Makhana Benefits: మఖానాతో గుండె, ముత్రపిండాల సమస్యలకు చెక్..! పరగడుపున తింటే 5 అద్భుత ప్రయోజనాలు..

|

Aug 30, 2021 | 6:33 PM

Makhana Benefits: మఖానా వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కొంతమంది దీనిని డ్రై ఫ్రూట్స్‌గా భావిస్తారు. ఈ రోజుల్లో ఇది చాలామందికి ఇష్టమైన చిరుతిండిగా మారింది.

Makhana Benefits: మఖానాతో గుండె, ముత్రపిండాల సమస్యలకు చెక్..! పరగడుపున తింటే 5 అద్భుత ప్రయోజనాలు..
Makhana
Follow us on

Makhana Benefits: మఖానా వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కొంతమంది దీనిని డ్రై ఫ్రూట్స్‌గా భావిస్తారు. ఈ రోజుల్లో ఇది చాలామందికి ఇష్టమైన చిరుతిండిగా మారింది. ప్రజలు దీనిని నెయ్యిలో వేయించి, ఖీర్ తయారు చేసి, స్వీట్లలో డ్రై ఫ్రూట్స్‌గా కలుపుకొని తింటున్నారు. కొందరు వ్యక్తులు కూరగాయలలో కలుపుకొని తింటున్నారు. మఖానా రుచి చల్లగా ఉంటుంది కానీ ఇది చలికాలం, వేసవి కాలం రెండు కాలాలలోను తింటారు. ఇందులో కొలెస్ట్రాల్, కొవ్వు, సోడియం తక్కువగా ఉంటుంది. అయితే మెగ్నీషియం, కాల్షియం, పిండి పదార్థాలు, ప్రోటీన్లు పుష్కలంగా కనిపిస్తాయి. ఇది కాకుండా మఖానా గ్లూటెన్ రహితంగా ఉంటుంది. రోజూ ఖాళీ కడుపుతో 4 నుంచి 5 మఖానాలు తింటే శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మరికొన్ని మఖానా ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

1. చక్కెరను నియంత్రిస్తుంది
మధుమేహ వ్యాధిగ్రస్తులకు మఖానా చాలా మంచి చిరుతిండి. డయాబెటిక్ రోగులు రోజూ ఖాళీ కడుపుతో క్రమం తప్పకుండా 4 నుంచి 5 మఖానాలు తింటే వారి షుగర్ అదుపులో ఉంటుంది.

2. గుండెకు ప్రయోజనకరం
మీకు గుండె సంబంధిత వ్యాధి ఉంటే మీరు తప్పనిసరిగా మఖానా తినాలని వైద్యులు చెబుతారు. మఖాన గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, బిపిని నియంత్రిస్తుంది. కానీ మీకు అధిక బిపి సమస్య ఉంటే ఉప్పుతో కలిపి తీసుకోకండి.

3. గర్భిణీ స్త్రీ, శిశువుకు ఆరోగ్యకరమైనది
గర్భిణీ స్త్రీ మఖాన ఖీర్ తినాలి. ఇది తల్లి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే బిడ్డకు పోషణనిస్తుంది. ఎముకలను బలంగా చేస్తుంది.

4. మూత్రపిండాలు
ఈ రోజుల్లో చిన్న వయస్సులోనే ప్రజలలో మూత్రపిండ సమస్యలు వస్తున్నాయి. కానీ మీరు మఖానను క్రమం తప్పకుండా తీసుకుంటే మీరు ఈ సమస్యను నివారించవచ్చు. మఖానా తినడం ద్వారా విషపూరిత పదార్థాలు మూత్రపిండాల నుంచి బయటకు వెళ్తాయి. తద్వారా అవి ఆరోగ్యంగా ఉంటాయి.

5. బరువు తగ్గుతుంది
బరువు తగ్గాలనుకునే వ్యక్తులు మఖానా తినాలి. పగటిపూట ఆకలి అనిపించినప్పుడు మఖానా తింటే కడుపు నిండినట్లు అనిపిస్తుంది. శరీరానికి పోషకాలు కూడా అందుతాయి. అంతేకాదు మీరు అతిగా తినడం కూడా మానేస్తారు.

Vastu Rules: అద్దం గురించి అసలు నిజాలు తెలుసుకోండి..! లేదంటే అనారోగ్య సమస్యలు తప్పవు..

పండగొస్తే పెను ప్రమాదం.. టెర్రర్ సృష్టిస్తున్న డెల్టా వైరల్ వ్యాప్తి..: Delta Corona Effect Live Video.

INDW vs AUSW: ఆస్ట్రేలియా చేరిన టీమిండియా మహిళల జట్టు.. విమానంలో సందడే సందడి