Cream of Broccoli Soup: శీతాకాలంలో సూపర్ ఫుడ్… వేడివేడిగా బ్రకోలీ సూప్.. తయారీ

|

Nov 15, 2021 | 12:15 PM

Cream of Broccoli Soup: శీతాకాలం వచ్చిందంటే చాలు రాత్రి సమయంలో అన్నం తినాలని అనిపించదు చాలా మందికి. వేడివేడిగా ఏదైనా ఆహారంగా తీసుకోవాలని..

Cream of Broccoli Soup: శీతాకాలంలో సూపర్ ఫుడ్... వేడివేడిగా బ్రకోలీ సూప్.. తయారీ
Cream Of Broccoli Soup
Follow us on

Cream of Broccoli Soup: శీతాకాలం వచ్చిందంటే చాలు రాత్రి సమయంలో అన్నం తినాలని అనిపించదు చాలా మందికి. వేడివేడిగా ఏదైనా ఆహారంగా తీసుకోవాలని భావిస్తారు. అయితే శీతాకాలంలో రాత్రి అన్నం వంటి ఆహార పదార్ధాల బదులు సూపర్ ఫుడ్ బ్రోకలీ సూప్ ని తీసుకుంటే మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఈ బ్రోకలీ ఒక సూపర్ ఫుడ్. రుచికరమైన పోషకాలతో నిండి ఉంటుంది. ఇది చాలా ఈ బ్రోకలీ విటమిన్ సి, ఫైబర్ లతో పాటు సహజమైన పోషకాలతో నిండి ఉంటుంది. ఈ శీతాకాలంలో ఈ ఆరోగ్యకరమైన బ్రోకలీ సూప్‌ని ఒకసారి ప్రయత్నించండి ఆస్వాదించండి.. ఈరోజు బ్రోకలీ సూప్ ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందాం..

కావాల్సిన పదార్ధాలు:

బ్రోకలీ- 2 కప్పులు
బంగాళదుంప -1 చిన్న సైజు
ఉల్లిపాయ-1 మీడియం సైజు
వెల్లుల్లి- 3-4 రేకులు
పాలు- 1/2 కప్పు
క్రీమ్ -1 టేబుల్ స్పూన్
వెన్న-1 టేబుల్ స్పూన్
మిరియాలు -ఒక టీ స్పూన్
ఒరేగానో పొడి 1/4 tsp
మిరియాల పొడి- రుచికి సరిపడా
ఉప్పు – రుచికి సరిపడా

తయారీ విధానం: ముందుగా బ్రోకలీని శుభ్రం చేసుకుని.. కొంచెం సేపు నీటిలో ఉడకబెట్టుకోవాలి. అదే విధంగా బంగాళా దుంపని శుభ్రం చేసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి.  ఇప్పుడు స్టౌ మీద  కుక్కర్ పెట్టుకుని వెన్న వేసుకోవాలి. కొంచెం వేడి ఎక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను, వెల్లుల్లి ,  మిరియాలు వేసుకుని వేయించాలి. అనంతరం బ్రోకలీ ముక్కలను, బంగాళాదుంపలను వేసుకుని స్విమ్ లో కొంచెం సేపు వేయించండి. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసి 2 విజిల్స్ వచ్చే  ఉంచండి. కుక్కర్  ప్రెజర్ తగ్గిన తర్వాత .. కుక్కర్‌ని తెరిచి.. కూరగాయలను చల్లబరచాలి. అనంతరం వాటిని మిక్సీలో వేసుకుని ప్యూరీలా చేసుకోండి.

అనంతరం స్టౌ మీద పాన్ పెట్టి.. ప్యూరీని వేసుకుని కొంచెం పాలు, క్రీమ్ జత చేసి స్విమ్ లో ఉడికించండి. కొంచెం చిక్కగా ఉంటె.. నీరు జత చేసుకోవచ్చు. స్విమ్ లో సూప్ ఉడికిన తర్వాత కొంచెం ఒరేగానో పౌడర్, రుచికి సరిపడా ఉప్పు ,  మిరియాల పొడి  కలపండి. అనంతరం కొంచెం క్రీమ్ వేసుకుని సూప్ ని మరికొంచెం సేపు వేడి చేస్తే చాలు. ఆరోగ్యానికి ఆరోగ్యం.. టెస్టుకు టెస్టునిచ్చే బ్రోకలీ వెజ్ సూప్ రెడీ..

గమనిక సూప్ ని తయారు చేసే సమయంలో గ్యాస్ స్టౌ మంట స్విమ్ మీద మాత్రమే ఉండేలా చూసుకోండి. లేదంటే బ్రోకలీ రంగు మారవచ్చు.

Also Read: ఆట ఆడినా ఓడినా రికార్డ్స్‌లో ఉంటావు.. కానీ గెలిస్తే మాత్రమే చరిత్రలో ఉంటావు.. ఆకట్టుకుంటున్న గని టీజర్..