రోజూ ఒక అరటి పండు.. 30 రోజులు తింటే శరీరంలో ఏమవుతుందో తెలుసా..?

ఇందులోని పొటాషియం రక్తపోటును కంట్రోల్‌లో ఉంచడంలో సహాయపడుతుంది. మానసిక ఆరోగ్యానికి కూడా అరటి బాగా ఉపయోగపడుతుంది. ఇందులోని ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం సంతోషం కలిగించే హార్మోన్ సెరోటోనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది ఒత్తిడిని దూరం చేస్తుంది. అరటి పండులో విటమిన్‌ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

రోజూ ఒక అరటి పండు.. 30 రోజులు తింటే శరీరంలో ఏమవుతుందో తెలుసా..?
Banana

Updated on: Mar 26, 2025 | 8:53 PM

మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల్య ఆహారం అవసరం. ఈ ఆహారంలో అన్ని పోషకాలు సరైన నిష్పత్తిలో ఉండాలి. రోజూ అరటిపండును తింటే మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతాం. అరటిపండు పొటాషియం, విటమిన్ బి6, ఫైబర్ అధికంగా ఉండే పండు, ఇది మన సమతుల్య ఆహారంలో ముఖ్యమైన భాగంగా మారవచ్చు. ముఖ్యంగా మీరు ఒక నెలరోజుల పాటు రోజూ ఒక అరటిపండును తింటే ఎన్నో ఆశ్చర్యపోయే ప్రయోజనాలను చూస్తారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

రోజూ అరటిపండు తినడం వల్ల మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఇది మన జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. అరటిపండులో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. దీనితో పాటు, అరటిపండు మెదడుకు కూడా మేలు చేస్తుంది. దీనిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని అనేక వ్యాధుల నుండి రక్షిస్తాయి. బరువు తగ్గాలనుకునే వారికి అరటి బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఇందులోని ఫైబర్‌ త్వరగా కడుపు నిండిన భావన కలిగేలా చేస్తుంది. దీంతో బరువు తగ్గడానికి తోడ్పడుతుంది.

అరటి పండులో పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలకు బలాన్ని చేకూర్చుతుంది. కాల్షియం నష్టాన్ని తగ్గించి ఎములకను ఆరోగ్యాంగా ఉంచుతుంది. అరటి పండులో ఫైబర్ కంటెంట్‌ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. హైబీపీతో బాధపడేవారికి కూడా అరటి పండు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులోని పొటాషియం రక్తపోటును కంట్రోల్‌లో ఉంచడంలో సహాయపడుతుంది. మానసిక ఆరోగ్యానికి కూడా అరటి బాగా ఉపయోగపడుతుంది. ఇందులోని ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం సంతోషం కలిగించే హార్మోన్ సెరోటోనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది ఒత్తిడిని దూరం చేస్తుంది. అరటి పండులో విటమిన్‌ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..