Pineapple water: పైనాపిల్‌ వాటర్ ఆరోగ్యానికి వరం..! ముఖం మెరుస్తుంది.. మీ జీవితాన్ని రక్షిస్తుంది.. ఎలాగో తెలుసా.?

|

Mar 14, 2024 | 6:53 AM

పైనాపిల్ వాటర్ అంటే పైనాపిల్ ముక్కలను కట్‌ చేసుకుని ఒక గ్లాసు నీటిలో వేసి కాసేపు అలాగే నానబెట్టండి. పండ్లను అలా నీటిలో ఎక్కువసేపు నానబెట్టిన తర్వాత పండును తీసివేసి ఈ నీటిని తాగండి. మీరు ఇప్పటి వరకు పైనాపిల్ వాటర్ తీసుకోకపోతే, ఇకపై ఖచ్చితంగా మీ ఆహారంలో చేర్చుకోండి. దీని ద్వారా అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Pineapple water: పైనాపిల్‌ వాటర్ ఆరోగ్యానికి వరం..! ముఖం మెరుస్తుంది.. మీ జీవితాన్ని రక్షిస్తుంది.. ఎలాగో తెలుసా.?
Pineapple Water
Follow us on

మనలో చాలా మందికి పైనాపిల్ అంటే చాలా ఇష్టం. ఈ పండు తీపి-పుల్లని రుచిని కలిగి ఉంటుంది. వేసవి కాలంలో ఎక్కువగా పైనాపిల్, దాని జ్యూస్ ఎక్కువగా తాగుతుంటారు. ఇది శరీరానికి చాలా ఉపయోగకరమైనది. అయితే మీరు ఎప్పుడైనా పైనాపిల్ వాటర్ తాగారా ..? కనీసం దాని గురించి విన్నారా.? పైనాపిల్ నుండి నీరు రాదు.. కాబట్టి పైనాపిల్ నీరు తాగడం ఎలా సాధ్యమని ఆలోచిస్తున్నారు కాదా..? పైనాపిల్ వాటర్ అంటే పైనాపిల్ ముక్కలను కట్‌ చేసుకుని ఒక గ్లాసు నీటిలో వేసి కాసేపు అలాగే నానబెట్టండి. పండ్లను అలా నీటిలో ఎక్కువసేపు నానబెట్టిన తర్వాత పండును తీసివేసి ఈ నీటిని తాగండి. మీరు ఇప్పటి వరకు పైనాపిల్ వాటర్ తీసుకోకపోతే, ఇకపై ఖచ్చితంగా మీ ఆహారంలో చేర్చుకోండి. దీని ద్వారా అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.

మన శరీరం సరిగ్గా పనిచేయడానికి హైడ్రేట్ గా ఉండటం చాలా ముఖ్యం. అందుకే వైద్యులు రోజంతా 8 నుండి 10 గ్లాసుల నీరు తాగాలని చెబుతుంటారు. అయితే కొంతమంది నీటి రుచిని ఇష్టపడరు. అందుకే నీళ్లు తాగేందుకు ఇష్టపడరు. దాంతో వారు తరచూగా డీహైడ్రేషన్, అలసట, తలనొప్పి వంటి సమస్యలు మొదలవుతాయి. అటువంటి పరిస్థితిలో, నీటిలో పైనాపిల్ వంటి తీపి రుచిని కలిపి తాగటం వల్ల నీటి ఆకర్షణ పెరుగుతుంది. దానితో మీరు మీ హైడ్రేషన్ అవసరాలను తీర్చుకోవచ్చు. అలా ఒక సంవత్సరం పాటు ప్రతిరోజూ ఉదయాన్నే పైనాపిల్ వాటర్ తాగడం వల్ల మీ శరీరంపై ఎలాంటి ప్రభావాలు ఉంటాయో తెలుసా..? ఇటీవల వైద్యులు దీనిపై అధ్యయనం చేశారు. వారి పరిశోదనలో వెల్లడైన విషయాలను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు షేర్‌ చేశారు. ఈ మేరకు వివరాల్లోకి వెళితే..

పైనాపిల్ నీరు సహజమైన డిటాక్స్‌గా పనిచేస్తుంది. మంటను తగ్గిస్తుంది, థైరాయిడ్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఒక యేడాది పాటు ప్రతిరోజూ పైనాపిల్ నీటిని తాగడం వల్ల మీ మొత్తం ఆరోగ్యానికి విశేషమైన ప్రయోజనాలు లభిస్తాయని చెప్పారు. పైనాపిల్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మంటను తగ్గిస్తుందని చెప్పారు. పైనాపిల్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అదనంగా, పైనాపిల్ నీటిలో బ్రోమెలైన్ అనే ఆరోగ్యకరమైన ఎంజైమ్‌ పేగు ఆరోగ్యాన్ని రక్షించడంలో సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

అదనంగా, పైనాపిల్ వాటర్‌లోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు శరీరం అంతటా మంటను తగ్గించడంలో సహాయపడతాయి. కీళ్ల నొప్పులు, వాపులను తగ్గిస్తాయి. పైనాపిల్స్‌లో బీటా కెరోటిన్, విటమిన్ సి ఉన్నాయి. ఇవి మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కళ్ళకు కూడా మేలు చేస్తాయి. పైనాపిల్స్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మీ ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. పైనాపిల్ తీసుకోవడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్‌ని తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని బాగా తగ్గిస్తుంది. బరువును అదుపులో ఉంచుతుంది.

తరచూగా వాంతులు సమస్యతో బాధపడుతున్న వారు పైనాపిల్ తీసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది. ఇందులోని లక్షణాలు మోషన్ సిక్‌నెస్‌ని నయం చేసి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కొందరు కడుపులో నులిపురుగుల సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు తమ ఆహారంలో పైనాపిల్‌ను చేర్చుకోవడం ద్వారా కడుపులోని నులిపురుగులను కూడా వదిలించుకోవచ్చు.

పైనాపిల్ వాటర్ తాగడం వల్ల దంతాలు, ఎముకలు బలపడతాయి. అలాగే, థైరాయిడ్ ఉన్నవారికి కూడా ఇది మేలు చేస్తుంది. ఇంకా, పైనాపిల్‌లోని యాంటీఆక్సిడెంట్లు సెల్ డ్యామేజ్‌ను నివారించడంలో సహాయపడతాయి. కొంతవరకు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మొత్తానికి పైనాపిల్ నీరు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని వైద్య ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే దీంతో పాటుగా సమతుల్య ఆహారం, జీవనశైలి కూడా అంతే ముఖ్యమని గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి