వేసవి కాలం వచ్చేసింది.. భానుడి ప్రతాపాన్ని తట్టుకోవడానికి ఈ హెల్తీ టీ ఎంతో బెస్ట్.. చిటికెలో రెడీ..

|

Mar 31, 2021 | 12:58 PM

Agni Tea: వేసవి కాలం వచ్చేసింది. ప్రారంభంలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇప్పటికే ఉష్టోగ్రతలు సాధరణ స్థితి కంటే ఎక్కువగా

వేసవి కాలం వచ్చేసింది.. భానుడి ప్రతాపాన్ని తట్టుకోవడానికి ఈ హెల్తీ టీ ఎంతో బెస్ట్.. చిటికెలో రెడీ..
Agni Tea
Follow us on

Agni Tea: వేసవి కాలం వచ్చేసింది. ప్రారంభంలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇప్పటికే ఉష్టోగ్రతలు సాధరణ స్థితి కంటే ఎక్కువగా నమోదవుతుండడం కొంత ఆందోళన కలిగించే అంశం. ఇక ఉద్యోగాలు, వ్యాపారాలు చేయడానికి బయటకు వెళ్లేవారు ఈ వేడిగాలులకు అనారోగ్యలపాలవుతున్నారు. ఇవే కాకుండా మళ్లీ విజృంభిస్తున్న కరోనా వైరస్ కూడా ఒకింత భయాన్ని కలిగిస్తోంది. ఇక ఈ సమయంలో రోగ నిరోధక శక్తిని పెంపోందించే ఆహారాన్ని తీసుకోవడం అత్యంత ముఖ్యం. ఈ కాలంలో సాధ్యమైనంతవరకు హైడ్రేట్‏గా ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం పండ్లు, కూరగాయలు, నీరు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఇక ఎండకాలం అనగానే చాలా మంది టీ తాగడం మానేస్తుంటారు. అలాంటి వారికి వేడిని పోగోట్టడమే కాకుండా.. రోగనిరోధక పెంచేందుకు ఈ డీటాక్స్ టీ తీసుకోవడం బేస్ట్. అయితే శరీర బరువు తగ్గాలనుకునేవారు దీనిని తీసుకోకపోవడం మంచిందని నిపుణులు ఆయుర్వేద డాక్టర్ నీతిశేత్ తెలిపారు. డిటాక్స్ పానీయాలు జీర్ణక్రియ లేదా వేడిని పెంచడానికి సహయపడతాయి. అలాగే ఇవి శరీరంపై ఉండే అవాంచిత, పేరుకుపోయిన విషాన్ని వదిలించుకోవడానికి సహయపడతాయి. రోగనిరోధక శక్తిని పెంపోందిచడమే కాకుండా.. మానసిక ఉత్సహాన్ని పెంచుతాయి. అయితే ఈ వేసవికాలంలో రోగనిరోధక శక్తిని పెంపోందించుకునేందుకు ఈ అగ్ని టీ సహయపడుతుందని ఆయుర్వేద డాక్టర్ వసంత్ తెలిపారు.

అగ్ని టీకి కావల్సిన పదార్థాలు..

నీరు.. లీటర్
కారపు మిరియాలు.. చిటికెడు
అల్లం.. సగం ముక్క
రాక్ ఉప్పు.. ఒక టీ స్పూన్
బెల్లం.. రెండు టేబుల్ స్పూన్లు.
మాపుల్ సిరప్
నిమ్మరసం

ఎలా తయారు చేయాలి..

ముందుగా నిమ్మరసం మినహా.. పైన తెలిపిన అన్ని పదార్థాలను ఒక బాణలిలోవేసి దాదాపు 20 నిమిషాలు ఉడకబెట్టాలి. కొన్ని నిమిషాలు చల్లబరచాలి. చల్లారిన తర్వాత కొంచెం నిమ్మరసం పిండి.. ఆ రసాన్ని వడకట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు మీ శరీరాన్ని డీహైడ్రెట్ కాకుండా సహయపడుతుంది. రోజూ రెండుసార్లు మాత్రమే దీనిని తీసుకోవడం ఉత్తమం.

Also Read:

Beauty Tips: ఈ పనులు చేస్తే మీ ముఖం ఆయిల్‏గా మారుతుంది.. అవెంటో తెలుసా..

Holi 2021: హోలీలో వాడే గులాల్ రంగు నుంచి మీ జుట్టును ఈ విధంగా కాపాడుకోండిలా..