మటన్ Vs చికెన్: ఆరోగ్యానికి ఏది బెస్ట్..? తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన నిజాలివే..

Chicken Vs Mutton: సాధారణంగా మనలో చాలా మందికి ఆదివారం అంటే ముక్క లేనిదే ముద్ద దిగదు. కొందరు చికెన్‌కు జై కొడితే, మరికొందరు మటన్ సూపర్ అంటారు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు, గుండె ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్నవారు మటన్ అనగానే ఆమడదూరం పరుగెడుతుంటారు. కేవలం చికెన్ మాత్రమే సురక్షితం అని భావిస్తారు. కానీ నిపుణులు చెప్పేది వింటే మీరు అవాక్కఅవుతారు.

మటన్ Vs చికెన్: ఆరోగ్యానికి ఏది బెస్ట్..? తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన నిజాలివే..
Chicken Vs Mutton

Updated on: Mar 01, 2026 | 10:44 AM

ఆదివారం వచ్చిందంటే చాలు.. గల్లీ నుంచి ఢిల్లీ దాకా అందరి ఇళ్లలో మాంసాహారం ఘుమఘుమలాడాల్సిందే.. కొందరు చికెన్ ముక్క లేనిదే ముద్ద దిగదు అంటారు,.మరికొందరు మటన్ జ్యూసీగా ఉంటేనే అసలైన మజా అంటారు. అయితే ఆరోగ్య స్పృహ ఉన్నవారు మాత్రం మటన్ తింటే కొవ్వు పెరుగుతుంది.. చికెన్ అయితేనే సేఫ్ అని నమ్ముతుంటారు. కానీ ప్రముఖ పోషకాహార నిపుణురాలు పూజా మల్హోత్రా చెప్పే నిజాలు వింటే మీరు షాక్ అవుతారు..

మటన్ నిజంగానే విలనా?

సాధారణంగా బరువు తగ్గాలనుకునే వారు మటన్‌ను ఒక విలన్‌లా చూస్తారు. ఇందులో కేలరీలు, కొవ్వు ఎక్కువగా ఉంటాయని భావిస్తారు. కానీ పూజా మల్హోత్రా తన సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. మనం ఎంచుకునే మాంసం ముక్కల ఆధారంగానే ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.

మటన్‌తో కలిగే అద్భుత ప్రయోజనాలు

చికెన్ కంటే కొన్ని విషయాల్లో మటన్ మెరుగైనదని నిపుణులు చెబుతున్నారు. చికెన్ కంటే మటన్‌లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది కండరాల పుష్టికి ఎంతో మేలు చేస్తుంది. మటన్‌లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. రక్తహీనతతో బాధపడే మహిళలకు ఇది ఒక అద్భుతమైన ఆహారం. ఇందులో పొటాషియం అధికంగా, సోడియం తక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటును అదుపులో ఉంచి గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. మనం సరైన లీన్ మీట్ ఎంచుకుంటే, చికెన్ కంటే మటన్‌లోనే తక్కువ కొవ్వు ఉండటం గమనార్హం.

చికెన్ విషయంలో మనం చేసే పొరపాటు

చికెన్ ఆరోగ్యకరమే అని మనం నమ్ముతాం కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. చికెన్‌లో కేవలం బ్రెస్ట్ భాగం మాత్రమే అత్యంత ఆరోగ్యకరమైనది. కానీ చాలామంది రుచి కోసం లెగ్ పీస్, వింగ్స్, థైస్ ఇష్టపడతారు. ఈ ముదురు మాంసంలో కొవ్వు శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల చికెన్ తిన్నా సరే అనవసరమైన కొవ్వు శరీరంలో చేరుతుంది.

ఆరోగ్యపరంగా చూస్తే.. మటన్, చికెన్ రెండూ సమప్రధాన్యత కలిగి ఉంటాయి. అయితే మటన్ మంచిది కదా అని కిలోల కొద్దీ తినడం ప్రమాదకరం. ఏదైనా సరే పరిమితంగా తీసుకుంటేనే ఆరోగ్యం. వారానికి ఒకటి లేదా రెండుసార్లు మితంగా తీసుకుంటే మటన్ కూడా మీ ఆరోగ్యానికి మంచి స్నేహితుడిగా మారుతుందని మల్హోత్రా సూచిస్తున్నారు.

Follow Us