AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెరుగు అన్నంలో అరటి పండు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా..? ఇది మాత్రం 100% ఎవ్వరికీ తెలీదు..

పెరుగు అన్నంలో అరటి పండు కలిపి తినడం ఆరోగ్యానికి మంచిదా? అనే సందేహానికి ఆయుర్వేద నిపుణులు స్పష్టత ఇచ్చారు. బరువు పెరగాలనుకునేవారు, అధిక శారీరక శ్రమ చేసేవారు ఈ కలయికను తీసుకోవచ్చని, అయితే బరువు తగ్గాలనుకునేవారు, మధుమేహం ఉన్నవారు దీనిని నివారించడం మంచిదని సూచిస్తున్నారు. పండ్లను విడిగా తినడం జీర్ణక్రియకు మరింత అనుకూలమని నిపుణులు చెబుతున్నారు.

పెరుగు అన్నంలో అరటి పండు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా..? ఇది మాత్రం 100% ఎవ్వరికీ తెలీదు..
Curd Rice Banana
Shaik Madar Saheb
|

Updated on: Jul 07, 2026 | 1:42 PM

Share

ఆహారపు అలవాట్లలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల భోజన సంప్రదాయంలో పెరుగు అన్నానికి ప్రత్యేక స్థానం ఉంది. భోజనం ముగింపులో పెరుగు అన్నం తినడం సంతృప్తినిస్తుంది.. ఇది చిన్నప్పటి నుంచి అలవడిన ఆచారం. పూర్వం రోజుల్లో ప్రజలు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మాత్రమే ఆహారం తీసుకునేవారు. తృణ ధాన్యాలతోపాటు.. అన్నమే ప్రధాన ఆహారం. అన్నం సులభంగా వెళ్ళడానికి గంజి, మజ్జిగ, కూరలు లేదా పచ్చళ్ళు వాడేవారు. అప్పట్లో ఒక వ్యక్తి రోజుకు ఒక కిలో బియ్యం తినేవారని, వారి శారీరక శ్రమకు అది అవసరమని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో, పొలాల గట్లపై విస్తారంగా అరటి చెట్లు పెరిగేవి, ఎటువంటి పోషణ లేకుండానే గెలలు వచ్చేవి. అరటి పండ్లు సులభంగా లభించేవి. పనులు ఎక్కువగా ఉండటం వల్ల వేరుగా తినడానికి సమయం దొరకనప్పుడు, పూర్వీకులు పెరుగు అన్నంలోనే అరటి పండ్లను కలుపుకుని తినడం అలవాటు చేసుకున్నారు. ఈ అలవాటు తాతల నుండి తండ్రులకు, ఆపై పిల్లలకు కూడా సంక్రమించింది. నేటికీ చాలామంది ఈ అలవాటును కొనసాగిస్తున్నారు.

అయితే, సాధారణంగా ఉడికించిన ఆహారాలతో పండ్లను కలిపి తినవద్దని ఆహార నిపుణులు సూచిస్తుంటారు. దీనిపై అనుమానం వ్యక్తం చేస్తూ చాలామంది “మాకు పెరుగు అన్నంలో అరటి పండు తినడం అలవాటు, తినొచ్చా, తినకూడదా?” అని అడుగుతుంటారు. దీనికి ఆయుర్వేద నిపుణులు ఒక వివరణాత్మక స్పష్టతను అందిస్తున్నారు.. అలవాటు ప్రకారం పెరుగు అన్నంలో అరటి పండు తిన్నంత మాత్రాన ఎటువంటి నష్టం జరగదు.. దీనివల్ల ఎటువంటి ప్రతికూలతలు ఉండవని పేర్కొంటున్నారు.

అయితే, సాధారణంగా ఈ కలయికను కొంత మంది వద్దంటారు.. దీనికి ఒక బలమైన కారణం ఉంది. పండ్లు సులువుగా గంటన్నర నుండి రెండు గంటల్లో జీర్ణమై, రెండున్నర గంటల్లో రక్తంలో కలిసిపోతాయి. కానీ అన్నం జీర్ణం కావడానికి నాలుగు నుండి ఐదు గంటల సమయం పడుతుంది. పండ్లను అన్నంతో కలిపి తింటే, పండ్లు కూడా అన్నంతో పాటు ఎక్కువసేపు పొట్టలో ఉండాల్సి వస్తుంది, వాటి సులభమైన జీర్ణక్రియకు ఆటంకం కలుగుతుంది. అందుకే ఆయన పండ్లను విడిగా తినమని సూచిస్తారు. ప్రత్యేకించి రాత్రిపూట డిన్నర్‌గా రెండు మూడు రకాల పండ్లను తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని, ఇది తక్కువ శక్తిని కోరుకునే వారికి ఉత్తమమైన ఎంపిక అని పేర్కొంటున్నారు.. ఒక 100 గ్రాముల అరటి పండులో సుమారు 116 క్యాలరీల శక్తి ఉంటుందని, అన్ని పండ్ల కంటే అరటి పండ్లలో శక్తి ఎక్కువని చెబుతున్నారు..

