Homeremedies For Cough: వర్షాకాలం వచ్చేసింది.. ఇప్పటికే ఓ వైపు కరోనా కల్లోలం సృష్టిస్తుంటే.. మరోవైపు చినుకులకు సీజనల్ వ్యాధులు మేము ఉన్నామంటూ వచ్చేస్తాయి. ముఖ్యంగా ఈ సీజన్ లో దగ్గు, జలుబుతో ఇబ్బంది పడడం సర్వసాధారణం..అయితే ఈ సీజనల్ దగ్గునే కాదు.. కరోనా సమయంలో వచ్చిన దగ్గు నివారించుకోవడానికి అల్లోపతి మందులకంటే కూడా వంటింటిలో ఉన్న పదార్ధాలతో సులభంగా తగ్గించుకోవచ్చు అని అంటున్నారు ఆయువేద వైద్యులు . ఆ చిట్కాలు ఏమిటో చూద్దాం..
దగ్గుకి తేనెను మించిన ఔషధం లేదు. తేనెలో ఏమీ కలపకుండా నేరుగా తీసుకుంటే గొంతులోపల ఓ పూతలా ఏర్పడి.. గరగరమనే మంటను తగ్గిస్తుంది. తేనెకి కాస్త నిమ్మరసం కలిపి తీసుకున్నా తక్షణ ఉపశమనం ఉంటుంది.
ఉదయం పరగడుపునే తమలపాకు పై తేనేను రంగరించి ఆ తేనెను తీసుకుంటే కూడా ఎటువంటి దగ్గు నుంచి అయినా ఉపశమనం కలుగుతుంది. ఇలా ఒక 15 రోజులు చేస్తే.. దగ్గునుంచి విముక్తి కలుగుతుంది.
అల్లం టీ కూడా దగ్గుకి మంచి ఔషధంగా పనిచేస్తుంది. అల్లాన్ని పది పన్నెండు చిన్న ముక్కలుగా కోసి.. మూడు కప్పుల నీటిలో 20 నిమిషాలు వేడి చేయండి. కాస్త చల్లారాక చెంచా తేనె కలపండి. నిమ్మకాయ రెండు చెక్కలు పిండేయండి. రుచి చూసి ఘాటుగా అనిపిస్తే కాసిని నీళ్లు కలపండి. రెండు పూటలా దీన్ని తాగితే దగ్గు తగ్గిపోతుంది.
చెంచా నల్ల మిరియాలకు చెంచా తేనె కలపండి. వీటిలో వేడినీళ్లు పోయండి. ఈ మిశ్రమంపై మూతపెట్టి పావుగంట తరువాత తాగితే ఫలితం ఉంటుంది.
అలాగే కప్పు నీటిలో చెంచా పసుపూ, చెంచా వామూ వేసి వేడి చేయండి. నీళ్లు సగానికి సగం తగ్గేదాకా మరగనిచ్చి దించేయండి. దీనికి తేనె కలిపి రోజులో మూడుపూటలా తాగితే దగ్గు త్వరగా తగ్గుతుంది.
Also Read: సర్వ గుణ సంపన్న ఔషధం పసుపు యొక్క అద్భుతమైన ఆయుర్వేద గుణాలు