కల్తీ కూరగాయలను ఎలా గుర్తించాలి..! ఈ టెస్ట్ చేస్తే ఇట్టే తేలిపోతుంది.. ట్రై చేసి చూడండి..

|

Aug 30, 2021 | 7:54 PM

Green Vegetables: ప్రతిరోజు మనం ఆకుపచ్చ కూరగాయలను తినడానికి మొగ్గు చూపుతాము. ఎందుకంటే ఇవి శరీరానికి వివిధ రకాల విటమిన్లను అందిస్తాయి.

కల్తీ కూరగాయలను ఎలా గుర్తించాలి..! ఈ టెస్ట్ చేస్తే ఇట్టే తేలిపోతుంది.. ట్రై చేసి చూడండి..
Vegetables
Follow us on

Green Vegetables: ప్రతిరోజు మనం ఆకుపచ్చ కూరగాయలను తినడానికి మొగ్గు చూపుతాము. ఎందుకంటే ఇవి శరీరానికి వివిధ రకాల విటమిన్లను అందిస్తాయి. ఆకుపచ్చ కూరగాయలు ఆరోగ్యానికి చాలా అవసరం కూడా. అయితే ఇటీవల ఈ కూరగాయలలో చాలా వరకు కల్తీ చేస్తున్నారు. బహుశా వీటి గురించి మీకు తెలిసుండకపోవచ్చు. నిత్యం మీరు మార్కెట్ నుంచి తీసుకొస్తున్న ఆకుపచ్చ కూరగాయలు స్వచ్ఛంగా ఉన్నాయో లేదో తెలుసుకోవడం కొంచెం కష్టమైన పనే. కల్తీ కూరగాయలు అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. క్యాన్సర్ కారక ప్రభావాలను ప్రేరేపిస్తాయి. ఒకవేళ మీరు తీసుకొస్తున్న కూరగాయలు నిజమైనవా, కల్తీవా తెలుసుకోవాలంటే ఇలా చేయండి. ఆహార భద్రత, ప్రమాణాల అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ఒక టెస్ట్‌ని విడుదల చేసింది. ఈ టెస్ట్ ఎలా చేయాలో ట్విట్టర్ ద్వారా పోస్ట్ కూడా చేసింది. దీనిని పాటిస్తే సరిపోతుంది.

కూరగాయలు కల్తీగా ఉన్నాయో లేదో తనిఖీ చేయడం ఎలా?
1. నానబెట్టిన ద్రవ పారాఫిన్‌లో ముంచిన కాటన్ బాల్ తీసుకోండి
2. ఆకుపచ్చ కూరగాయలపై రుద్దండి
3. కాటన్ రంగు మారకపోతే కూరగాయలో కల్తీ ఉండదు.
4. కాటన్ ఆకుపచ్చగా మారితే కూరగాయలు కల్తీ అయ్యాయని అర్థం.

మలాకైట్ గ్రీన్ అంటే ఏమిటి?
మలాకైట్ గ్రీన్ ఒక టెక్స్‌టైల్ డై. దీనిని చేపలకు యాంటీప్రొటోజోల్, యాంటీ ఫంగల్ మందుగా ఉపయోగిస్తారు. ఇది జల జీవులపై ఏర్పడే ఫంగల్ దాడులు, ప్రోటోజోవాన్ ఇన్ఫెక్షన్లు, ఇతర వ్యాధులను నియంత్రిస్తుంది. అయితే మిరపకాయలు, బఠానీలు, పాలకూర వంటి కూరగాయలు పచ్చగా కనిపించేలా చేయడానికి కూడా దీనిని ఉపయోగిస్తారు.

ఇది ఎందుకు ప్రమాదకరం?
నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ప్రకారం.. ఈ రంగు విషపూరితం. ఇది కార్సినోజెనిసిస్, మ్యూటాజెనిసిస్, క్రోమోజోమల్ ఫ్రాక్చర్, టెరాటోజెనిసిటీ, శ్వాసకోశ వ్యాధులను కలిగిస్తుంది. ఇది బహుళ అవయవ కణజాలాలను దెబ్బతీస్తుంది.

Hero Moto Corp: బైక్‌లు, స్కూటర్లపై డిస్కౌంట్, ఎక్సేంజ్‌ ఆఫర్లు ప్రకటించిన హీరో..! ఏ వాహనాలపై ఎంతో తెలుసుకోండి..

Vikarabad District: కారు గల్లంతు ఘటనలో డ్రైవర్‌ ఆచూకీ లభ్యం.. వరదలో చెట్టు కొమ్మ చిక్కడంతో

Milk With Anjeer Figs: రాత్రి పడుకునే ముందు పాలు, అంజీర్ కలిపి తీసుకోవచ్చా ? ఈ విషయాలను కచ్చితంగా తెలుసుకోవాల్సిందే..