AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heart Attack: గుండెపోటుకు చెక్‌పెట్టే అద్భుతమైన చిట్కాలు.. మహిళలు ముఖ్యంగా మీకోసమే!

ప్రస్తుత రోజుల్లో ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి కారణంగా చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. ముఖ్యంగా ఆడవాళ్లు, ఇంట్లో పని, ఆఫీస్ పనిలో ఒత్తిడి కారణంగా మరింత త్వరగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇందులో ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు. అయితే మీ రోజువారి జీవితంలో కొన్ని అలవాట్లు చేసుకోవడం ద్వారా 40 ఏళ్ల తర్వాత కూడా మహిళలు గుండె సమస్యలను తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం పదండి.

Heart Attack: గుండెపోటుకు చెక్‌పెట్టే అద్భుతమైన చిట్కాలు.. మహిళలు ముఖ్యంగా మీకోసమే!
Women's Heart Health
Anand T
|

Updated on: Sep 23, 2025 | 9:08 PM

Share

40 ఏళ్లు నిండటం జీవితంలో ఒక కొత్త దశను సూచిస్తుంది. కుటుంబం, పని, బాధ్యతల మధ్య, మహిళలు తరచుగా తమ ఆరోగ్యంపై దృష్టి పెట్టడం మర్చిపోతారు. కానీ నిజం ఏమిటంటే, ఈ వయస్సులో వాకిరి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ముఖ్యంగా ఈ దశలో మహిళలు తమ గుండె ఆరోగ్యాన్ని ప్రత్యేకంగా చూసుకోవాలి. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. 40 ఏళ్ల వయసులోనూ మహిళలు తమ రోజువారీ జీవితంలో కొన్ని చిన్న మార్పులు చేసుకోవడం వల్ల దీర్ఘకాలికంగా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వివరించారు. ఆ అలవాట్లు ఎంటనేవి ఇప్పుడు తెలుసుకుందాం.

40 ఏళ్ల వయసులో మీ గుండెను జాగ్రత్తగా చూసుకోవడం ఎందుకు ముఖ్యం?

45 ఏళ్లు పైబడిన దాదాపు సగం మంది మహిళలు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారని ఈ సమస్యలను తేలికగా తీసుకుంటారని, ఇది దీర్ఘకాలంలో వారి గుండెకు తీవ్రమైన సమస్యలను కలిగిస్తుందని అనేక అధ్యయనాలు చూపిస్తున్నాయి. కాబట్టి, మీరు మీ హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే, మీరు ఈ కొన్ని విషయాలను మీ దినచర్యలో చేర్చుకోవాలి.

మీ హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి 5 సులభమైన మార్గాలు

ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవడం

  • మీ రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకోండి.
  • మీ గుండె ఆరోగ్యం గురించి మీ వైద్యుడితో మాట్లాడండి.

రోజూ వ్యాయామం, లేదా యోగా చేయడం

  • రోజూ కనీసం 30 నిమిషాలు నడక, యోగా, పరుగు లేదా సైక్లింగ్ చేయండి.
  • లిఫ్ట్‌లో వెళ్లడం మానేసి మెట్లపై నడవడం అలవాటు చేసుకోండి.

సమతుల్య ఆహారం తీసుకోండి

  • మీ రోజువారీ ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు చేర్చండి.
  • ప్యాక్ చేసిన, నూనెతో కూడిన స్నాక్స్ తినడం ఆపేయండి.

వర్క్‌ ప్రెజర్, నిద్రపై శ్రద్ధ వహించండి

  • రోజూ ధ్యానం లేదా లోతైన శ్వాస సాధన చేయండి.
  • రోజూ 7–8 గంటలు నిద్రపోండి తప్పకుండా నిద్రపోండి
  • ఒత్తిడి, నిద్ర లేకపోవడం రెండూ గుండెకు హాని కలిగిస్తాయి

మీ బరువును కంట్రోల్‌లో ఉంచుకోండి

  • అధిక బరువు గుండెపై ఒత్తిడిని కలిగిస్తుంది. కాబట్టి మీరు మీ బరువును కంట్రోల్‌లో ఉంచుకోండి
  • ప్రతిరోజూ కొంచెం నడవడం, చురుకుగా ఉండటం బరువు నియంత్రణలో సహాయపడుతుంది.

 Note: పైన పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్‌ నుంచి సేకరించిన వివరాల ఆధారంగా అందించబడినవి.. వీటిపై మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యులను సంప్రదించండి)

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.