AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పడుకున్న వెంటనే నిద్ర పట్టట్లేదా..? ఈ 5 ఫుడ్స్ తింటే చాలు.. క్షణాల్లో గాఢ నిద్రలోకి..

రాత్రిపూట నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్నారా? మీ డిన్నర్ తర్వాత తీసుకునే కొన్ని ఆహారాలు నిద్రకు మద్దతు ఇవ్వవచ్చని నిపుణులు చెబుతున్నారు. అరటిపండ్లు, చెర్రీస్, పెరుగు, బాదం–వాల్‌నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్, గోరువెచ్చని పాలు వంటి ఆహారాలు రాత్రిపూట సరైన మోతాదులో తీసుకోవడం వల్ల ప్రశాంతమైన నిద్రకు సహాయపడవచ్చు.

పడుకున్న వెంటనే నిద్ర పట్టట్లేదా..? ఈ 5 ఫుడ్స్ తింటే చాలు.. క్షణాల్లో గాఢ నిద్రలోకి..
Top 5 Dinner Foods For Good Sleep
Shaik Madar Saheb
|

Updated on: Aug 09, 2026 | 9:30 PM

Share

చాలామంది జీవితంలో ఎదుర్కొనే సాధారణ సమస్యలలో నిద్రలేమి ఒకటి. తినకముందు ఏ పనినైనా చేసే ఉత్సాహం, డిన్నర్ తర్వాత హఠాత్తుగా నిద్ర ముంచుకొచ్చే అనుభవం మనందరికీ తెలిసిందే.. ఆహారానికి నిద్రను కలిగించే తత్వం ఉంటుందని, సరైన ఆహారాలను ఎంచుకోవడం ద్వారా సుఖమైన, గాఢమైన నిద్ర పొందవచ్చని వైద్య నిపుణులు వివరిస్తున్నారు. రాత్రిపూట డిన్నర్‌లో లేదా డిన్నర్ తర్వాత తీసుకోవాల్సిన ఐదు ముఖ్యమైన ఆహారాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.. కఫ సంబంధిత సమస్యలు లేని వారికి ఈ ఆహారాలు అద్భుతమైన నిద్రకు సహాయపడతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

అరటిపండు: నిద్రకు సహాయపడే ఆహారాలలో అరటిపండు ముఖ్యమైనది. అరటిపండులో పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కండరాల నొప్పులు (మజిల్ క్రాంప్స్) తగ్గించడానికి తోడ్పడతాయి. అంతేకాకుండా, ఇది కడుపు నిండుగా ఉండి ఆకలి అనే భావన లేకుండా చేస్తుంది. దీని వల్ల హాయిగా, కమ్మగా నిద్రపడుతుంది. డిన్నర్ చేసిన తర్వాత ఒకటి లేదా రెండు గంటలు ఆగి అరటిపండు తింటే సుఖమైన నిద్ర మీ సొంతమవుతుందని పేర్కొంటున్నారు.

చెర్రీస్: మంచి నిద్ర కోసం చాలామందికి తెలియని, కానీ అత్యంత ప్రభావవంతమైన ఆహారం చెర్రీస్. చెర్రీస్‌లో మెలటోనిన్ ఉత్పత్తిని ప్రేరేపించే ప్రత్యేకమైన తత్వం ఉంటుంది. మెలటోనిన్ అనేది సహజమైన స్లీప్ హార్మోన్, ఇది నిద్రను ప్రేరేపించడానికి, నియంత్రించడానికి సహాయపడుతుంది. చెర్రీస్ తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు.. ఇది గాఢమైన నిద్రను ప్రోత్సహిస్తుంది.

పెరుగు: అనాదిగా మనం ఉపయోగిస్తున్న, గాఢమైన నిద్రకు తోడ్పడే మరో ఆహారం పెరుగు. ఆయుర్వేదంలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. పెరుగు “స్తోతస్సుల” పనితీరును ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా మానసిక ప్రశాంతతను అందించే “మనోవహ స్తోతస్సుల”ను అడ్డగించడం ద్వారా చక్కటి నిద్రను ప్రోత్సహిస్తుంది. ఇందులో ప్రోటీన్లు, కాల్షియం కూడా పుష్కలంగా ఉంటాయి. కాల్షియం కండరాల నొప్పులు రాకుండా చేస్తుంది. ఇది ప్రశాంతమైన నిద్రకు చాలా అవసరం. మంచి గడ్డపెరుగు రాత్రిపూట తీసుకోవడం వల్ల ప్రశాంతమైన నిద్ర పొందవచ్చు.

