
Childrens: చలికాలంలో పిల్లలు పోషకలోపంతో బాధపడుతారు. ఏది తినడానికి ఇష్టపడరు. తరచుగా జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతారు. దీనికి కారణం రోగనిరోధక శక్తి లేకపోవడమే. అందుకే వారికి ఇష్టమైన ఆహారాలను అందించాలి. ముఖ్యంగా అనారోగ్యం బారిన పిల్లలను జాగ్రత్తగా గమనించాలి. అయితే చాలామంది పిల్లలు కొన్ని కూరగాయలను తినడానికి ఇష్టపడరు కానీ అందులోనే ఎక్కువగా పోషకాలు ఉంటాయి. తల్లిదండ్రులు వాటిని నెమ్మదిగా వారికి అలవాటు చేయాలి. అలాంటి కూరగాయల గురించి తెలుసుకుందాం.
1. బీట్‌రూట్: పిల్లలకు బీట్‌రూట్ రుచి అస్సలు రుచించదు. పచ్చిగా తినడాన్ని, సలాడ్లలోను అసహ్యించుకుంటారు. అటువంటి పరిస్థితిలో శాండ్విచ్ లాంటి ఆహారాలలో పెట్టి ఇవ్వాలి. ఇందులో అది ఉందని వారు గుర్తించడం కొంచెం కష్టంగా ఉంటుంది.
2. క్యాబేజీ: క్యాబేజీలో విటమిన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి కానీ చాలా మంది పిల్లలు దీనిని అసహ్యించుకుంటారు. ఇది కూడా శాండ్‌విచ్‌కి కలిపి పిల్లలకి ఆహారంగా ఇవ్వవచ్చు. లేదంటే వెరైటీ వంటకాల ద్వారా దీనిని తినేలా చేయాలి.
3. సొరకాయ: పోషకాలు పుష్కలంగా ఉండే సొరకాయని పిల్లలు పట్టించుకోరు. వారానికోసారి పిల్లలకు సొరకాయ ఇవ్వాలని వైద్యులు సూచించారు. తురిమిన సొరకాయ ముక్కలను మోమోస్‌లో పెట్టి పిల్లలకు తినిపించవచ్చు. ఇంకా సాంబార్, పప్పుచారు లాంటి వంటకాలలో టేస్టీగా చేసి తినిపించాలి.
4. పుట్టగొడుగులు: ఇది చూడగానే పిల్లలు అసహ్యించుకుంటారు. కానీ ఇది వారికి చాలా ముఖ్యమైన ఆహారం. ఇందులో విటమిన్ డి ఉంటుంది. ఇది పిల్లలకు చాలా ముఖ్యమైనది. దీన్ని కూరగా లేదా ఏదైనా తినే ఆహారంలో పెట్టి ఇవ్వాలి. క్రమంగా అలవాటు చేయాలి.
5. పప్పులు: పప్పులో ఉండే ప్రొటీన్ పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీంతో పాటు మెరుగైన వృద్ధికి దోహదపడుతుంది. మీరు పప్పుతో పరాటాలు, దోసెల లాంటివి చేసి వెరైటీగా తినిపించవచ్చు. రుచి నచ్చిందంటే వారు దీనికి అలవాటు పడుతారు.