కొవ్వును వెన్నలాగా కరిగించే బట్టర్‌ ఫ్రూట్‌..! ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అవాక్కే..

ఇది మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించి.. మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. తద్వారా రక్తనాళాలు కూడా ఆరోగ్యవంతంగా ఉంటాయి. ఇది గుండె సమస్యలను స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇందులో విటమిన్ ఇ కెరోటనాయిడ్స్‌ ఉండటం వల్ల ఇది కంటి ఆరోగ్యానికి, చర్మానికి మేలు చేస్తుంది. ఈ బట్టర్ ఫుడ్ రెగ్యులర్ గా డైట్ లో చేర్చుకోవడం వల్ల డయాబెటిస్ వంటివి కూడా నియంత్రణలో ఉంటాయి.

కొవ్వును వెన్నలాగా కరిగించే బట్టర్‌ ఫ్రూట్‌..! ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అవాక్కే..
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజూ సగం అవకాడో (సుమారు 50-70 గ్రాములు) తింటే సరిపోతుందని అంటున్నారు. గుండె, మధుమేహ రోగులు దీన్ని రెగ్యులర్ డైట్‌లో ఉంచుకోవచ్చు. కిడ్నీ, లివర్ రోగులు మాత్రం వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే దీనిని తినాలి. అవకాడో నిస్సందేహంగా 'సూపర్‌ఫుడ్'. కానీ ఇది అందరికీ ఒకేలా మేలు చేయదనే విషయం మర్చిపోకూడదు.

Updated on: Jul 11, 2025 | 7:19 PM

అవకాడో ఆరోగ్యకరమైన, పోషకాలు అధికంగా ఉండే పండు. మార్కెట్లో దీని ధర చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ప్రజలు దీనిని తినడానికి ఇష్టపడరు. మీరు అవకాడోను క్రమం తప్పకుండా తీసుకుంటే, అది ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యం బాగుంటే, మీకు డాక్టర్‌తో అవసరమే ఉండదని చెబుతున్నారు. ప్రధానంగా ఇది గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఇందులో మోనో అన్సాచ్యురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది.

అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇందులో మోనో అన్‌శాచ్యురేటెడ్ కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. అవకాడోలో విటమిన్ K, C, B5, B6, E వంటి విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. అవకాడోలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. గుండె సంబంధిత వ్యాధుల నుండి రక్షిస్తుంది. అవకాడోలో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరచుతుంది. బరువు తగ్గాలనుకునేవారికి ఇది బెస్ట్‌ ఫుడ్‌. అవకాడో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.

అవకాడోలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. తద్వారా రక్తపోటు అదుపులో ఉంటుంది. అవకాడోలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించి.. మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. తద్వారా రక్తనాళాలు కూడా ఆరోగ్యవంతంగా ఉంటాయి. ఇది గుండె సమస్యలను స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇందులో విటమిన్ ఇ కెరోటనాయిడ్స్‌ ఉండటం వల్ల ఇది కంటి ఆరోగ్యానికి, చర్మానికి మేలు చేస్తుంది. ఈ బట్టర్ ఫుడ్ రెగ్యులర్ గా డైట్ లో చేర్చుకోవడం వల్ల డయాబెటిస్ వంటివి కూడా నియంత్రణలో ఉంటాయి.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..