
బంగాళదుంప అంటే ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి. మరి, ఈ కూర క్రేజ్ అలాంటిది. వెజ్ కర్రీస్ లో దుంపతో ఏదొక వైరైటీ ఉండాల్సిందే. ఫంక్షన్లలో కూడా బంగాళాదుంప ఫ్రై కానీ, కూర కానీ ఏదోకటి పక్కా ఉంటుంది. ఎందుకంటే దేశంలో ఎంతో మందికి ఫేవరేట్ డిష్.

ఈ దుంపల్లో పొటాషియం, విటమిన్ బి6, విటమిన్ సి, ఐరన్, ఫోలేట్, మెగ్నిషియం, పొటాషియం ఉంటాయి. దీనిని ఎక్కువగా తీసుకోవడం వలన నరాల వ్యవస్థ మెరుగుపడుతుంది. అంతే కాదు, గుండె సమస్యలు కూడా తగ్గుతాయి.

గేమ్స్ ఆడే వాళ్లు వీటిని ఉదయాన్నే తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతే కాదు, ప్రాణాంతక సమస్య అయినా రక్తపోటును కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. కాబట్టి, దీనిని వారానికి రెండు సార్లు తీసుకోండి.

జీర్ణక్రియ పని తీరులో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే, దీనిని ఎక్కువగా తీసుకోవడం వలన పేగుల్లో బ్యాక్టీరియా లెవెల్స్ పెరిగి జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయి. ఈ సమస్య ఉన్న వారు వారంలో మూడు సార్లు బంగాళాదుంపను తీసుకోండి.

వీటిని తీసుకోవడం వలన చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి. ఎందుకంటే, దీనిలో ఉండే విటమిన్ సి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే అలెర్జీ, దురదల సమస్యలున్నా తగ్గుముఖం పడతాయి.