Banana : గుర్తుంచుకోండి..! ఈ మూడు సమయాల్లో అరటిపండ్లు తినకూడదు..? ఎందుకంటే..

|

Jul 21, 2021 | 7:31 PM

Banana : అరటిపండు ఆరోగ్యానికి మేలు చేస్తుందని అందరికి తెలుసు. కచ్చితంగా ఇది నిజం. కానీ ఆరోగ్యానికి మేలు చేయాలంటే సరైన సమయంలో తినడం ముఖ్యం. వైద్యులు కూడా ఇదే సూచిస్తారు.

Banana : గుర్తుంచుకోండి..! ఈ మూడు సమయాల్లో అరటిపండ్లు తినకూడదు..? ఎందుకంటే..
Bananna
Follow us on

Banana : అరటిపండు ఆరోగ్యానికి మేలు చేస్తుందని అందరికి తెలుసు. కచ్చితంగా ఇది నిజం. కానీ ఆరోగ్యానికి మేలు చేయాలంటే సరైన సమయంలో తినడం ముఖ్యం. వైద్యులు కూడా ఇదే సూచిస్తారు. ఎందుకంటే కొన్ని సమయాల్లో ఇది శరీరానికి హాని కలిగించవచ్చు. అందుకే సరైన సమయంలో అరటిపండ్లను తినడం అలవాటు చేసుకోవాలి. అయితే ఏ సమయంలో అరటిని తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

1. రాత్రిపూట అరటిపండ్లకు దూరంగా ఉండటం మంచిది..
అరటిలో ఇనుము, ట్రిప్టోఫాన్, విటమిన్ బి 6, విటమిన్ బి అలాగే పొటాషియం, ఫైబర్, మెగ్నీషియం ఉంటాయి. ఇవి మీ ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తాయి. అయితే అరటిపండ్లు రాత్రిపూట తినకూడదు. చాలా మంది నిపుణులు రాత్రి అరటి తినడం వల్ల ఎటువంటి హాని లేదని చెబుతారు కానీ ఇది తప్పు. అరటిలో పెద్ద మొత్తంలో పోషకాలు ఉంటాయి ఇవి మీకు శక్తిని ఇస్తాయి. కానీ మీ శరీరం రాత్రిపూట విశ్రాంతి అడుగుతుంది. మీరు ఈ సమయంలో అరటిపండు తింటే మీకు శక్తి వస్తుంది కానీ నిద్ర పట్టడం కష్టం. ఇది కాకుండా అరటిపండ్లు జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. అందుకే పడుకునే ముందు అరటి తినకుండ ఉంటేనే మంచిది.

2. జలుబు, దగ్గు ఉన్నప్పుడు తినవద్దు
ఆయుర్వేదం ప్రకారం.. జలుబు, దగ్గు ఉన్నవారు అరటిపండు తినకూడదు. వాస్తవానికి ఆయుర్వేదంలో వాత, కఫా, పిత్త అనే మూడు స్వభావాలు ఉంటాయి. ఇందులో కఫ స్వభావం ఉన్న రోగులు అరటి తినకుండా ఉండాలి. ఆయుర్వేదం ప్రకారం కూడా ప్రజలు సాయంత్రంపూట అరటిపండు తినకూడదు.

3. ఖాళీ కడుపుతో తినకూడదు
ఉదయం అల్పాహారంలో అరటిపండు చేర్చండని అందరు చెబుతారు కానీ అరటిపండ్లు ఖాళీ కడుపుతో తినకూడదు. కానీ అరటితో పాటు ఇతర పండ్లను కలిపి తింటే మంచిది. ఎందుకంటే అరటిలో మెగ్నీషియం ఉంటుంది ఇది రక్తంలో కాల్షియం, మెగ్నీషియం మొత్తాన్ని మరింత దిగజార్చుతుంది. అందుకే అరటిని ఎప్పుడూ ఖాళీ కడుపుతో తినకూడదు.

AP Weather Report: రాగల మూడు రోజుల్లో ఏపీలో భారీ వర్షాలు.. గంటకు 20 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు

Balineni : చంద్రబాబు.. ప్రాంతాలు, కులాల మధ్య చిచ్చుపెట్టేలా వ్యవహరిస్తున్నారు : విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి

LIC Jeevan Shiromani : ఎల్‌ఐసీ జీవన్ శిరోమణి పాలసీ.. కోటీ రూపాయల ప్రయోజనం.. పొదుపు, భద్రత గ్యారంటీ..