Pomegranate: దానిమ్మతో ఎన్ని ప్రయోజనాలలో.. తింటే ఆ సమస్యలకు చెక్ పెట్టినట్లే..

|

Apr 10, 2023 | 6:49 AM

ఫ్రూట్స్ మార్కెట్‌లో ప్రతి వ్యాపారి దగ్గర కనిపించే పండ్లలో దానిమ్మ కూడా ఒకటి. ఇక ఈ దానిమ్మతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు. దానిమ్మలో ఉండే పోషకాలే అందుకు కారణమని చెప్పుకోవాలి. దానిమ్మలో ఫైబర్, ప్రోటీన్, విటమిన్ సీ, ఫోలేట్, పొటాషియం, విటమిన్ ఎ, సీ, ఇ వంటి పోషకాలు పుష్కలంగా..

Pomegranate: దానిమ్మతో ఎన్ని ప్రయోజనాలలో.. తింటే ఆ సమస్యలకు చెక్ పెట్టినట్లే..
Pomegranate Benefits
Follow us on

ఫ్రూట్స్ మార్కెట్‌లో ప్రతి వ్యాపారి దగ్గర కనిపించే పండ్లలో దానిమ్మ కూడా ఒకటి. ఇక ఈ దానిమ్మతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు. దానిమ్మలో ఉండే పోషకాలే అందుకు కారణమని చెప్పుకోవాలి. దానిమ్మలో ఫైబర్, ప్రోటీన్, విటమిన్ సీ, ఫోలేట్, పొటాషియం, విటమిన్ ఎ, సీ, ఇ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే దానిమ్మలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మధుమేహం, క్యాన్సర్, అల్జీమర్స్, ఊబకాయం వంటి వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ముఖ్యంగా దానిమ్మ పండును తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు రక్త ప్రసరణ కూడ సవ్యంగా జరుగుతుంది. దానిమ్మ ఆర్థరైటిస్ సమస్యను కూడా నివారిస్తుంది. జీర్ణక్రియకు కూడా ఇది మేలైన పండు. ఇంకా దానిమ్మ పండ్లతో ఎటువంటి లాభాలు ఉన్నాయంటే..

దానిమ్మ రసం తీసుకోవడం వలన రక్తపోటు సమస్య తగ్గుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా చేస్తాయి. అలాగే ఇది జ్ఞాపకశక్తిని పెంచడంలో మెరుగ్గా సహయపడుతుంది. శస్త్రచికిత్స జరిగిన రోగులకు 2 గ్రాముల దానిమ్మ పళ్లను ఇచ్చినప్పుడు జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అలాగే అల్జీమర్స్ సమస్యను తగ్గించడంలోనూ ఇది ఉపయోగపడుతుంది. దానిమ్మ బరువు, ఊబకాయాన్ని తగ్గించడంలోనూ సహయపడుతుంది. దానిమ్మలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్.. ఫ్రీ రాడికల్స్ ప్రభావం నుంచి రక్షిస్తాయి. అంతేకాక దానిమ్మను తీసుకోవడం వలన యవ్వనంగా కనిపిస్తారు, ఎందుకంటే ఇది యాంటీ ఏజింగ్ మూలం. అలాగే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ప్రీ రాడికల్స్ తో పోరాడి కొలెస్ట్రాల్ సమస్యను తగ్గిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్‌స్టైల్  వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..