డ్రై ఫ్రూట్స్ మంచివే కానీ.. వీళ్లకు కాదు.. ఒకవేళ తింటే ఏమవుతుందో తెలుసా..

డ్రై ఫ్రూట్స్ అందరికీ ప్రయోజనకరంగా ఉండవని మీకు తెలుసా? కొంతమంది వాటిని పరిమిత పరిమాణంలో తినాలి లేదా అస్సలు తినకూడదు. అసలు డ్రై ఫ్రూట్స్ ను ఎలాంటి వ్యక్తులు తినకూడదు.. ఏ సమస్యలు ఉన్నవారు తినకూడదు.. డైటీషియన్లు ఏం చెబుతున్నారు.. ఈ వివరాలను తెలుసుకుందాం..

డ్రై ఫ్రూట్స్ మంచివే కానీ.. వీళ్లకు కాదు.. ఒకవేళ తింటే ఏమవుతుందో తెలుసా..
మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లతో బాధపడేవారు తమ ఆహారంలో క్రాన్బెర్రీలను చేర్చుకోవచ్చు. దీనిలోని సహజ పదార్థాలు బ్యాక్టీరియాను తగ్గిస్తాయి. ఇది UTI లక్షణాలను తగ్గిస్తుంది. ఇన్ఫెక్షన్‌ను నివారిస్తుంది. మలబద్ధకం సమస్య నుండి ఉపశమనం పొందడంలో ఎండుద్రాక్షలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. వాటిలో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది. మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

Updated on: Jun 26, 2025 | 1:59 PM

బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్ష, వాల్‌నట్స్, అంజీర పండ్లు, ఖర్జూర, జీడిపప్పు, పిస్తాపప్పులు వంటి డ్రై ఫ్రూట్స్ సాధారణంగా ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా భావిస్తారు. వీటిని తరచుగా సూపర్‌ఫుడ్‌గా పేర్కొంటారు.. ఈ డ్రై ఫ్రూట్స్‌లో ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు – ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందించడంతో పాటు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. కానీ డ్రై ఫ్రూట్స్ అందరికీ ప్రయోజనకరంగా ఉండవని మీకు తెలుసా?.. అవును .. కొంతమంది వాటిని నివారించాలి లేదా పరిమిత పరిమాణంలో తీసుకోవాలి.. లేకపోతే ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుందంటున్నారు డైటీషియన్లు, ఆరోగ్య నిపుణులు..

డైటీషియన్ డాక్టర్ అనామిక గౌర్ ప్రకారం.. ముందుగా, డ్రై ఫ్రూట్స్ కు అలెర్జీ ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా జీడిపప్పు, వాల్‌నట్స్ లేదా బాదం వంటివి కొంతమందిలో అలెర్జీ ప్రతిచర్యలకు కారణమవుతాయి. దీని లక్షణాలు తేలికపాటి దద్దుర్లు నుంచి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది – అనాఫిలాక్సిస్ వరకు ఉంటాయి.. ఇది ప్రాణాంతకం కావచ్చు.

డ్రై ఫ్రూట్స్ ఎవరు తినకూడదు?

అలెర్జీలు ఉన్న వ్యక్తులు:

చాలా మందికి డ్రై ఫ్రూట్స్/నట్స్, ముఖ్యంగా బాదం, జీడిపప్పు లేదా వాల్‌నట్స్ అంటే అలెర్జీ ఉంటుంది. ఇవి చర్మపు దద్దుర్లు, దురద, వాపు, శ్వాస సమస్యలు లేదా తీవ్రమైన అలెర్జీ ప్రతిచర్యలు (అనాఫిలాక్సిస్) కూడా కలిగిస్తాయి. అలాంటి వ్యక్తులు ఎలాంటి డ్రై ఫ్రూట్స్‌కు దూరంగా ఉండాలి లేదా వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే వాటిని తీసుకోవాలి.

బరువు తగ్గుతున్న వ్యక్తులు:

డ్రై ఫ్రూట్స్/నట్స్ ఖచ్చితంగా ఆరోగ్యకరమైనవే కానీ వాటిలో కేలరీలు – కొవ్వు అధికంగా ఉంటాయి. మీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తూ, ప్రతిరోజూ గుప్పెడు కంటే ఎక్కువ డ్రై ఫ్రూట్స్ తింటే, అది బరువు తగ్గడానికి బదులుగా బరువు పెరగడానికి దారితీస్తుంది. ముఖ్యంగా జీడిపప్పు, ఎండుద్రాక్షలలో చక్కెర, కేలరీలు రెండూ ఎక్కువగా ఉంటాయి.

అధిక రక్తపోటు లేదా గుండె సమస్యలు ఉన్నవారు:

డ్రై ఫ్రూట్స్‌లో ఉప్పు కలిపితే అధిక రక్తపోటు ఉన్నవారు వాటికి దూరంగా ఉండాలి. అలాంటప్పుడు గుండె సమస్యలు, అధిక రక్తపోటు పెరిగే అవకాశం ఉంది. అలాంటి వారు ఉప్పు లేని, కాల్చిన డ్రై ఫ్రూట్స్‌ను పరిమిత పరిమాణంలో తినాలి.

డయాబెటిస్ రోగులు:

ఎండుద్రాక్ష, ఖర్జూరం, అంజీర వంటి డ్రై ఫ్రూట్స్‌లో సహజ చక్కెర అధికంగా ఉంటుంది. మధుమేహంతో బాధపడేవారు వాటిని పరిమిత పరిమాణంలో, వైద్యుల సూచనతో తీసుకోవాలి.

జీర్ణ సమస్యలు ఉన్న వ్యక్తులు:

కొంతమందికి డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల గ్యాస్, అసిడిటీ లేదా మలబద్ధకం సమస్యలు రావచ్చు. ముఖ్యంగా వాటిని నానబెట్టి తినకపోతే లేదా ఎక్కువ పరిమాణంలో తింటే సమస్యలు వస్తాయి. జీర్ణ సమస్యలు ఉన్నవారు డ్రై ఫ్రూట్స్‌ను తక్కువ పరిమాణంలో మాత్రమే తినాలని సూచిస్తున్నారు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..