Semiya Pulihora Recipe: పొడి పొడిలాడే రుచికరమైన సేమ్యా నిమ్మకాయ పులిహోర తయారీ

|

Feb 05, 2022 | 4:25 PM

Semiya Pulihora Recipe: పిల్లలు, పెద్దలు ఎవరైనా సరే.. రోజు ఒకే రకమైన ఆహార పదార్ధాలు తినాలంటే అబ్బ బోరు అంటారు. ముఖ్యంగా టిఫిన్స్ గా ఇడ్లీ(Idly), దోశ(Dosa), వంటివి పెడితే.. కొత్త రుచులను అడుగుతారు..

Semiya Pulihora Recipe: పొడి పొడిలాడే రుచికరమైన సేమ్యా నిమ్మకాయ పులిహోర తయారీ
Semiya Pulihora
Follow us on

Semiya Pulihora Recipe: పిల్లలు, పెద్దలు ఎవరైనా సరే.. రోజు ఒకే రకమైన ఆహార పదార్ధాలు తినాలంటే అబ్బ బోరు అంటారు. ముఖ్యంగా టిఫిన్స్ గా ఇడ్లీ(Idly), దోశ(Dosa), వంటివి పెడితే.. కొత్త రుచులను అడుగుతారు. అయితే అటువంటి వారికీ డిఫరెంట్ టెస్ట్ తో సేమ్యా తో పులిహోర మంచి ఎంపిక. పుల్ల పుల్లగా కమ్మగా ఉండడంతో పిల్లలు ఎంతగానో ఇష్టపడతారు. ఈరోజు రుచికరమైన సేమ్యా పులిహోరా తయారీ గురించి తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు:

సేమ్యా- ఒక కప్పు,
జీడిపప్పు,
వేరుశనగ గుళ్ళు,
పచ్చి మిర్చి,
ఎండుమిర్చి,
కరివేపాకు,
పసుపు,
ఆవాలు,
మినపపప్పు,
శనగపప్పు,
ఉప్పు రుచికి సరిపడా,
నూనె,
కొంచెం నెయ్యి,
నిమ్మ చెక్క 1

తయారీవిధానం: ముందుగా స్టవ్ వెలిగించి దళసరి గిన్నె పెట్టుకుని అందులో అరలీటరు నీరు పోసుకొని మరిగించాలి. నీరు మరిగిన అనంతరం అందులో పావు టీస్పూను పసుపు, కొంచెం ఉప్పు వేసుకుని కొంచెం సేపు తర్వాత కప్పు సేమ్యా వేసుకుని .. కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఇలా రెండు నిముషాలు సేమ్యా ఉడికించిన అనంతరం సగం ఉడికిన సేమ్యా ను నీటి నుంచి వేరు చేసి… అందులో చల్లని నీటిని పోసుకోవాలి. ఇలా చేయడం వలన సేమ్యా ఒకదానితో ఒకటి అంటుకోకుండా పొడిపొడిగా ఉంటుంది. సేమ్యాను ప్లేట్ లోనికి తీసుకుని చల్లారాబెట్టుకోవాలి.
తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకుని నెయ్యి కొంచెం, కొంచెం నూనేవేసుకుని జీడిపప్పు వేయించుకుని నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి వేయించుకుని తర్వాత ఒక టీస్పూన్ శనగపప్పు, ఒక టీస్పూన్ ఆవాలు, ఒక టీ స్పూన్ మినప్పప్పు, పల్లీలు వేసుకుని వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు,ఎండుమిర్చి రుచికి సరిపడా ఉప్పు వేసుకుని పోపులు వేయించుకోవాలి. అనంతరం ఈ పాపులను చల్లారిన సేమ్యాపై వేసుకుని కలుపుకోవాలి. సేమ్యా చల్లారిన తర్వాత నిమ్మరసం పిండుకొని ఒక్కసారి కలిపి.. పైన ఇష్టమైన వారు కొత్తిమీర జల్లుకుంటే టెస్టి టెస్టి సేమ్యా పులిహోర రెడీ. ఈ సేమ్యాపులిహోరను టిఫిన్ గా లేదా స్నాక్ గా కూడా తినవచ్చు.

Also Read: 1945 Movie: క్లైమాక్స్ లేని రానా 1945 సినిమా ఓటీటీలో రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు ప్రసారం కానున్నదంటే..