శీతాకాలంలో వేరుశెనగలు తినటం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దీంతో మంచి రుచిని, శరీరానికి అవసరమైన అదనపు పోషకాలను అందిస్తుంది. వాటిలో సూక్ష్మ, స్థూల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. వేరుశెనగ అనేక వ్యాధుల నుండి మనలను కాపాడుతుంది. వేరుశెనగలను పలు రకాల వంటకాల్లో ఉపయోగిస్తారు. అలాగే, వీధి వ్యాపారుల వద్ద కూడా శీతాకాలంలో ఉడికించిన, కాల్చిన వేరుశెనగ, లేద పల్లీలతో తయారు చేసిన స్వీట్స్ ఎక్కువగా అమ్ముతుంటారు. ప్రత్యేకమైన రుచి, పోషకాహారం కారణంగా ఇది తినడానికి రుచికరమైన ఆహారం. పైగా సరసమైన ధరలో లభిస్తుంది. కాబట్టి, ప్రతి ఒక్కరూ ఈజీగా పల్లీలను కొనుగోలు చేయగలరు. ఇకపోతే, చలికాలంలో పల్లీలను తినటం వల్ల కలిగే ప్రయోజనేలేంటో ఇక్కడ తెలుసుకుందాం..
వేరుశెనగలో పీచు, ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఈ రెండు పోషకాలు బరువు తగ్గడంలో సహాయపడతాయి. ఫైబర్ కడుపు నిండిన అనుభూతిని అందిస్తుంది. జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. ఇది మనం ఎక్కువగా, అనవసరమైన, అనారోగ్యకరమైన ఆహారాన్ని తినకుండా నిరోధిస్తుంది. వేరుశెనగలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. అల్పాహారం, మధ్యాహ్న భోజనం మధ్య లేదా మధ్యాహ్నం, రాత్రి భోజనం మధ్య మీకు ఆకలిగా అనిపిస్తే, మీరు అనారోగ్యకరమైన స్నాక్స్‌కు బదులుగా వేరుశెనగలను తినవచ్చు.
కేలరీలు ఎక్కువగా ఉన్నప్పటికీ, రోజుకు కొన్ని వేరుశెనగలు తినడం వల్ల అధిక బరువు పెరగకుండా శరీరానికి అవసరమైన పోషకాలను అందించవచ్చు. వేరుశనగల్లో ఖనిజాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్ల అద్భుతమైన మూలం. ఇవి సమతుల్య ఆహారాన్ని పూర్తి చేస్తాయి. వేరుశెనగలోని మెగ్నీషియం జీవక్రియకు సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన జీవక్రియ కోసం వేరుశనగలను ప్రతిరోజూ తినవచ్చు.
చాలా మంది వేరుశెనగలో కొవ్వు ఎక్కువగా ఉంటుందని వాటిని ఎక్కువగా తినకూడదని అనుకుంటారు. అయితే వీటిని మితంగా తీసుకోవచ్చు. ఈ కొవ్వులు నిజానికి ఆరోగ్యకరమైనవి. గుండె ఆరోగ్యానికి అత్యంత ప్రయోజనకరమైనవి. వాటిలో కేలరీలు అధికంగా ఉంటాయి. కానీ దాంతో పెద్దగా బరువు పెరగరు. వేరు శనగలో ఉండే కొవ్వులు మితంగా తీసుకుంటే నిజంగా ఆరోగ్యకరమైనవి. గుండె ఆరోగ్యానికి కూడా ఇది చాలా మేలు చేస్తుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..