AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోజూ ఉదయాన్నే ఉసిరి రసం తాగితే శరీరంలో జరిగే మ్యాజిక్‌ ఇదే..!

మార్నింగ్‌ ఉసిరి రసం తాగడం వల్ల బరువు తగ్గొచ్చు. ఉసిరి రసంలో కొంచెం మిరియాల పొడి కలిపి తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఉదయాన్నే ఉసిరి రసం తాగడం వల్ల డయాబెటిస్‌ కంట్రోల్ అవుతుంది. ఉసిరి రసం ఇన్సులిన్‌ స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది. ఉసిరి రసం తాగితే జీవక్రియ రేటు పెరుగుతుంది.

రోజూ ఉదయాన్నే ఉసిరి రసం తాగితే శరీరంలో జరిగే మ్యాజిక్‌ ఇదే..!
Amla juice
Jyothi Gadda
|

Updated on: Jun 24, 2025 | 1:38 PM

Share

తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి ఉసిరికాయ, ఆమ్లా రసం ఒక వరంలా పనిచేస్తుంది. ఆమ్లా రసంలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల, ఆమ్లా రసం తాగడం వల్ల మెలనిన్ ఉత్పత్తిని ప్రేరేపించడానికి, జుట్టును పునరుజ్జీవింపజేయడానికి, జుట్టును వేర్ల నుండి సహజంగా నల్లగా మార్చడానికి సహాయపడుతుంది. తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి, ఒక గ్లాసు నీటిలో రెండు చెంచాల ఆమ్లా రసం కలిపి తాగడం ప్రయోజనకరంగా ఉంటుంది. మీ జుట్టు వేర్ల నుండి నల్లగా, ఒత్తుగా పెరగడానికి ఈ రసాన్ని మూడు నుండి నాలుగు నెలల పాటు నిరంతరం తీసుకోండి.

అంతేకాదు.. ఖాళీ కడుపుతో ఉసిరి రసం తాగడం వల్ల జీర్ణ ఆరోగ్యం మెరుగుపడుతుంది. పోషకాల శోషణ సామర్థ్యం మెరుగుపడుతుంది. దీంతో పోషకాల లోపం దరి చేరదు. ఉసిరి రసంలో విటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది రోగనిరోధకశక్తిని బలంగా మార్చుతుంది. ఉసిరి రసం తాగితే సీజనల్‌ ఇన్ఫెక్షన్ల రిస్క్‌ తగ్గుతుంది. ఖాళీ కడుపుతో ఉసిరి రసం తాగడం వల్ల జీర్ణ స్రావాల ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో జీర్ణ సమస్యలు రావు. మలబద్దకం, అజీర్తి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి కణాలను ఆరోగ్యంగా మార్చుతాయి. ఉసిరి తింటే చర్మం ఎలాస్టిసిటీ పెరుగుతుంది. దీంతో ముడతలు తగ్గుతాయి.

ఉదయాన్నే ఉసిరి రసం తాగడం వల్ల కిడ్నీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు కిడ్నీ సమస్యలను దూరం చేస్తాయి. ఉదయాన్నే ఉసిరి రసం తాగడం వల్ల కాలేయం డీటాక్సిఫై అవుతుంది. ఉసిరి రసం తాగితే కాలేయ వాపు సమస్యలు తగ్గుతాయి. కాలేయ పనితీరు మెరుగుపడుతుంది. మార్నింగ్‌ ఉసిరి రసం తాగడం వల్ల బరువు తగ్గొచ్చు. ఉసిరి రసంలో కొంచెం మిరియాల పొడి కలిపి తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఉదయాన్నే ఉసిరి రసం తాగడం వల్ల డయాబెటిస్‌ కంట్రోల్ అవుతుంది. ఉసిరి రసం ఇన్సులిన్‌ స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది. ఉసిరి రసం తాగితే జీవక్రియ రేటు పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఇరాన్‌కు ట్రంప్ బిగ్ వార్నింగ్.. హోర్ముజ్‌లో హైటెన్షన్!
ఇరాన్‌కు ట్రంప్ బిగ్ వార్నింగ్.. హోర్ముజ్‌లో హైటెన్షన్!
పాములకు శాపంగా ఈ మొక్క.. రహస్యాల పుట్ట..ఇంట్లో ఉంటే ఆయురారోగ్యాలు
పాములకు శాపంగా ఈ మొక్క.. రహస్యాల పుట్ట..ఇంట్లో ఉంటే ఆయురారోగ్యాలు
తెలంగాణ పోలీసులపై మహారాష్ట్రలో దాడి.. బేడీలతోనే దొంగ పరార్..
తెలంగాణ పోలీసులపై మహారాష్ట్రలో దాడి.. బేడీలతోనే దొంగ పరార్..
ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగు థ్రిల్లర్ మూవీ..
ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగు థ్రిల్లర్ మూవీ..
వన్డే వరల్డ్ కప్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. ఆసీస్ సంచలన నిర్ణయం
వన్డే వరల్డ్ కప్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. ఆసీస్ సంచలన నిర్ణయం
యూఎస్ మెరైన్ క్యాంప్‌పై ఇరాన్ క్షిపణి దాడి?
యూఎస్ మెరైన్ క్యాంప్‌పై ఇరాన్ క్షిపణి దాడి?
ఈ ఆకు సర్వరోగ నివారిణి.. ఉదయాన్నే ఇలా తిన్నారంటే.. బ్లడ్ షుగర్‌
ఈ ఆకు సర్వరోగ నివారిణి.. ఉదయాన్నే ఇలా తిన్నారంటే.. బ్లడ్ షుగర్‌
ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో స్పెషల్ ఫీచర్లు ఇవే
ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో స్పెషల్ ఫీచర్లు ఇవే
ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..