Winter Health Tips: అధికంగా టీ,కాఫీలు తాగేస్తున్నారా? వాటికి బదులుగా వీటిని తాగితే ఆరోగ్యం..ఆనందం మీ సొంతం

| Edited By: Anil kumar poka

Jan 03, 2023 | 7:00 PM

టీ, కాఫీల్లో ఉండే కెఫీన్ కు అలవాటు పడితే చాలా డేంజర్ అని అంటున్నారు. కెఫీన్ పై ఎక్కువగా ఆధారపడడం వల్ల డీహైడ్రేషన్, ఎసిడిటీ, పోషకాలను గ్రహించడంలో ఇబ్బంది, నిద్రలేమి, వంటి దుష్ప్రభావాలు ఏర్పడే అవకాశం ఉంది.

Winter Health Tips: అధికంగా టీ,కాఫీలు తాగేస్తున్నారా? వాటికి బదులుగా వీటిని తాగితే ఆరోగ్యం..ఆనందం మీ సొంతం
Ginger Tea
Follow us on

శీతాకాలంలో అందరూ ఇష్టపడేది వేడి..వేడి పానియాలు. ఎక్కువగా టీ..కాఫీల వైపు మొగ్గుచూపుతారు. అయితే అతి ఎన్నటికి ప్రమాదమే వైద్యులు హెచ్చరిస్తున్నారు. అధికంగా టీ, కాఫీలు సేవిస్తే చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. టీ, కాఫీల్లో ఉండే కెఫీన్ కు అలవాటు పడితే చాలా డేంజర్ అని అంటున్నారు. కెఫీన్ పై ఎక్కువగా ఆధారపడడం వల్ల డీహైడ్రేషన్, ఎసిడిటీ, పోషకాలను గ్రహించడంలో ఇబ్బంది, నిద్రలేమి, వంటి దుష్ప్రభావాలు ఏర్పడే అవకాశం ఉంది. అయితే కెఫీన్ మానసిక స్థితి అప్పటికప్పుడు మెరుగుపడేలా చేస్తుంది కానీ వ్యసనంగా మారితే ప్రమాదం పొంచి ఉంటుంది. అలాగే టీ, కాఫీల్లో వాడే అధిక షుగర్ కారణంగా అవి తాగాక కొంచెం అన్ ఈజీగా అనిపిస్తుంది. కేఫీన్ తీసుకోవడం తగ్గిస్తే తలనొప్పి, వణుకు, మానసిక కల్లోలం వంటి సమస్యలు నుంచి బయటపడవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

టీ, కాఫీలకు బదులుగా ఇవి మేలు

గోరువెచ్చని నిమ్మరసం

మనలో చాలా మంది ఒక కప్పు టీ లేదా కాఫీతో రోజును ప్రారంభించేవారు చాలా మంది ఉన్నారు. అలాంటి ఉదయాన్ని గ్లాస్ గోరువెచ్చని నీళ్లల్లో నిమ్మరసం వేసుకుని తాగితే జీర్ణక్రియకు చాలా మంది. అలాగే శరీరానికి అవసరమయ్యే విటమిన్ -సీ కూడా అందుతుంది.

బాదం పాలు

మీరు టీ కాఫీలకు బదులుగా పసుపు వేసి, యాలకుల ఫ్లేవర్ తో ఉండే బాదం పాలును తీసుకుంటే మంచిది. ఎందుకంటే పసుపు, యాలకులు జీర్ణక్రియను మెరుగుపర్చడంలో సాయం చేస్తాయి. అలాగే బాదంలో ఉండే విటమిన్ -ఈ, ఐరన్, పోటీషియం, ప్రోటీన్ల వల్ల గుండెకు ఇబ్బంది లేదు ఆరోగ్యకరమైన కొవ్వును అందించవచు. అలాగే సాయంత్రం సమయంలో టీ, కాఫీలకు బదులుగా ఏదైనా హోమ్ మేడ్ సూప్ తాగితే డిన్నర్ సమయంలో ఆకలి వేసి బాగా తింటాం.

ఇవి కూడా చదవండి

హెర్బల్ టీ

అలాగే చాలా మంది టీ లో రుచి కోసం మసాలా టీను ఇష్టపడతారు. అలాంటి మసాలా టీ బదులుగా మసాల దినుసులు వేసి చేసి హెర్బల్ టీ కు మారితే మంచిది. దాల్చిన చెక్క, తులసి, లవంగం, యాలకులు, అల్లం వేసి నీటిని మరిగించి, అందులో బెల్లం కలుపుకుని తాగితే హెర్బల్ టీ అదిరిపోతుంది. 

లెమన్ టీ

ఎక్కువ సార్లు టీ, కాఫీలు తాగే అలవాటు ఉన్న వారు వాటికి బదులుగా లెమన్ టీ వైపు మళ్లితే మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వేడి నీళ్లల్లో అల్లం, తేనే, నిమ్మరసం కలుపుకుని తాగితే దాన్నే లెమన్ టీ అంటారు. లెమన్ టీ తాగితే జీర్ణక్రియ సజావుగా సాగుతుంది. శీతాకాలంలో వేధించే జలుబు, దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే కీళ్ల నొప్పులను దూరం చేయడానికి మంచి ఎనర్జీ డ్రింక్ లా ఉపయోగపడుతుంది. 

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి