Hair Growth: ఒత్తైన జుట్టు కోరునుకునేవారు తినాల్సిన ఆహారాలివే.. వీటిని తింటే మృధువైన కేశాలు కూడా మీ సొంతం..!

|

Jan 20, 2023 | 8:48 AM

జుట్టు రాలడం అనేది పెద్ద సమస్యగా చెప్పుకోవాలి. జట్టు మన రూపానికి అందం తెచ్చేదిగా ఉంటుంది. జుట్టు రాలినా, లేకపోయినా మనలోని ఆత్మస్థైర్యం సన్నగిల్లడం సాధారణంగా జరిగేదే. మనలో చాలా మంది..

Hair Growth: ఒత్తైన జుట్టు కోరునుకునేవారు తినాల్సిన ఆహారాలివే.. వీటిని తింటే మృధువైన కేశాలు కూడా మీ సొంతం..!
Hair Growth Tips
Follow us on

మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మందిని అనేక ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. వాటికి ఉద్యోగ బాధ్యతలు కూడా మిళితం కావడంతో చిన్న వయసు నుంచే బీపీ, షుగర్, మధుమేహం, చర్మ కేశ సమస్యలు మొదలవుతున్నాయి. ముఖ్యంగా జుట్టు రాలడం అనేది పెద్ద సమస్యగా చెప్పుకోవాలి. జట్టు మన రూపానికి అందం తెచ్చేదిగా ఉంటుంది. జుట్టు రాలినా, లేకపోయినా మనలోని ఆత్మస్థైర్యం సన్నగిల్లడం సాధారణంగా జరిగేదే. మనలో చాలా మంది జుట్టు పల్చబడటం, బట్టతల జుట్టు, చుండ్రు, జిడ్డుగల జుట్టు, పొడిబారిన జుట్టు ఇలాంటి ఎన్నో జుట్టు సమస్యలను ఎదుర్కొంటారు. మన జుట్టు రోజుకు 0.44 మిమీ పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

అయితే జుట్టు పెరుగుదల రేటు అనేది మన జుట్టు కోసం మనం ఎలా శ్రద్ధ వహిస్తున్నాము, జుట్టుపై ఉపయోగించే ఉత్పత్తులు, జుట్టును  రక్షించుకునే విధానంపై ఆధారపడి ఉంటుంది. ఇంకా జుట్టు రాలిపోవడానికి అనేక ఇతర అంశాలు కూడా ప్రభావితం చేస్తాయి. ఇక ఈ సమస్యను అధిగమించాలంటే సరైన ఆహారం తీసుకోవడం ద్వారానే సాధ్యమవుతుంది. మన జుట్టు బలంగా మరియు ఆరోగ్యంగా పెరగడానికి ప్రోటీన్లు, ఐరన్, జింక్, విటమిన్ కే వంటి పోషకాలు అవసరం. ఈ విటమిన్లు, ప్రొటీన్లు అన్నీ మనం తినే ఆహారంలోనే లభిస్తాయి. ప్రొటీన్లు, బయోటిన్, ఐరన్, జింక్ ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల జుట్టు పెరుగుదల పెరుగుతుంది. మరి అందుకోసం ఏయే పదార్థాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..

  1. గుడ్లు: జుట్టు పెరుగుదల విషయంలో గుడ్లు మొదటి స్థానంలో ఉంటాయి. జుట్టు పెరుగుదలకు అత్యంత ముఖ్యమైన పోషకాలుగా పరిగణించే ప్రోటీన్, బయోటిన్‌లకు గుడ్లు గొప్ప మూలం. మీ రోజువారీ ఆహారంలో గుడ్లను చేర్చుకోవడం వల్ల మీకు తగినన్ని ప్రోటీన్లు అందుతాయి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో అవి సహాయపడతాయి.
  2. బాదం: బాదంపప్పులో విటమిన్ ఎ, విటమిన్ బి1, విటమిన్ బి6, విటమిన్ ఇ, అధిక మొత్తంలో మెగ్నీషియం పుష్కలంగా ఉన్నాయి. ఇవి మీ జుట్టు పొడవుగా,బలంగా పెరగడానికి సహాయపడతాయి. బాదం జుట్టు పెరుగుదలకు మాత్రమే కాదు చుండ్రుతో పోరాడటానికి కూడా సహాయపడుతుంది.
  3. ఇవి కూడా చదవండి
  4. అరటిపండ్లు: జుట్టు పెరుగుదలకు అరటిపండ్లను ఉత్తమ ఆహారంగా పరిగణిస్తారు. అరటిపండ్లు జుట్టును మృదువుగా చేయడానికి సహాయపడే పొటాషియంను కలిగి ఉంటాయి. ఇవి జుట్టు స్థితిస్థాపకతను నిర్వహించడానికి, జుట్టు దెబ్బతినకుండా నిరోధించే నేచురల్ నూనెలను కూడా కలిగి ఉంటాయి. కాబట్టి జుట్టు పెరుగుదల కోసం ప్రతిరోజూ అరటిపండ్లను తినడం అలవాటు చేసుకోండి.
  5. ఆకుకూరలు: గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఐరన్‌కు గొప్ప వనరులు. ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు అవసరమైన విటమిన్ ఎ, విటమిన్ సి, ఐరన్, బీటా కెరోటిన్ వంటి అనేక పోషకాలు వీటిలో ఉన్నాయి.  ఇవి జుట్టు పెరుగుదలను మెరుగుపరచడంలో ఉపయోగకరంగా ఉంటాయి.
  6. క్యారెట్లు: క్యారెట్ కంటికి మంచి ఆహారం అని మనందరికీ తెలుసు కానీ జుట్టు పెరగడానికి క్యారెట్ ఎంతగానో ఉపయోగపడుతుందని మీకు తెలుసా ..? క్యారెట్‌లో విటమిన్ ఎ, విటమిన్ ఇ, బీటా కెరోటిన్ ఉన్నాయి. ఇది మీ జుట్టును మృదువుగా, మెరిసేలా చేస్తుంది. క్యారెట్ రక్త ప్రసరణకు మంచిది, ఇది శరీరంలోని మిగిలిన భాగాలతో పాటు మన తలకు రక్తాన్ని ప్రసరింపజేయడంతో పాటు జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. ఇంకా మీ జుట్టు మూలాల నుండి బలంగా పెరుగుతుంది.
  7. చిలగడదుంపలు: తీపి బంగాళాదుంపల్లో బీటా కెరోటిన్ విరివిగా ఉంటుంది. ఇది జుట్టు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. జుట్టు వేగంగా, అలాగే బలంగా పెరగడానికి సహాయపడుతుంది.
  8. క్యాప్సికమ్‌: క్యాప్సికమ్‌లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉంటాయి. విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. ఇవి శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. అలాగే జుట్టును బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.
  9. అవకాడో: అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. అలాగే విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉంటాయి. అవకాడోను హెయిర్ మాస్క్‌గా కూడా జుట్టుకు అప్లై చేసుకోవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..