్ సంజిత్ భట్టచార్య అదృశ్యం.. 23 ఏళ్లుగా దొరకని ఆచూకీ.. అసలెమైపోయాడు..

Kia Motors Job Mela : ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త.. కియా మోటార్స్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్