AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అత్యుత్సాహం వద్దు..! ఈ వీడియో చూస్తే గుండె ఆగినంత పనవుతుంది.. మహిళను మింగేసిన రాకాసి..

వైరల్‌ వీడియోలో సముద్రం కనిపిస్తుంది. సముద్రంలో పెద్ద పెద్ద అలలు ఎగిసి పడుతున్నాయి. ఆ సమయంలో అక్కడ ఓ యువతి ఫోటో షూట్ చేస్తోంది. ఒడ్డున నిలబడి ఉన్న ఆ మహిళ నీటిని ఆస్వాదించడానికి నెమ్మదిగా నీటిలోకి వెళుతుంది. కానీ ఆమె సంతోషం ఎంతోసేపు నిలవలేకపోయింది. అలల తాకిడితో ఆమె అమాంతంగా కొట్టుకుపోయింది.

Viral Video: అత్యుత్సాహం వద్దు..! ఈ వీడియో చూస్తే గుండె ఆగినంత పనవుతుంది.. మహిళను మింగేసిన రాకాసి..
Shocking Incident
Jyothi Gadda
|

Updated on: Mar 13, 2024 | 1:29 PM

Share

పర్వతాలు, లోయలు, నదుల అందాలను చూసేందుకు అందరూ ఇష్టపడతారు. జలపాతాలు జాలువారుతూ, ఆకాశంలోని మేఘాలను తాకే పర్వతాలలో సెలవులు గడపడంలో ఒక ప్రత్యేకమైన ఆనందం ఉంటుంది. కానీ యువత ఫోటోలు, రీళ్లు చేసే సందడిలో ప్రాణాలను రిస్క్‌లో పెడుతున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి మరీ రీల్స్‌ తయారు చేస్తున్నారు. సోషల్ మీడియాలో పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి అలాంటి వారు దేనికైనా సిద్ధపడుతున్నారు. ఇప్పటికే రీల్స్‌ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన చాలా మంది వీడియోలు మనం చూశాం. తాజాగా అలాంటిదే మరో వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన తర్వాత సముద్రంలో ఇలాంటి సాహసాలు చేయాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు.

నిప్పు, గాలి, నీరు ప్రాణాంతకమైనవి.. అందుకే వాటితో ఎప్పుడూ ఆడకూడదని అంటారు. ఒక్కోసారి వీడియోల వల్ల, ఇంకొన్ని సార్లు సెల్ఫీల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా సముద్రంలో సరదగా ఎంజాయ్‌ చేస్తుండగా ఊహించిన సంఘటన ఎదురైంది. ఆ భయానక వీడియో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

వైరల్‌ వీడియోలో సముద్రం కనిపిస్తుంది. సముద్రంలో పెద్ద పెద్ద అలలు ఎగిసి పడుతున్నాయి. ఆ సమయంలో అక్కడ ఓ యువతి ఫోటో షూట్ చేస్తోంది. ఒడ్డున నిలబడి ఉన్న ఆ మహిళ నీటిని ఆస్వాదించడానికి నెమ్మదిగా నీటిలోకి వెళుతుంది. కానీ ఆమె సంతోషం ఎంతోసేపు నిలవలేకపోయింది. అలల తాకిడితో ఆమె అమాంతంగా కొట్టుకుపోయింది. ఎంత ప్రయత్నించినా ఆమె బయటకు రాలేకపోయింది. రాకసి అలలు ఆమెను క్షణాల్లో చూస్తుండగానే లోపలికి లాగేసుకుంది. ఇంతలో, ఫోటోలు తీస్తున్న యువకుడు ఇదంతా చూసి ఆమెకు సహాయం చేయడానికి పరుగెత్తాడు. కానీ, కళ్లముందే ఆ మహిళ క్షణంలో అదృశ్యమవుతుంది.

ఈ వీడియో వైరల్‌గా మారడంతో నెటిజన్లు కూడా స్పందించారు. నీళ్లతో ఆడుకోవడం, రిస్క్ తీసుకోవడం ఎంత ఖరీదో ఇప్పటికైన అర్థం చేసుకోవాలంటూ ప్రజలు సూచిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..