AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: వాటే ఐడియా గురూ..! కోట్ల సంపద ఇలా దాస్తే.. ఆ దేవుడు కూడా పసిగట్టలేడు..

ఈ గుహలోనే వారు తమ విలువైన వస్తువులు, ఆభరణాలు, గుప్తనిధులను భద్రపరుస్తారని చెప్పారు.. కొండకు సొరంగంలా ఏర్పాటు చేసి దానికి తలుపులా బండరాయిని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎంత సంపద దాచినా కూడా ఎవరూ పసిగట్టలేరు. దొంగలు ఎత్తుకెళతారనే భయం కూడా లేదు.. అయితే ఈ వీడియో ఎక్కడిది అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. కానీ, సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూస్తే మాత్రం అవాక్కే..

Watch Video: వాటే ఐడియా గురూ..! కోట్ల సంపద ఇలా దాస్తే.. ఆ దేవుడు కూడా పసిగట్టలేడు..
Locker
Jyothi Gadda
|

Updated on: Mar 13, 2024 | 12:40 PM

Share

బంగారంపై భారతీయుల మోజు కొత్తేమీ కాదు. మన దేశంలో ప్రజలు వివిధ కారణాలు, సందర్భాలలో బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. కొంత మంది బంగారాన్ని వ్యక్తిగత అవసరాల కోసం అంటే ఆభరణాల రూపంలో కొంటారు. కొందరు పెట్టుబడిగా బంగారం కొంటారు. కొంతమంది వ్యక్తులు త్వరగా రుణం పొందడానికి లేదా వ్యాపారంలో మూలధనాన్ని పెంచడానికి బంగారాన్ని కొనుగోలు చేస్తారు. అయితే, సాధారణంగా అందరూ ఆభరణాలను ఒక భద్రమైన గదిలో పెట్టెలో లాకర్‌లో ఉంచి దాచుకుంటారు. దాదాపుగా అందరూ ఇలాగే భద్రపరుచుకుంటారు.

ఇంట్లో దొంగతనాలు, దోపిడీలు జరుగుతాయనే భయంతో బ్యాంకు లాకర్లలో డబ్బు, నగలు భద్రంగా ఉంచడం మంచిదని మరికొందరు ప్రజలు భావిస్తారు. హోమ్ లాకర్ల కంటే బ్యాంక్ లాకర్లను సురక్షితంగా పరిగణిస్తారు. అందువల్ల పెద్ద మొత్తం నగలు, ముఖ్యమైన పత్రాలు ఉంటే ఖాతాదారులు వాటిని బ్యాంకు లాకర్‌లో భద్రపరుచుకుంటారు. బ్యాంకు లాకర్లు కస్టమర్లకు సురక్షితం. కానీ ఇప్పటికీ ఇంట్లో నగలు పెట్టుకునే వారు ఎక్కువగానే ఉన్నారు. అయితే ఇంట్లో లాకర్ లేనప్పుడు బంగారం ఎక్కడ ఉంచాలో తెలుసా? ప్రస్తుతం, సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. అందులో ప్రజలు తమ బంగారం ఎక్కడ దాచుకున్నారో తెలిస్తే ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకోవాల్సిందే.

ఇవి కూడా చదవండి

వైరల్‌ వీడియోలో ముందుగా ఒక వ్యక్తి ఒక కొండలాంటి రాయికి తలుపు వంటి బండరాయిని ఓపెన్‌ చేశాడు.. తీరా చూస్తే అందులో లాకర్‌ లాంటి ఏర్పాటు ఉంది. ఈ గుహలోనే వారు తమ విలువైన వస్తువులు, ఆభరణాలు, గుప్తనిధులను భద్రపరుస్తారని చెప్పారు.. కొండకు సొరంగంలా ఏర్పాటు చేసి దానికి తలుపులా బండరాయిని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎంత సంపద దాచినా కూడా ఎవరూ పసిగట్టలేరు. దొంగలు ఎత్తుకెళతారనే భయం కూడా లేదు.. అయితే ఈ వీడియో ఎక్కడిది అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. కానీ, సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సంపద ఎక్కవుగా ఉన్నవారు తమ ఇళ్లలో రహస్య సెల్లార్లు తయారు చేసుకుని ఇలా తమ సంపదను దాచుకుంటారు. ఎవరైనా దొంగలు, అగంతకులు వచ్చిన వారికి ఏమీ కనిపించకూడదనే ఉద్దేశ్యంతో ఈ ఏర్పాటు చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..