Orange Benefits: 30 రోజులు ఈ కమలా పండు తింటే ఎన్ని లాభాలో తెలుసా ? రెట్టింపు అందం, ఆరోగ్యం..

ఇందులో పొటాషియం, ఫైబర్‌ పుష్కలంగా ఉండి, కొలెస్ట్రాల్ నియంత్రిస్తుంది. చర్మ సంరక్షణలోనూ నారింజ ఎంతో మేలు చేస్తుంది. చర్మానికి సహజసిద్ధంగా నిగారింపును ఇస్తుంది. చర్మం ముడతలు తగ్గించి యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. ఆరెంజ్ తినడం వల్ల మలబద్ధకం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు దరి చేరకుండా ఉంటాయి.

Orange Benefits: 30 రోజులు ఈ కమలా పండు తింటే ఎన్ని లాభాలో తెలుసా ? రెట్టింపు అందం, ఆరోగ్యం..
Orange

Updated on: Jun 24, 2025 | 1:53 PM

ఆరోగ్యానికి మేలు చేసే పండ్లలో నారింజ ముందు వరుసలో ఉంటుంది. నారింజలో ఉండే విటమిన్లు మనల్ని అనేక రకాల ఆరోగ్య సమస్యల నుండి రక్షిస్తాయి. నారింజలో విటమిన్ సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వరుసగా 30 రోజుల పాటు క్రమం తప్పకుండా నారింజ తీసుకుంటే శరీరంలో మీరు ఊహించని అద్భుత మార్పులు జరుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నెల రోజుల పాటు క్రమం తప్పకుండా నారింజ తినటం వల్ల కలిగే లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

రోజుకో ఆరెంజ్ తినటం వల్ల లెక్కలెనన్నీ లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. నారింజ సీజనల్‌ వ్యాధులకు చెక్‌ పెడుతుంది. జలుబు, దగ్గు వంటి వైరల్ ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. ఇందులో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరాన్ని డీటాక్స్ చేసేందుకు, వివిధ రకాల వ్యాధుల్నించి రక్షించేదుకు దోహదపడుతుంది. వెయిట్ లాస్ ప్రక్రియలో వారికి కూడా నారిజం అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో కేలరీలు తక్కువగా ఉండి ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. దీంతో అతిగా తినకుండా ఆకలిని అరికడుతుంది. క్రమంగా బరువు తగ్గేందుకు తోడ్పడుతుంది.

రోజు ఒక నారింజ తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో పొటాషియం, ఫైబర్‌ పుష్కలంగా ఉండి, కొలెస్ట్రాల్ నియంత్రిస్తుంది. చర్మ సంరక్షణలోనూ నారింజ ఎంతో మేలు చేస్తుంది. చర్మానికి సహజసిద్ధంగా నిగారింపును ఇస్తుంది. చర్మం ముడతలు తగ్గించి యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. ఆరెంజ్ తినడం వల్ల మలబద్ధకం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు దరి చేరకుండా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..