
ఈ మధ్య చిన్నా, పెద్దా తేడా లేకుండా చాలా మంది గుండెపోటు కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే గుండెపోటు రావడానికి కొలెస్ట్రాల్, రక్తపోటు లేదా డయాబెటీస్ వంటి వ్యాధులే కారణమని చాలా మంది అనుకుంటారు. కానీ విటమిన్ డి లోపం కూడా గుండె జబ్బులకు ఒక ప్రధాన కారణమని మీకు తెలుసా? అవును మన శరీరంలో ఈ విటమిన్ తగ్గితే, అది గుండె ఆరోగ్యాన్ని నేరుగా ప్రభావితం చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇంతకు ఈ విటమిన్ లోపం గుండెపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో అనే విషయాన్ని ఇక్కడ పరిశీలిద్దాం.
విటమిన్ డి అనేది మన శరీరానికి అనేక రకాలుగా ప్రయోజనాలను కల్గిస్తుంది. మన బాడీలో కాల్షియం, భాస్వరం స్థాయిలను సమతుల్యం చేయడమే కాకుండా ఎముకలను కూడా బలంగా ఉంచుతుంది. కానీ కొన్ని సార్లు ఇది ఎముకలను గుండెను కూడా ప్రభావితం చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీని లోపం ఉన్నవారికి గుండె జబ్బుల ప్రమాదం రెట్టింపు అవుతుందని చెబుతున్నారు. శరీరంలో విటమిన్ డి లోపించినప్పుడు, రక్తపోటు అసమతుల్యత చెందుతుంది దీని వల్ల రక్త నాళాలు ఉబ్బడం ప్రారంభమవుతుంది. ఈ పరిస్థితి క్రమంగా గుండె జబ్బులకు దారి తీస్తుంది.
తరచూ మీకు అలసటగా అనిపిస్తున్నట్లయితే అది విటమిన్ D లోపానికి సంకేతం కావచ్చు. అలాగే ఎముకలు, కండరాల నొప్పి, తరచుగా అనారోగ్యం, నిద్ర సమస్యలు, నిరాశ లేదా మానసిక స్థితిలో మార్పులు, పైన పేర్కొన్న ఈ లక్షణాలు మీ శరీరంలో కనిపిస్తే విటమిన్ డి లోపం ఉందని అర్థం.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.