ఆహా..భలే మజా..! ఈ తాటి ముంజలు.. వేసవి తాపానికి ఉపశమనం.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..

|

Mar 22, 2024 | 5:42 PM

తాటి ముంజల సీజన్‌ వచ్చేసింది. సమ్మర్‌ సీజన్‌ వచ్చిందంటే చాలు తెల్లతెల్లటి తాటి ముంజలు ముత్యపు చిప్పల్లా మెరిసిపోతూ మనకు నోరూరిస్తాయి. చెప్పాలంటే కల్తీలేనివి, స్వచ్ఛమైన పండు ఏదైనా ఉందా అంటే.. అది తాటి ముంజలే అని చెప్పొచ్చు. అందుకే తాటిముంజలకు అంతర్జాతీయంగానూ పేరుంది. ‘ఐస్‌ ఆపిల్స్‌’ గా పిలుస్తారు. తాటి ముంజలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

ఆహా..భలే మజా..! ఈ తాటి ముంజలు.. వేసవి తాపానికి ఉపశమనం.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..
Ice Apple
Follow us on

తాటికల్లు తెలియనివారుండరు.. వైద్యులు సైతం తాటికల్లుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. దాంతో తాటికల్లుకు ప్రస్తుతం గిరాకీ మరింతగా పెరిగింది. తాటికల్లులో ఖనిజ లవణాలు, విటమిన్‌లు సమృద్ధిగా ఉంటాయి. ఇవన్నీ శరీరానికి రోగ నిరోధక శక్తిని పెంచేందుకు దోహదం చేస్తాయి.. ఉదయాన్నే పరగడుపున స్వచ్ఛమైన తాటికల్లు తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలని పెద్దలు చెబుతుంటారు. ఇప్పటికే పలు పరిశోధనల్లో కూడా తేలిపోయింది. అయితే, తాటికల్లు మాత్రమే కాదు.. ఇప్పుడు తాటి ముంజల సీజన్‌ వచ్చేసింది. సమ్మర్‌ సీజన్‌ వచ్చిందంటే చాలు తెల్లతెల్లటి తాటి ముంజలు ముత్యపు చిప్పల్లా మెరిసిపోతూ మనకు నోరూరిస్తాయి. చెప్పాలంటే కల్తీలేనివి, స్వచ్ఛమైన పండు ఏదైనా ఉందా అంటే.. అది తాటి ముంజలే అని చెప్పొచ్చు. అందుకే తాటిముంజలకు అంతర్జాతీయంగానూ పేరుంది. ‘ఐస్‌ ఆపిల్స్‌’ గా పిలుస్తారు. తాటి ముంజలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

తాటి ముంజలలో విటమిన్ ఎ, విటమిన్ కె వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. వేసవి కాలంలో శరీరం చాలా త్వరగా డీహైడ్రేషన్‌కు గురవుతుంది. అలాంటి పరిస్థితుల్లో తాటిముంజలు శరీరాన్ని హైడ్రేట్ గా మారుస్తాయి. డీహైడ్రేషన్, హీట్ స్ట్రోక్ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి తాటి ముంజలను తినాలని నిపుణులు చెబుతున్నారు. దీన్ని తినడం వల్ల శరీరం చల్లబడుతుంది. మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. స్థూలకాయంతో బాధపడేవారు తాటిముంజలను తినాలి. ఈ పండులో క్యాలరీ కంటెంట్ చాలా తక్కువ. తాటి ముంజలు తినడం వల్ల ఎక్కువ సేపు ఆకలి వేయదు, ఎందుకంటే అందులో ఎక్కువ నీరు ఉంటుంది.

పొట్ట సమస్యలకు తాటి ముంజలు ప్రభావవంతంగా పనిచేస్తాయి.. పొట్టను చల్లబరచడంలో చాలా మేలు చేస్తుంది. ఇది జీర్ణ ఎంజైమ్‌లను పెంచడం ద్వారా ఎసిడిటీ సమస్యను దూరం చేయడంలో సహాయపడుతుంది. తాటిముంజలు శరీరంలోని చక్కెర, ఖనిజాల ప్రమాణాలను సమతుల్యం చేస్తాయి. పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. దాంతో రక్తపోటు అదుపులో ఉండి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. లివర్ సంబంధిత సమస్యలను దూరం చేస్తాయి. తాటి ముంజలు తినడం వలన చెడు కొలస్ట్రాల్ పోయి మంచి కొలస్ట్రాల్ వృద్ధి చెందుతుంది. మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలను బాగా తగ్గిస్తుంది. అంతేకాకుండా ఇవి శరీరంలోని హానికర వ్యర్థ పదార్థాలను తొలగించడంలో అద్భుతంగా పని చేస్తుంది.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..