Health Tips: శృంగారం, సంతానోత్పత్తి విషయంలో వీక్‌గా ఉన్నారా..? ఈ ఫుడ్స్ తీసుకుంటే మీ స్టామినా డబుల్..

|

Aug 09, 2022 | 9:06 AM

ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది పురుషులు సంతానోత్పత్తి సమస్య నుంచి బయటపడేందుకు ఏవేవో చర్యలు తీసుకుంటుంటారు. డాక్టర్లను సైతం సంప్రదిస్తారు.

Health Tips: శృంగారం, సంతానోత్పత్తి విషయంలో వీక్‌గా ఉన్నారా..? ఈ ఫుడ్స్ తీసుకుంటే మీ స్టామినా డబుల్..
Relationship
Follow us on

Food To Increase Fertility For Male: ప్రస్తుత కాలంలో పురుషులలో తక్కువ సంతానోత్పత్తి సమస్య ప్రస్తుత రోజుల్లో సర్వసాధారణంగా మారింది. అదే సమయంలో నేటి కాలంలో చాలా మంది పురుషులు వంధ్యత్వ సమస్యతో పోరాడుతున్నారు. సంతానోత్పత్తిని ప్రభావితం చేసే ఆహారం, మద్యం, ధూమపానం వంటి అనేక కారణాలు దీని వెనుక ఉన్నాయి. ఇది కాకుండా పురుషులు ఆఫీస్ టెన్షన్, అలసట కారణంగా సంతానోత్పత్తికి సంబంధించిన సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది పురుషులు సంతానోత్పత్తి సమస్య నుంచి బయటపడేందుకు ఏవేవో చర్యలు తీసుకుంటుంటారు. డాక్టర్లను సైతం సంప్రదిస్తారు. కానీ ముఖ్యంగా జీవనశైలి, తీసుకునే ఆహారంలో మార్పు అవసరం అని నిపుణులు పేర్కొంటున్నారు. మీరు కూడా ఇలాంటి సమస్యతో బాధపడుతుంటే చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సంతానోత్పత్తిని పెంచడానికి ఏమి చేయాలో నిపుణులు పలు సూచనలు ఇస్తున్నారు. దీని కోసం ముఖ్యంగా కొన్ని ఆహారాలను చేర్చుకోవాలి. సంతానోత్పత్తిని పెంచడానికి ఎలాంటి ఆహారాలను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

సంతానోత్పత్తి.. శక్తిని పెంచడానికి పురుషులు ఈ ఆహారాలను తీసుకోవాలి..

ఆవు పాలు తాగాలి, ఆవు నెయ్యి తినాలి, తేనె, తోటకూర, త్రిఫలం, శిలాజిత్, తెల్ల ముల్లంగి తినాలి. తృణధాన్యాలు, మొలకలు, ఉలవలు, ఉసిరికాయ, గుమ్మడి గింజలు, అక్రోట్లను రెగ్యులర్‌గా తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

పురుషులు ఈ ఆహారాన్ని ఎందుకు తీసుకోవాలి?

ఈ ఆహారాలన్నీ పురుషులలో స్పెర్మ్ కౌంట్‌ను పెంచడంలో సహాయపడతాయి. ఇంకా ఈ ఆహారాలను తీసుకోవడం ద్వారా పురుషుల్లో లైంగిక శక్తి కూడా మెరుగుపడుతోంది. ప్రతిరోజూ ఈ ఆహారాన్ని తీసుకుంటే, వారి సంతానోత్పత్తి కొన్ని వారాల్లో మెరుగుపడుతుంది. అంతే కాదు ఈ ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల పురుషుల్లో స్టామినా కూడా పెరిగి దాంపత్య జీవితం ఆనందమయంగా మారుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లక్ చేయండి