ఈ డ్రై ఫ్రూట్‌ మీ బ్లడ్ షుగర్ పెరగకుండా చేస్తుంది..! ఏ వయసువారు ఎన్ని తినాలి..?

|

Jun 24, 2024 | 11:09 AM

అయితే.. అతిగా తింటే మాత్రం ఇబ్బందులు వస్తాయని హెచ్చరిస్తున్నారు. నిపుణులు సూచించిన ప్రకారం బాదం పప్పులు తినడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చని చెబుతున్నారు. ఆరోగ్యంగా ఉండటానికి పెద్దలు రోజూ 20 వరకు బాదం పప్పులను తినొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. వీటిని ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ కంటే ముందే తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని అంటున్నారు.

ఈ డ్రై ఫ్రూట్‌ మీ బ్లడ్ షుగర్ పెరగకుండా చేస్తుంది..! ఏ వయసువారు ఎన్ని తినాలి..?
Almonds
Follow us on

పోషకాహారంలో డ్రై ఫ్రూట్స్ ముందు వరుసలో ఉంటాయి. వీటిని తినడం ద్వారా చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ ఉదయం బాదంపప్పు తినడం ఆరోగ్యానికి మంచిదని పోషకాహార నిపుణులు అంటున్నారు. నీళ్లలో నానబెట్టిన బాదంపప్పును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి. మంచి జీర్ణక్రియను నిర్వహించడానికి బాదం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు చాలా సహాయపడుతుంది. బాదం కూడా గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా బాదం సహాయపడుతుంది. బాదంలోని మెగ్నీషియం ఇన్సులిన్ ప్రభావాన్ని పెంచుతుంది. బాదం చర్మాన్ని తాజాగా ఉంచుతుంది.

బాదంలో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు చర్మకాంతిని పెంచుతాయి. దీంతో చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది. బాదం ఎముకలను బలోపేతం చేస్తుంది. బలమైన ఎముకలకు కాల్షియం, ఫాస్పరస్ అవసరం. బాదంలో రెండూ సమృద్ధిగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు రోజూ బాదంపప్పు తినాలి. బాదం పప్పు తింటే కొవ్వు పెరగదు. రోగనిరోధక శక్తిని పెంచడంలో బాదం చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. రోజూ తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అయితే.. అతిగా తింటే మాత్రం ఇబ్బందులు వస్తాయని హెచ్చరిస్తున్నారు.

నిపుణులు సూచించిన ప్రకారం బాదం పప్పులు తినడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చని చెబుతున్నారు. ఆరోగ్యంగా ఉండటానికి పెద్దలు రోజూ 20 వరకు బాదం పప్పులను తినొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. వీటిని ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ కంటే ముందే తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని అంటున్నారు.

ఇవి కూడా చదవండి

చిన్న పిల్లలకు రోజుకు 3-4 బాదంపప్పులు తినిపించవచ్చని సూచిస్తున్నారు. అలాగే 4-8 సంవత్సరాల వయసు మధ్య ఉన్నవారు రోజుకు 5-8 బాదం బాదంపప్పులు తినిపించవచ్చని చెబుతున్నారు. 9 నుంచి 18 సంవత్సరాల వయసు మధ్య ఉన్నవారు రోజుకు 10 బాదంపప్పుల వరకూ తింటే ఆరోగ్యంగా ఉంటారని సూచిస్తున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..