Potato Wedges: బంగాళదుంపలతో అదిరిపోయే వెస్ట్రన్ స్నాక్.. ఈ స్టైల్‌లో ‘పొటాటో వెడ్జెస్’ చేస్తే ప్లేట్లు ఖాళీ

సాయంత్రం వేళ వేడివేడిగా ఏదైనా కరకరలాడే స్నాక్ తినాలని ఉందా? అయితే ఇంట్లోనే రెస్టారెంట్ రుచిని మించేలా 'పొటాటో వెడ్జెస్' ట్రై చేయండి. పైన కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండే ఈ స్నాక్ పిల్లలకు చాలా ఇష్టం. ఓవెన్ ఉన్నా లేకపోయినా.. నూనెలో వేయించి లేదా ఎయిర్ ఫ్రైయర్ ఉపయోగించి వీటిని ఎలా తయారు చేసుకోవాలో ఈ కథనంలో చూడండి.

Potato Wedges: బంగాళదుంపలతో అదిరిపోయే వెస్ట్రన్ స్నాక్.. ఈ స్టైల్‌లో పొటాటో వెడ్జెస్ చేస్తే ప్లేట్లు ఖాళీ
Crispy Potato Wedges Recipe

Updated on: Dec 30, 2025 | 7:19 PM

బంగాళదుంపలతో చేసే ఫ్రెంచ్ ఫ్రైస్ అందరికీ తెలుసు.. కానీ మసాలాల ఘాటుతో ఉండే పొటాటో వెడ్జెస్ రుచి మరింత ప్రత్యేకం. బయట దొరికే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల కంటే తక్కువ ఖర్చుతో, ఆరోగ్యకరమైన పద్ధతిలో వీటిని ఎలా సిద్ధం చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి. మసాలాల కలయికతో అదిరిపోయే సువాసన వచ్చే ఈ వెడ్జెస్ తయారీ సీక్రెట్స్ మీకోసం.

కావలసిన పదార్థాలు:

బంగాళదుంపలు : 500 గ్రాములు

నూనె : 2 టేబుల్ స్పూన్లు (కోటింగ్ కోసం)

కారం : 1 టీస్పూన్

మిరియాల పొడి : అర టీస్పూన్

వెల్లుల్లి పొడి : 1 టీస్పూన్

ఉల్లిపాయ పొడి : 1 టీస్పూన్

ఉప్పు : ముప్పావు టీస్పూన్

థైమ్ : అర టీస్పూన్

ఒరేగానో : అర టీస్పూన్

తులసి ఆకుల పొడి (Basils) : ముప్పావు టీస్పూన్

మొక్కజొన్న పిండి లేదా బియ్యం పిండి : 2 టేబుల్ స్పూన్లు

నూనె : వేయించడానికి సరిపడా (డీప్ ఫ్రై పద్ధతికి)

తయారీ విధానం:

బంగాళదుంపలను శుభ్రంగా కడిగి పొడవుగా ముక్కలు (వెడ్జెస్) కోసుకోవాలి. వీటిని అరగంట పాటు చల్లని నీటిలో ఉంచి, ఆ తర్వాత తడి లేకుండా ఆరబెట్టాలి.

మసాలా కోటింగ్: ఒక గిన్నెలో పైన చెప్పిన మసాలాలన్నీ, పిండితో కలిపి సిద్ధం చేసుకోవాలి. ఆరిన బంగాళదుంప ముక్కలకు కొంచెం నూనె పట్టించి, ఆపై ఈ మసాలా పొడిని ముక్కలన్నింటికీ సమానంగా పట్టించాలి.

ఎయిర్ ఫ్రై పద్ధతి: ఎయిర్ ఫ్రైయర్‌ను 200 డిగ్రీల వద్ద సెట్ చేసి, ముక్కలను 18-20 నిమిషాల పాటు మధ్యలో ఒకసారి కలుపుతూ ఫ్రై చేయాలి.

ఓవెన్ పద్ధతి: బేకింగ్ ట్రేలో ముక్కలను అమర్చి, 220 డిగ్రీల వద్ద 30-35 నిమిషాల పాటు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు బేక్ చేయాలి.

డీప్ ఫ్రై పద్ధతి: ముక్కలను ముందుగా మరుగుతున్న నీటిలో రెండు నిమిషాలు ఉడికించి (పార్‌బోయిలింగ్), ఆపై మసాలా పట్టించి వేడి నూనెలో రెండుసార్లు వేయించాలి. దీనివల్ల వెడ్జెస్ అత్యంత క్రిస్పీగా వస్తాయి.