Black Pepper Tea: నల్ల మిరియాలను వంటలలో విస్తృతంగా వాడుతారు. ఇందులో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఎక్కువగా ఆయుర్వేదంలో వినియోగిస్తారు. ఆర్థరైటిస్‌తో బాధపడేవారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. బ్లాక్ పెప్పర్ టీ బరువు తగ్గడంలో సహాయపడుతుంది. నల్ల మిరియాలలో విటమిన్లు , ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది సూపర్‌ఫుడ్‌గా పనిచేస్తుంది. అనేక ఆరోగ్య సమస్యలను నయం చేయడంలో సహాయపడుతుంది.
ఇది జీవక్రియను పెంచడం ద్వారా బరువు తగ్గే ప్రక్రియ కూడా సులువు అవుతుంది. నల్ల మిరియాలలో విటమిన్లు A, K, C, కాల్షియం, పొటాషియం, సోడియం సమృద్ధిగా ఉంటాయి. అదనంగా ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు, డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. భోజనం తర్వాత కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది. అనారోగ్యకరమైన ఆహారం కోరికను తగ్గిస్తుంది. నల్ల మిరియాలు పైపెరిన్ కలిగి ఉంటుంది. ఇది జీవక్రియను మెరుగుపరుస్తుంది. బరువును అదుపులో ఉంచుతుంది.
నల్ల మిరియాల టీ
ఆహారంలో నల్ల మిరియాలు చేర్చుకోవడం సులభమైన మార్గం. కానీ తక్కువ పరిమాణం తీసుకోవాలి. బరువు తగ్గే ప్రక్రియను వేగవంతం చేయడానికి బ్లాక్ పెప్పర్ టీని ప్రయత్నించండి. ఈ టీ చేయడానికి, మీకు 1/4 స్పూన్ నల్ల మిరియాలు, అల్లం, చెంచా తేనె, 1 కప్పు నీరు, నిమ్మకాయ అవసరం. ఒక గిన్నె తీసుకొని దాంట్లో నీరు, నల్ల మిరియాలు, తురిమిన అల్లం కలపండి. నీటిని 5 నిమిషాలు మరగనివ్వండి. ఒక కప్పులో టీని వడకట్టి అందులో నిమ్మరసం, తేనె కలిపి బ్లాక్ పెప్పర్ టీని ఆస్వాదించండి.