దొండకాయ అంటే చాలా మంది ఇష్టం ఉంటుంది. ముఖ్యంగా దొండకాయ ఫ్రై, వేపుడు చాలా ఇష్టంగా తింటారు.
కొంత మంది పిల్లలు ప్రతి రోజూ దొండకాయ తినడానికి ఆసక్తి చూపుతారు. కానీ పెద్ద వారు చెబుతుంటారు అస్సలే దొండకాయ తినకూడదు అని.
దొండకాయ తినడం వలన మతి మరుపు వస్తుంది , అస్సలే తినకూడదు అని చెబుతుంటారు. అందుకే ఇప్పటికీ కొంత మంది దొండకాయ తినరు.
మరి నిజంగానే దొండకాయ తింటే మతిమరుపు వస్తుందా? అసలు దీని వెనకున్న రహస్యం ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
దొండకాయ తింటే మతిమరుపు వస్తుంది అనేది పూర్తిగా అవాస్తవం అంటున్నారు నిపుణులు. దొండ, దొంగ దగ్గరిగా ఉండటం వలన దొండ తింటే దొంగతనం చేస్తారు అనేవారంట.
అలా, దొండ తినడం వలన తెలివితేటలు ఉండవుదొంగతనం చేస్తారు, మతిమరుపు వస్తుందని చెప్పేవారంట. అలా దొండకాయ తింటే దొంగతనం చేస్తారని పెద్ద వారు చెప్పేవారంట.
అంతే కాకుండా ఆయుర్వేదంలో దొండకాయ తమో గుణం పెంచుతుంది, అంటే దీనిని తినడం వలన బద్ధకం, నిద్ర ఎక్కువగా వస్తుంది. దీనిని కొందరు మతిమరుపుగా చెప్పుకొచ్చారు.
అందుకే చాలా మంది ఇప్పటికీ దొండకాయ తినడానికి భయపడి పోతుంటారు. నిజంగానే మతిమరుపు వస్తుందనుకుంటారు.కానీ దొండకాయ తినడం వలన మతిమరుపు రాదంట, దొండకాయ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది మెదడు ఆరోగ్యానికి చాలా మంచిది.
దొండకాయ తినడం వలన ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్, విటమిన్ సి, ఐరన్ వంటివి, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి.