Paratha Offer: 32 అంగుళాల పరోటా.. తింటే లక్ష రూపాయల బహుమతి..?

|

Feb 06, 2022 | 7:05 PM

Eat Paratha Offer: మీరు పరోటాలు ఎక్కువగా తింటారా.. అయితే మీకో సవాల్‌.. రెండు పరోటాలు తింటే లక్షరూపాయల బహుమతి. జైపూర్‌లో 32 అంగుళాల

Paratha Offer: 32 అంగుళాల పరోటా.. తింటే లక్ష రూపాయల బహుమతి..?
32 Inch Paratha
Follow us on

Eat Paratha Offer: మీరు పరోటాలు ఎక్కువగా తింటారా.. అయితే మీకో సవాల్‌.. రెండు పరోటాలు తింటే లక్షరూపాయల బహుమతి. జైపూర్‌లో 32 అంగుళాల రెండు పరోటాలను గంటలో తింటే అతనికి లక్ష రూపాయల బహుమతి ఆఫర్ చేశారు. ఇది మాత్రమే కాదు ఈ ఫీట్ సాధిస్తే మీకు ఇక్కడ జీవితాంతం పరోటా ఉచితం. జైపూర్‌లోని న్యూ సంగనేర్ రోడ్‌లో జైపూర్ పరోటా జంక్షన్ పేరుతో ఒక రెస్టారెంట్ నిర్వహిస్తోంది. ఇక్కడ 32-అంగుళాల పరోటా లభిస్తుంది. ఇది 4 వేర్వేరు పరిమాణాలలో దొరుకుతుంది. Zomato వెబ్‌సైట్ ప్రకారం.. జైపూర్ పరోటా రెస్టారెంట్‌లో 72 రకాలకు పైగా 32 అంగుళాల పరోటాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో బంగాళాదుంప, ఉల్లిపాయ, పనీర్‌తో సహా అనేక రకాల్లో లభిస్తుంది. ఇది రెగ్యులర్, మీడియం, లార్జ్, ఎక్స్‌ట్రా లార్జ్ అనే 4 సైజులలో లభిస్తుంది. మీ ఆకలి మీతో ఎంత మంది వ్యక్తులు ఉన్నారనే దాని ప్రకారం మీరు ఆర్డర్ చేయవచ్చు.

తయారీ విధానం

1. 5 అడుగుల పాన్‌: ఈ పరోటా సిద్ధం చేయడం అంత సులభం కాదు. దీని తయారీకి 5 అడుగుల పాన్ ఉపయోగిస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా తయారు చేశారు.

2) 40 అంగుళాల రోలింగ్ పిన్: పరోటాను రోలింగ్ చేయడానికి ప్రత్యేక రోలింగ్ పిన్ తయారు చేశారు. 32 అంగుళాల పరోటాలను రోల్ చేయడానికి 40 అంగుళాల పొడవు గల రోలింగ్ పిన్ ఉపయోగిస్తారు.

3) 20 రకాల మసాలా దినుసులు: ఈ రుచికరమైన పరోటాను తయారు చేయడానికి 20 రకాల మసాలాలు ఉపయోగిస్తారు. ఇవి రుచిని పెంచే ప్రత్యేక మసాలాలు.

4) పరాటాలో 2 కిలోల పిండి, 1.5 కిలోల సగ్గుబియ్యం: ఒక పరోటా కోసం రెండు కిలోల పిండి, 1.5 కిలోల సగ్గుబియ్యం ఉపయోగిస్తారు. బంగాళదుంపలు, మసాలాలతో తయారు చేసిన సగ్గుబియ్యాన్ని రెండు కిలోల పిండిలో నింపి రోల్ చేయడం అంత సులభం కాదు.

5) ఒక పరోటా నలుగురికి సరిపోతుంది: ఒక పరోటాని నలుగురు సులభంగా తినవచ్చు. కట్ చేసిన తర్వాత బాహుబలి ప్లేట్‌లో సాస్, గ్రీన్ చట్నీ, వెల్లుల్లి చట్నీతో సర్వ్ చేస్తారు. ఇది మరింత రుచికరంగా ఉంటుంది.

Viral Photos: ప్రపంచంలో ఈ 5 రకాల చేపలు ప్రాణాంతకం.. క్షణాల్లో మనిషి ప్రాణాలు తీస్తాయి..?

Viral Video: గేదె, కుక్కల మధ్య లాంగ్‌జంప్‌ పోటీ.. ఆ గట్టునుంటావా.. ఈ గట్టుకొస్తావా..?

Vastu Tips: ఆరోగ్యం కోసం అద్భుత వాస్తు చిట్కాలు.. అస్సలు విస్మరించకూడదు..?