AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఖాళీ కడుపుతో పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిదా.. హానికరమా? పే..ద్ద.. కథే ఉందిగా..

పండ్లలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.. ఇవి శరీరాన్ని వ్యాధుల నుండి రక్షించి ఆరోగ్యంగా ఉంచుతాయి. కానీ చాలా మంది మనస్సులలో ఈ ప్రశ్న తలెత్తుతుంటుంది.. ఖాళీ కడుపుతో పండ్లు తినడం సరైనదేనా..? తింటే ఏమవుతుంది.. ఉదయాన్నే పండ్లు తింటే ఏమైనా సమస్యలు వస్తాయా..? అని ఆలోచిస్తుంటారు..

ఖాళీ కడుపుతో పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిదా.. హానికరమా? పే..ద్ద.. కథే ఉందిగా..
Fruits
Shaik Madar Saheb
|

Updated on: Jun 26, 2025 | 9:16 AM

Share

ఉదయం అనేది శరీరాన్ని శుభ్రపరచడానికి.. విషాన్ని తొలగించడానికి మంచి సమయం.. పండ్లు ప్రకృతి ప్రసాదించిన అత్యంత స్వచ్ఛమైన, పోషకమైన ఆహారం.. కొంతమంది ఉదయం ఖాళీ కడుపుతో పండ్లు తింటారు. అవి త్వరగా జీర్ణమవుతాయని.. ఖాళీ కడుపుతో తింటే, వాటి పోషకాలు కూడా శరీరానికి మంచి ప్రయోజనం చేకూరుస్తాయని నమ్ముతారు. దీనితో పాటు, పండ్లు శరీరానికి శక్తిని కూడా ఇస్తాయి.. ఇది రోజు ప్రారంభంలో మిమ్మల్ని తాజాగా ఉంచుతుంది. పండ్లలో అధిక మొత్తంలో ఫైబర్, నీరు ఉంటాయి, ఇవి కడుపు శుభ్రంగా, జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.

తలెత్ఖాళీ కడుపుతో పండ్లు ప్రయోజనకరంగా ఉంటాయా లేదా? అని కొంతమందికి ఈ ప్రశ్న తలెత్తుతుంటుంది.. దీనిగురించి ఢిల్లీలోని రాజీవ్ గాంధీ హాస్పిటల్‌లోని అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అజిత్ జైన్ పలు ఆసక్తికర విషయాలను చెప్పారు. ఖాళీ కడుపుతో పండ్లు తినడం శరీరానికి తాజాదనం, శక్తిని ఇవ్వడానికి ఉత్తమ మార్గం అని డాక్టర్ జైన్ అంటున్నారు. మీ జీర్ణ సామర్థ్యం ప్రకారం.. వాటిని ఎప్పుడు తినాలి అనే దాని ప్రకారం.. శరీరానికి ఏ పండ్లు ప్రయోజనకరంగా ఉంటాయో గుర్తుంచుకోవాలి.. సరైన సమయం – పద్ధతిని అవలంబించడం ద్వారా, మీరు పండ్ల నుంచి పూర్తి ప్రయోజనాలను పొందవచ్చు.

ఖాళీ కడుపుతో పండ్లు ఎప్పుడు తినకూడదు?

మీకు ఆమ్లత్వం లేదా గ్యాస్ సమస్య ఉంటే..

మీ కడుపు చాలా సున్నితంగా ఉంది లేదా మీకు ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (IBS) ఉంది.

నారింజ లేదా నిమ్మకాయ వంటి కొన్ని సిట్రస్ పండ్లను ఖాళీ కడుపుతో తినడం వల్ల చికాకు కలుగుతుంది.

అటువంటి పరిస్థితిలో, మీరు పండును వేరే ఆహారంతో కలిపి తినడం లేదా ఉదయం తేలికపాటి అల్పాహారం తిన్న తర్వాత పండు తీసుకోవడం మంచిది.

ఖాళీ కడుపుతో ఏ పండ్లు తినాలి?

బొప్పాయి: కడుపుని శుభ్రపరుస్తుంది, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.

ఆపిల్: ఫైబర్ – యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటం వలన రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

పుచ్చకాయ: హైడ్రేషన్ కు ఉత్తమమైనది, బరువు తగ్గడానికి సహాయపడుతుంది

జామ: జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది

బెర్రీలు: వృద్ధాప్యాన్ని తగ్గిస్తాయి. చర్మానికి ప్రయోజనకరంగా ఉంటాయి.

పండ్లు తినడానికి సరైన సమయం ఏది? ఏ సమయంలో ఎలాంటి పండ్లు తినాలంటే..

ఉదయం ఖాళీ కడుపుతో: ఆపిల్, బొప్పాయి, జామ, పుచ్చకాయ

అల్పాహారం తర్వాత: అరటిపండు, నారింజ, నిమ్మకాయ

సాయంత్రం స్నాక్స్: దానిమ్మ, ద్రాక్ష, చికు లాంటివి తినొచ్చు..

పండ్లు – ఆహారం మధ్య కనీసం 30 నిమిషాల గ్యాప్ ఉండాలని గుర్తుంచుకోండి. తద్వారా రెండూ సరిగ్గా జీర్ణమవుతాయి.. ఏమైనా సమస్యలుంటే.. వైద్య నిపుణులను సంప్రదించండి..

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఉడికించిన గుడ్డును ఇలా తింటే.. మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే..
ఉడికించిన గుడ్డును ఇలా తింటే.. మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే..
20 ఏళ్ల పోరాటం.. ప్రభుత్వ కొలువు వచ్చిన మర్నాడే రిటైర్‌మెంట్!
20 ఏళ్ల పోరాటం.. ప్రభుత్వ కొలువు వచ్చిన మర్నాడే రిటైర్‌మెంట్!
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్