ప్రస్తుతం కేవలం కరోనా నుంచి మాత్రమే కాకుండా.. ఇతర అనారోగ్య సమస్యలను నియంత్రించడం కూడా ముఖ్యమే. ఇందుకు రోగ నిరోధక శక్తిని పెంచుకోవడమే అసలైన మార్గం. అయితే ఇమ్యూనిటీ పెంచుకోవడానికి కేవలం తాజా పండ్లు.. సప్లిమెంట్స్ మాత్రమే కాదు.. పురాతన భారతీయ సంప్రదాయంలో చేసే వంటకాలు కూడా రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అందులో రోటి పచ్చళ్లు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కొత్తమీ- పుదీనాతో చేసే పచ్చడితో ఆరోగ్యానికి ఎన్నో ప్రయజనాలున్నాయి. మరి అది ఎలా చేయాలి.. ఉపయోగాలెంటో తెలుసుకుందామా.
తయారీ విధానం..
కావల్సినవి..
కొత్తిమీర.
పుదీనా..
అల్లం.
వెల్లుల్లి.
నల్ల ఉప్ప..
జీలకర్ర.
నిమ్మకాయ.
పచ్చిమిర్చి.
తయారీ విధానం..
ముందుగా కొత్తిమీర.. పుదీనా శుభ్రం చేసి అందులోనే కాస్త నల్ల ఉప్పు.. పచ్చిమిర్చి.. అల్లం… వెల్లుల్లి వేసి రోటిలో పేస్ట్ గా చేసుకోవాలి. ఆ తర్వాత మరో బాణలిలో నూనె.. వేసి పోపు పెట్టి.. అందులో ఈ కొత్తిమీర పేస్ట్ వేసి కలపాలి.
ప్రయోజనాలు..
ఈ పచ్చడి.. ఐరన్ లోపాన్ని నియంత్రిస్తుంది. అలాగే రక్తహీనతను తగ్గిస్తుంది. అలాగే రక్తం తక్కువగా ఉండే వారికి ఈ పచ్చడి మంచిది. అలాగే జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఆకలిని పెంచుతుంది. డయాబెటిస్ సమస్యను నియంత్రిస్తుంది. కొత్తిమీరలో ఇన్సులిన్ స్థాయిని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా.. మధుమేహం అదుపులో ఉంటుంది. కడుపులో మంటను తగ్గిస్తుంది. కొత్తిమీరలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మంటను తగ్గించడంలో సహయపడుతుంది. నోటి పూతలను కూడా తగ్గిస్తుంది.
Omega -3: ఈ ఐదు రకాల ఫుడ్‌లో ఒమేగా-3 అధికం.. రోగ నిరోధక శక్తి పెంపొందించేందుకు కీలక పాత్ర..!