మరి ఎవరు పెరుగు అన్నంలో అరటి పండు తినవచ్చు?

బరువు పెరగాలనుకునేవారు: బరువు పెరగాలని, కండ బలం కావాలని, కొవ్వు పట్టాలని కోరుకునేవారు అధిక శక్తి కోసం పెరుగు అన్నంలో ఒకటి రెండు అరటి పండ్లను తినవచ్చు.

హార్డ్ వర్క్ చేసేవారు: ఎక్కువ శక్తి అవసరమైన శారీరక శ్రమ చేసేవారు తినవచ్చు.

నీరసంగా ఉన్నవారు: బాగా నీరసంగా ఉన్నవారు, ఇతర సమయాల్లో సరిగా తినలేనివారు లంచ్‌లో పెరుగు అన్నంతో పాటు అరటి పండును నంచుకోవచ్చు.

ఉప్పు, నూనె లేకుండా పెరుగు అన్నం తినడం కష్టం అనుకునేవారు, ఒక చిన్న అరటిపండు నంచుకుని తినగలిగితే.. అలాంటి వారు తినవచ్చు.

ఎవరు పెరుగు అన్నంలో అరటి పండు తినకూడదు?

బరువు తగ్గాలనుకునేవారు: అధిక బరువు సమస్య ఉన్నవారు, కొవ్వు కరిగించుకోవాలనుకునేవారు దీనిని పూర్తిగా నివారించాలి.

షుగర్ ఉన్నవారు: షుగర్ వ్యాధి ఉన్నవారు కూడా పెరుగు అన్నంలో అరటి పండును తినకూడదు.

బరువు పెరగకూడదనుకునేవారు: తమ బరువును నియంత్రించుకోవాలనుకునేవారు కూడా ఈ కలయికను నివారించడం ఉత్తమం.

అయితే.. పెరుగు అన్నంలో అరటి పండు తినడం పూర్తిగా తప్పు కాదు.. కానీ ఎవరి ఆరోగ్య లక్ష్యాలు, శారీరక అవసరాలు బట్టి ఈ ఆహారాన్ని తీసుకోవాలి అనేది ముఖ్యమని నొక్కిచెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు.. పండ్లను విడిగా తీసుకోవడం సాధారణంగా ఉత్తమమని, ప్రత్యేకించి రాత్రి భోజనంగా ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సులువై ఆరోగ్యం మెరుగుపడుతుందని పేర్కొంటున్నారు. అయితే.. ఏమైనా అనారోగ్య సమస్యలుంటే వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
పెరుగు అన్నంలో అరటి పండు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా..?
పెరుగు అన్నంలో అరటి పండు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా..?
గంభీర్‌కు షాకిచ్చిన బీసీసీఐ.. జింబాబ్వే పర్యటన నుంచి ఔట్..!
గంభీర్‌కు షాకిచ్చిన బీసీసీఐ.. జింబాబ్వే పర్యటన నుంచి ఔట్..!
ప్రపంచ చరిత్రలోనే అత్యంత ఖరీదైన 5 అంత్యక్రియల గురించి తెలుసా..?
ప్రపంచ చరిత్రలోనే అత్యంత ఖరీదైన 5 అంత్యక్రియల గురించి తెలుసా..?
పోతావ్ రా రేయ్.. ముందు రోడ్డు కూడా కనిపించనంతగా ఓవర్‌లోడింగ్..
పోతావ్ రా రేయ్.. ముందు రోడ్డు కూడా కనిపించనంతగా ఓవర్‌లోడింగ్..
సంజూ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఆ మెగా టోర్నీకి ఎంపిక చేసిన BCCI.!
సంజూ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఆ మెగా టోర్నీకి ఎంపిక చేసిన BCCI.!
పరుగులు తీస్తున్న రైలు ఇంజిన్‌లో చిక్కుకున్న నెమలి.. కట్ చేస్తే
పరుగులు తీస్తున్న రైలు ఇంజిన్‌లో చిక్కుకున్న నెమలి.. కట్ చేస్తే
అయ్యబాబోయ్‌.. అపార్ట్‌మెంట్ పక్కన ఒళ్ళు గగుర్పొడిచే దృశ్యం!
అయ్యబాబోయ్‌.. అపార్ట్‌మెంట్ పక్కన ఒళ్ళు గగుర్పొడిచే దృశ్యం!
116 ఏళ్ల నవనీతమ్మ సంకల్పం వెతికి మరీ VIP దర్శనం కల్పించిన టీటీడీ
116 ఏళ్ల నవనీతమ్మ సంకల్పం వెతికి మరీ VIP దర్శనం కల్పించిన టీటీడీ
నడుముకు బూడిద బెల్ట్స్.. అప్పట్లో పీరియడ్స్ టైమ్‌లో మహిళలు..
నడుముకు బూడిద బెల్ట్స్.. అప్పట్లో పీరియడ్స్ టైమ్‌లో మహిళలు..
అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు
అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు