- Telugu News Photo Gallery Bad Habits for Weight Gain: Common Reasons You Might Be Gaining Weight So Fast
Bad Habits for Weight Gain: ఈ అలవాట్లు ఉంటే మీకే తెలియకుండా బోండంలా ఊరిపోతారు.. కొంచెం చూస్కోండి మరీ!
ఈ రోజుల్లో అధిక శరీర బరువుతో ఎంతో మంది బాధపడుతున్నారు. బరువును అదుపులో ఉంచుకోవడానికి చాలా మంది డైట్ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కానీ, బరువు పెరగడీనికి ఆహారం మాత్రమే కాదు.. ఈ కింది కొన్ని అలవాట్లు కూడా బరువు పెరగడానికి కారణం అంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం.. ఈరోజుల్లో ఆఫీస్ పని అంటే కుర్చీలో గంటల తరబడి కూర్చొని కంప్యూటర్ పై పనిచేయడం. ఎక్కువ సేపు ఒకే విధంగా కూర్చుంటే శరీరంలోని జీవక్రియలు సరిగా జరగవు..
Updated on: Mar 13, 2024 | 9:01 PM

ఈ రోజుల్లో అధిక శరీర బరువుతో ఎంతో మంది బాధపడుతున్నారు. బరువును అదుపులో ఉంచుకోవడానికి చాలా మంది డైట్ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కానీ, బరువు పెరగడీనికి ఆహారం మాత్రమే కాదు.. ఈ కింది కొన్ని అలవాట్లు కూడా బరువు పెరగడానికి కారణం అంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం.. ఈరోజుల్లో ఆఫీస్ పని అంటే కుర్చీలో గంటల తరబడి కూర్చొని కంప్యూటర్ పై పనిచేయడం. ఎక్కువ సేపు ఒకే విధంగా కూర్చుంటే శరీరంలోని జీవక్రియలు సరిగా జరగవు. ఫలితంగా బరువు పెరుగుతుంది. ముఖ్యంగా పొట్ట-నడుము కొవ్వు పేరుకుపోతుంది. కాబట్టి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.

శరీర బరువుతో నిద్రకు ప్రత్యేక సంబంధం ఉంది. తగినంత నిద్ర లేకపోవడం హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. ఫలితంగా ఆకలి పెరిగి, జంక్ ఫుడ్ కు అలవాటు పడతారు. వాటిని తినడం వల్ల బరువు పెరుగుతుంది. కాబట్టి బరువు తగ్గాలంటే రోజుకు 6-7 గంటలు నిద్రపోవాలి.

చాలా మంది ఒత్తిడి ఎక్కువగా ఉన్న సమయంలో తమ మూడ్‌ని మార్చుకోవడానికి జంక్ ఫుడ్‌ను తింటారు. ఇటువంటి ఆహారాల్లో అధిక కేలరీలు బరువు పెరగడానికి దారితీస్తాయి. అంతేకాకుండా అధిక ఒత్తిడి హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. ఇది బరువు పెరగడానికి కూడా దారితీస్తుంది. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం, యోగా చేయాలి. చాలా మంది వేడి వాతావరణంలో కాస్త సౌకర్యంగా ఉండేందుకు శీతల పానీయాలు, ప్యాక్డ్ డ్రింక్స్ సేవిస్తుంటారు. కానీ, వాటిలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆకలి, దాహాన్ని పెంచుతాయి. దీంతో సహజంగానే శరీర బరువు పెరుగుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను కూడా పెంచుతుంది.

చాలామంది త్వరగా కడుపు నింపుకోవడానికి జంక్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్ తింటారు. శరీర బరువు పెరగడానికి ఇవీ ఒక కారణం. కాబట్టి బరువు అదుపులో ఉండాలంటే జంక్ ఫుడ్ కు బదులు కూరగాయలు, పండ్లు, గింజలు తినడం మంచిది. ఈ రోజుల్లో పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ భోజనం చేసేటప్పుడు టీవీ చూడటమో లేదా మొబైల్ ఫోన్‌లు ఉపయోగించడమో చేస్తుంటారు. శ్రద్ధలేకుండా తినడం వల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. దీంతో జీవక్రియ చెదిరిపోతుంది. ఇలా ఫోన్ చూస్తూ తింటే తెలియకుండానే అదనంగా ఆహారం తినే అవకాశం ఉంది. ఇది శరీర బరువును ప్రభావితం చేస్తుంది.

శరీర బరువును తగ్గించుకోవడానికి, చాలా మంది సమయం పాటు కడుపుని ఖాళీగా ఉంచుతారు. అల్పాహారం లేదా రాత్రి భోజనాన్ని దాటవేస్తారు. కానీ, ఈ అలవాటు వల్ల శరీర బరువు తగ్గడానికి బదులు పెరుగుతుంది. బదులుగా సమతుల్య ఆహారాన్ని మితంగా తినడం వల్ల అధిక కేలరీల వినియోగాన్ని నిరోధించవచ్చు.