డ్రై ఫ్రూట్స్ (ఎండు పండ్లు): నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి డ్రై ఫ్రూట్స్ ఒక అద్భుతమైన పరిష్కారం. డ్రై ఫ్రూట్స్‌లో సహజ చక్కెర కంటెంట్ ఫైబర్‌తో కలిసి ఉంటుంది. ఈ సహజ చక్కెరలు మెదడుకు గ్లూకోజ్‌ను అందిస్తాయి.. తద్వారా మెదడుకు అవసరమైన పోషకాలు అందుతాయి. మెదడుకు సరైన పోషణ అందడం వల్ల మంచి నిద్ర వస్తుంది. బాదం, వాల్‌నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్ నిద్రను మెరుగుపరచడంలో సహాయపడతాయి.

పాలు: ట్రిప్టోఫాన్ అధికంగా ఉండే పాలు మంచి నిద్రకు దోహదపడే అద్భుతమైన ఆహార పదార్థం. రాత్రిపూట టీ, కాఫీలు నిద్రను చెడగొడతాయి.. కానీ పాలు అలా చేయవు. నిద్రపోవడానికి ముందు గోరువెచ్చని పాలు తీసుకోవడం వల్ల మంచి నిద్ర వస్తుంది. అర గ్లాసు నుంచి గ్లాసు వరకు గోరువెచ్చని పాలను తేనె లేదా పటికబెల్లం పొడి కలుపుకొని తాగితే ప్రశాంతమైన నిద్ర మీ సొంతమవుతుంది.

ఈ ఐదు ఆహారాలను రాత్రిపూట డిన్నర్ తర్వాత మీ దినచర్యలో భాగం చేసుకోవడం ద్వారా సుఖమైన, గాఢమైన నిద్రను పొందవచ్చని ఆరోగ్య నిపుణులతోపాటు ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. అయితే నిద్రలేమి తరచుగా కొనసాగితే కేవలం ఆహారంపై ఆధారపడకుండా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
చుక్క నూనె లేని కమ్మటి సొరకాయ బజ్జీ.. హెల్దీగా ఇలా చేసుకోండి!
చుక్క నూనె లేని కమ్మటి సొరకాయ బజ్జీ.. హెల్దీగా ఇలా చేసుకోండి!
ఈ 5 ఫుడ్స్ తింటే చాలు.. క్షణాల్లో గాఢ నిద్రలోకి..
ఈ 5 ఫుడ్స్ తింటే చాలు.. క్షణాల్లో గాఢ నిద్రలోకి..
ఒక్క లడ్డు తిన్నా చాలు.. ఒంట్లో రక్తం ఫుల్లుగా పడుతుంది..
ఒక్క లడ్డు తిన్నా చాలు.. ఒంట్లో రక్తం ఫుల్లుగా పడుతుంది..
ఫొటోలో చూసి అమాయకులు అనుకునేరు.. తిరుమలలో వీళ్లు చేసే పనులు ..
ఫొటోలో చూసి అమాయకులు అనుకునేరు.. తిరుమలలో వీళ్లు చేసే పనులు ..
కలహమాడి గెలవకుంటే నిమిషమన్న నీది కాదు... ఆర్జీవికి నచ్చిన పాట ఇదే
కలహమాడి గెలవకుంటే నిమిషమన్న నీది కాదు... ఆర్జీవికి నచ్చిన పాట ఇదే
SBIలో 1,538 క్లర్క్ ఉద్యోగాలు.. డిగ్రీ అర్హతతో సూపర్ చాన్స్..
SBIలో 1,538 క్లర్క్ ఉద్యోగాలు.. డిగ్రీ అర్హతతో సూపర్ చాన్స్..
ఇమ్యూనిటీని 10 రెట్లు పెంచే అద్భుత కషాయం.. ఉదయాన్నే ఇలా చేస్తే
ఇమ్యూనిటీని 10 రెట్లు పెంచే అద్భుత కషాయం.. ఉదయాన్నే ఇలా చేస్తే
డాక్టర్స్ 6 నెలలు మాత్రమే బతుకుతావ్ అన్నార్.. కట్ చేస్తే..
డాక్టర్స్ 6 నెలలు మాత్రమే బతుకుతావ్ అన్నార్.. కట్ చేస్తే..
ఈ 5 ఉదయపు అలవాట్లు మీ జీవితాన్ని మార్చేస్తాయి!
ఈ 5 ఉదయపు అలవాట్లు మీ జీవితాన్ని మార్చేస్తాయి!
చాణక్య నీతి: భార్య అందంగా ఉంటే భర్తకు ఎందుకు సమస్యలు వస్తాయి?
చాణక్య నీతి: భార్య అందంగా ఉంటే భర్తకు ఎందుకు సమస్యలు వస్తాయి?