ఈ సలాడ్ రోజూ తినడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.. ఆరోగ్యంగా ఉంటారు.. ఎలా తయారు చేయాలంటే..

|

May 15, 2021 | 3:19 PM

ప్రస్తుత పరిస్థితులలో ఆరోగ్యంగా ఉండడమే కాకుండా.. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం కూడా ముఖ్యమే. ఇక కరోనా వైరస్ కారణంగా ప్రతి ఒక్కరు జీవన శైలిలో కూడా

ఈ సలాడ్ రోజూ తినడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది..  ఆరోగ్యంగా ఉంటారు.. ఎలా తయారు చేయాలంటే..
Black Eyed Bean Salad
Follow us on

ప్రస్తుత పరిస్థితులలో ఆరోగ్యంగా ఉండడమే కాకుండా.. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం కూడా ముఖ్యమే. ఇక కరోనా వైరస్ కారణంగా ప్రతి ఒక్కరు జీవన శైలిలో కూడా ఎక్కువగానే మార్పులు జరిగాయి. ఇప్పటికే అందరూ ఇంట్లో చేసిన వంటకాలను మాత్రమే తీసుకొవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇందులో భాగంగా ఎక్కువగా ప్రోటీన్ ఉన్న ఆహారాన్ని తీసుకోవడం మంచిది. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బ్లాక్ ఐడ్ బీన్స్ తో తయారు చేసిన ఫుడ్ మరింత మంచిది. దీనినే లోబియా అని కూడా పిలుస్తారు.

కావల్సినవి..
నిమ్మకాయ రసం.
దాల్చిన చెక్క పొడి 1/4 స్పూన్
మిరియాల పొడి 1/4 స్పూన్
కాల్చిన జీలకర్ర పొడి 1/4 స్పూన్
చాట్ మసాలా 1/4 స్పూన్
తేనె 1 స్పూన్
నల్ల ఉప్పు తగినంత

తయారీ విధానం..
బ్లాక్ ఐడ్ బఠానీలను రాత్రి సమయంలో 4-6 గంటలు నానబెట్టాలి. 2-3 విజిల్స్ వచ్చేవరకు కొంచెం ఉప్పు వేసి ఉడికించాలి. ఆ తర్వాత అందులో ఉన్న నీటిని తీసివేయాలి. 1, 1/2 కప్పుల కంటే ఎక్కువ ఉండకూడదు. ఆ తర్వాత ఒక గిన్నెలో బఠానీలు, తరిగిన టమోటా, దోసకాయ, మామిడి కాయ ముక్కలు, కాటేజ్ చీజ్ జత చేయాలి. ఆ తర్వాత మసాలా వేసి బాగా కలపాలి. ఆ తర్వాత దాని మీద వేరు శనగ, కొత్తిమీర చల్లుకోవడం ఉత్తమం.

లాభాలు..
బఠానీలలో ప్రోటీన్, జింక్, ఫోలేట్, మెగ్నీషియం, పోటాషియం అధికంగా ఉంటుంది. అధిక కరిగే ఫైబర్, కరగని ఫైబర్ కంటెంట్ యాంటీ డయాబెటిక్, యాంటీ హైపెర్టెన్సివ్ ఉత్పత్తిగా కావాల్సినది. చాలా మంది కోవిడ్ రోగులు అధిక షుగర్ లెవల్స్ ను ఎదుర్కోంటున్నారు. కాటేజ్ చీజ్, వేరు శనగ డిష్ ప్రోటీన్, జింక్ విలువను మరింత పెంచుతాయి. నిమ్మకాయలు, టమోటాలలో విటమిన్ సీ ఎక్కువగా ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంచడానికి దాల్చిన చెక్క, నల్ల మిరియాలు మంచివి. జీర్ణక్రియలో నల్ల ఉప్పు సహాయపడుతుంది. టమోటాస్, మామిడి, దోసకాయలలో ఫైటోకెమికల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో మంటను తగ్గిస్తుంది.

Also Read: కొలిక్కిరాని ‘ఇండియన్ 2’ వివాదం.. శంకర్ మూవీ గొడవలో మరో మలుపు.. మరోసారి డైరెక్టర్‏కు షాకిచ్చిన నిర్మాణ సంస్థ..