లొట్టలేసుకుంటూ తినే Chicken 65కి.. ఆసలు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

మాంసాహారులు ఇష్టంగా ఆరగించే చికెన్‌ 65 అనే స్పైసీ డిష్ అందరికీ ప్రత్యేకమే. అందుకే చాలా మంది చికెన్ 65ని ఇష్టంగా తింటారు. అంతర్జాతీయ గుర్తింపు పొందిన చికెన్ 65కు ఆ పేరు రావడం వెనుక ఇంటెరెస్టింగ్‌ స్టోరీ ఉందట. చికెన్ 65 అనే పేరు ఎలా వచ్చిందనే దానిపై రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి..

లొట్టలేసుకుంటూ తినే Chicken 65కి.. ఆసలు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?
Chicken 65

Updated on: Mar 05, 2025 | 8:49 PM

మాంసాహారులకు ఇష్టమైన వంటకం చికెన్. చికెన్‌తో రకరకాల వంటకాలను తయారు చేసుకుని ఆరగిస్తుంటాం. కానీ ఎప్పుడైనా రెస్టారెంట్‌కి వెళితే మాత్రం అక్కడ చికెన్ బిర్యానీ, చికెన్ లాలిపాప్, చికెన్ తందూరీ వంటివాటితోపాటు చికెన్‌ 65 కూడా మెనూలో కనిపిస్తుంది. ఇందులో చికెన్ 65 స్పైసీ డిష్ అందరికీ బలేగా ఇష్టం. అందుకే చాలా మంది చికెన్ 65ని ఇష్టంగా తింటారు. అంతర్జాతీయ గుర్తింపు పొందిన చికెన్ 65కు ఆ పేరు రావడం వెనుక ఇంటెరెస్టింగ్‌ స్టోరీ ఉందట. చికెన్ 65 అనే పేరు ఎలా వచ్చిందనే దానిపై రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాం..

భారత సైనికుల ప్రత్యేక వంటకం

చికెన్ 65 అనేది ఇండియన్‌ సైనికులకు ఇచ్చే ఒక ప్రసిద్ధ వంటకం. దీనిని ప్రత్యేకంగా భారత ఆర్మీ సైనికుల కోసం ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఈ 65 సంఖ్య సైన్యంలోని ఒక నిర్దిష్ట బెటాలియన్‌కు సంబంధించింది. అందుకే ఈ వంటకానికి చికెన్ 65 అని పేరు పెట్టారని చెబుతారు.

65 రకాల మసాలాలతో తయారు చేస్తారు కాబట్టే దానికా పేరు..

చికెన్ 65 తయారీకి 65 రకాల మసాలా దినుసులు ఉపయోగిస్తారని, అందుకే ఆ పేరు వచ్చిందని మరో కథనం ప్రచారంలో ఉంది. నిజానికి ఈ చికెన్ 65 వంటకాన్ని తయారు చేయడానికి కొన్ని పదార్థాలు ఉన్నా చాలా. ఇట్టే తయారు చేయొచ్చు. కాబట్టి ఈ పేరు వెనుక ఉన్న కథ కూడా అంత నిజం కాదు.

ఇవి కూడా చదవండి

కోడి వయస్సుకి, ఈ పేరుకి సంబంధం ఉందా?

ఆ కోడి వయసు కారణంగా దీనికి చికెన్ 65 అనే పేరు వచ్చిందని మరికొందరు చెబుతారు. ఈ వంటకం తయారు చేయడానికి 65 రోజుల వయసున్న కోడిని ఉపయోగిస్తారట. ఈ వంటకానికి ఈ పేరు ఎలా వచ్చిందో చెప్పే కథల్లో ఇది కూడా ఉంది.

ఈ పేరు పెట్టడానికి మెనూ నంబర్ కారణం..

దక్షిణ భారతదేశంలోని ఒక సైనిక క్యాంటీన్‌లో చికెన్ 65 మెనూలో 65వ వంటకం ఇది. గతంలో కస్టమర్‌లు వాటిని సులభంగా గుర్తించడానికి మెనూలకు సంఖ్యలు ఇచ్చేవారు. ఈ సంఖ్య వల్ల ఈ వంటకానికి చికెన్ 65 అనే పేరు వచ్చిందని ఇంకొందరు చెబుతారు.

చికెన్ 65 చెన్నైలోని బుహారీ హోటల్‌లో పుట్టిందా?

చికెన్ 65 అనే వంటకం 1965లో తమిళనాడులోని చెన్నైలోని బుహారీ హోటల్‌లో ఉద్భవించిందనే కథ కూడా ప్రచారంలో ఉంది. ఈ వంటకాన్ని బుహారీ హోటల్ వ్యవస్థాపకుడు బుహారీ తొలిసారి తయారు చేశాడని, మొదట్లో హోటల్‌లోని కస్టమర్లకు చికెన్ 65ను త్వరిత స్నాక్‌గా అందించేవారనే కథనం ప్రచారంలో ఉంది. దీని రుచి అద్భుతంగా ఉండటంతో బాగా ఫేమస్‌ అయిందట. అందుకే ఈ వంటకానికి చికెన్ 65 అనే పేరు పెట్టారని చెబుతారు.

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్‌ చేయండి.